రాహుల్ సిప్లిగంజ్‌కు పెళ్లైందా.. అమ్మాయి పునర్నవి కాదు..

Rahul Sipligunj: అప్పటి వరకు కేవలం కొందరికి మాత్రమే తెలిసిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. బిగ్‌బాస్ 3 పుణ్యమా అని రెండు తెలుగు రాష్ట్రాలకు బాగా పరిచయం అయిపోయాడు. ముఖ్యంగా విన్నర్‌గా..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 21, 2020, 6:15 PM IST
రాహుల్ సిప్లిగంజ్‌కు పెళ్లైందా.. అమ్మాయి పునర్నవి కాదు..
రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి (rahul sipligunj marriage)
  • Share this:
అప్పటి వరకు కేవలం కొందరికి మాత్రమే తెలిసిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్.. బిగ్‌బాస్ 3 పుణ్యమా అని రెండు తెలుగు రాష్ట్రాలకు బాగా పరిచయం అయిపోయాడు. ముఖ్యంగా విన్నర్‌గా నిలవడంతో మనోడి ఇమేజ్ కూడా బాగానే పెరిగిపోయింది. అయితే ఈయన బ్యాచ్‌లర్ అని.. ఆ మధ్య బిగ్ బాస్‌లో పునర్నవితో ప్రేమాయణం కూడా నడిపాడని వార్తలున్నాయి. కానీ ఈయనకు పెళ్లి అయిందా..? ఎవరికి తెలియకుండా చేసుకున్నాడా..? ఇప్పుడు ఈ అనుమానాలు ఎందుకొస్తున్నాయి అనుకోవచ్చు. రాహుల్ ప్రాణ స్నేహితుడే ఈ సీక్రెట్ బయటపెట్టాడు.
రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి (rahul sipligunj marriage)
రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి (rahul sipligunj marriage)


రాహుల్, పునర్నవి మధ్య ఏదో ఉందని సోషల్ మీడియాలో వార్తలొస్తున్న తరుణంలో రాహుల్ పెళ్లైపోయిందని ఉన్నట్లుండి న్యూస్ వైరల్ కావడం లేనిపోని కన్ఫ్యూజన్‌కు తావొచ్చినట్లు అవుతుంది. అసలేం జరిగిందంటే.. రాహుల్ బెస్ట్ ఫ్రెండ్ సింగర్ నోయల్ ఈయనకు పెళ్లి శుభాకాంక్షలు చెప్పడంతో ఈ విషయం బయటకు వచ్చింది. బిగ్‌బాస్ మూడో సీజన్‌ తర్వాత పార్టీలు చేసుకుంటూనే ఉన్నాడు రాహుల్. అంతేకాదు తన స్నేహితులకు కూడా రెగ్యులర్‌గా పార్టీస్ ఇస్తున్నాడు.
View this post on Instagram

Happy times! With my happy peeps😍

A post shared by Rahul Sipligunj (@sipligunjrahul) on


ఈ మధ్య కూడా ఓ పార్టీ ఇచ్చిన రాహుల్.. తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసాడు. అందులో వరుణ్ సందేశ్, వితికాతో పాటు సింగర్ నోయల్ కూడా ఉన్నాడు. తన స్నేహితులతో ఈ ఫోటో అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు రాహుల్. దీనికి ఎవరూ ఊహించని విధంగా సింగర్ నోయల్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ కామెంట్ చేసాడు. ఇది చూసి అంతా షాక్ అయ్యారు. అయితే వెంటనే మళ్లీ ఆ కామెంట్ తీసేసాడు నోయల్. పునర్నవి, రాహుల్ ఇష్టపడితే ఇద్దరికి పెళ్లి చేయడానికి తమకేం అభ్యంతరం లేదని రాహుల్ తల్లిదండ్రులు కూడా చెప్పుకొచ్చారు.
రాహుల్, పునర్నవి (Instagram/sipligunjrahul)
రాహుల్, పునర్నవి Instagram/sipligunjrahul

ఈ క్రమంలోనే రాహుల్‌కు నోయల్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని కామెంట్ పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. అందరితో సరదాగా ఉన్న ఫోటోను షేర్ చేసిన రాహుల్.. హ్యాపీ టైమ్స్.. విత్ హ్యాపీ పీప్స్ అంటూ పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌కు సింగర్ నోయెల్ స్పందిస్తూ.. హ్యాపీ మ్యారిడ్ లైఫ్.. నీ పట్ల ఎంతో సంతోషంగా ఉందని కామెంట్ చేసాడు. ఇక ఈ కామెంట్ క్షణాల్లో వైరల్ అయింది. దాంతో రాహుల్ పెళ్లైందా అని అందరికీ అనుమానం వచ్చింది. మరి దీనిపై రాహుల్ సిప్లిగంజ్ ఏం చెప్తాడో చూడాలిక.
First published: May 21, 2020, 6:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading