WAS THAT TOLLYWOOD YOUNG HERO BEATEN BY AUDIENCE AT HYDERABAD THEATER AND HERE THE DETAILS PK
Tollywood Hero: ఆ హీరోను ఆడియన్స్ కొట్టారా.. ఎక్స్ ట్రాలు చేసి అడ్డంగా బుక్కయ్యాడట..!
ప్రతీతాత్మక చిత్రం
Tollywood Hero: హీరోలు బయట కూడా హీరోలుగా ఉండాలంటే వాళ్లు చేసే పనులు కూడా అలాగే ఉండాలి. సినిమాలో మంచి పనులు చేసేసి.. బయట కాస్త పోజులు కొడితే కచ్చితంగా తన్నులు పడతాయి.
హీరోలు బయట కూడా హీరోలుగా ఉండాలంటే వాళ్లు చేసే పనులు కూడా అలాగే ఉండాలి. సినిమాలో మంచి పనులు చేసేసి.. బయట కాస్త పోజులు కొడితే కచ్చితంగా తన్నులు పడతాయి. స్టార్ హీరోలైతే ఏం చేసినా చెల్లుతుంది కానీ ఇప్పుడిప్పుడే వస్తున్న హీరోలు బయట ఎక్స్ ట్రాలు చేస్తే కచ్చితంగా వాటికి ఫలితం కూడా అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు ఇలాంటి సంఘటనే ఒకటి జరిగింది. టాలీవుడ్లో వరస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఓ కుర్ర హీరో.. ఈ మధ్యే ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సినిమా విడుదలకు ముందే చాలా బీరాలు కూడా పోయాడు. నా సినిమాతో అది చేస్తా.. ఇది చేస్తానని చెప్పాడు. కానీ తీరా చూస్తే విడుదలైన తర్వాత తుస్సుమంది. ఇదంతా ఇలా ఉంటే సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్‌లోని ఓ ఏరియాలో థియేటర్‌కు వెళ్లారు సదరు హీరో గారు. అక్కడ ప్రేక్షకులతో కలిసి సినిమా చూసాడు.
అంతా బాగానే ఉంది.. తన సినిమాను ప్రేక్షకులు బాగానే ఎంజాయ్ చేసారని సెల్ఫ్ డబ్బా కూడా కొట్టేసుకున్న తర్వాత థియేటర్ నుంచి బయటికి వస్తున్న క్రమంలో అసలు మ్యాటర్ జరిగింది. సినిమాల్లో చూపించినట్లే బయట కూడా ఆటిట్యూడ్ చూపించబోయి అడ్డంగా బుక్ అయిపోయాడు ఈ కుర్ర హీరో. తనను తాను ఓ బాలయ్యలా ఫీల్ అయిపోయి.. తనపై పడుతున్న ప్రేక్షకులతో దురుసుగా ప్రవర్తించాడు. అక్కడున్నది బాలయ్య కాబట్టి అభిమానులు తాకితే మహద్భాగ్యం అనుకుంటారు. కానీ ఈయన అలా కాదుగా.. అందుకే కాలుకు కాలు.. చేయికి చేయి అన్నట్లుగా సమాధానం ఇచ్చారని అక్కడున్న వాళ్లే చెప్తున్నారు.
టాలీవుడ్ హీరో (Tollywood hero)
బాబు కాస్త ఆటిట్యూడ్ చూపించి ఆడియన్స్‌లో ఒకరిపై చేయి చేసుకున్నాడని తెలుస్తుంది. దాంతో కోపంతో ఊగిపోయిన ప్రేక్షకులు అయ్యగారికి బాగానే మర్యాద చేసి పంపించినట్లు ప్రచారం జరుగుతుంది. తనపై జరిగిన ఈ అనుకోని సంఘటనతో హీరో కూడా షాక్ అయ్యాడని వార్తలొస్తున్నాయి. వెంటనే తేరుకుని అక్కడ్నుంచి బౌన్సర్స్ సాయంతో బయట పడ్డాడని తెలుస్తుంది. అంతే మరి.. సినిమాల్లో ఎలాంటి వేషాలు వేసినా స్క్రిప్ట్ ఉంటుంది కాబట్టి నెక్ట్స్ ఏం జరుగుతుందో తెలుస్తుంది.. కానీ రియల్ లైఫ్ అలా కాదు కదా. ఇక్కడ ఎక్స్ ట్రాలు చేస్తే ఊహించని పరిణామాలు ఎదుర్కోవాల్సిందే.
Published by:Praveen Kumar Vadla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.