పవన్ కళ్యాణ్ అనారోగ్యంపై అకీరా నందన్ నిజంగానే స్పందించాడా..?

పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ మీడియాకు ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా కూడా అది సాధ్యం కాదు. ఎందుకంటే జూనియర్ పవర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ ఎప్పుడూ అతడి వెంటే ఉంటుంది కాబట్టి.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 6, 2019, 7:50 PM IST
పవన్ కళ్యాణ్ అనారోగ్యంపై అకీరా నందన్ నిజంగానే స్పందించాడా..?
పవన్ కళ్యాణ్ అకీరా నందన్
Praveen Kumar Vadla | news18-telugu
Updated: April 6, 2019, 7:50 PM IST
పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ మీడియాకు ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా కూడా అది సాధ్యం కాదు. ఎందుకంటే జూనియర్ పవర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ ఎప్పుడూ అతడి వెంటే ఉంటుంది కాబట్టి. అకీరాకు పవన్ తనయుడు అనే ఇమేజ్ కంటే కూడా సొంతంగా వచ్చే క్రేజ్ కావాలనుకుంటున్నాడని రేణు దేశాయ్ కూడా చెప్పింది. అయితే ఎంత కాదనుకున్నా పవర్ స్టార్ ఇమేజ్ మాత్రం అకీరాకు ఆస్తే. ఇక ఇప్పుడు ఈయన తన తండ్రి పవన్ కళ్యాణ్ అనారోగ్యంపై సోషల్ మీడియా వేదికగా స్పందించాడని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఏసీల్లో ఉండాల్సిన పవన్ కళ్యాణ్.. కొన్ని రోజులుగా ఎండకు తిరుగుతూ.. ప్రచారం చేస్తున్నాడు.

Was Really Pawan Kalyan Son Akira Nandan posted a massage about his father health condition pk.. పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ మీడియాకు ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా కూడా అది సాధ్యం కాదు. ఎందుకంటే జూనియర్ పవర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ ఎప్పుడూ అతడి వెంటే ఉంటుంది కాబట్టి. akira nandan twitter,akira nandan facebook,akira nandan pawan kalyan,akira nandan janasena party,pawan akira nandan,akira nandan about pawan kalyan health,akira nandan renu desai,telugu cinema,పవన్ కళ్యాణ్ అకీరా నందన్,అకీరా నందన్ పవన్ అనారోగ్యం,పవన్ అనారోగ్యంపై స్పందించిన అకీరా నందన్,తెలుగు సినిమా,అకీరా నందన్ రేణు దేశాయ్,తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్ అకీరా నందన్

వేళకు సరైన భోజనం కూడా చేయడం లేదని అభిమానులు కూడా ఫీల్ అవుతున్నారు. ఇక కుటుంబ సభ్యులకు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే రెండు రోజుల కింద పవన్ అనారోగ్యానికి గురయ్యాడు. ఉన్నట్లుండి వడదెబ్బ తగలడంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు కూడా. అయితే వెంటనే డిశ్చార్జ్ కూడా అయ్యాడు పవర్ స్టార్. ఇదిలా ఉంటే ఇప్పుడు దీనిపై అకీరా నందన్ తన ఫేస్ బుక్ పేజీలో స్పందించాడని తెలుస్తుంది. కొద్ది రోజులుగా సరైన తిండి.. నిద్ర లేకుండా.. వడదెబ్బ కారణంగా పవన్ కళ్యాణ్ అస్వస్థత పాలయ్యాడు.. అలా ఉన్నా కూడా తెనాలి సభకు పవన్ కళ్యాణ్ గారు సిద్ధమవుతున్నారు.

Was Really Pawan Kalyan Son Akira Nandan posted a massage about his father health condition pk.. పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా నందన్ మీడియాకు ఎంత దూరంగా ఉండాలని ప్రయత్నించినా కూడా అది సాధ్యం కాదు. ఎందుకంటే జూనియర్ పవర్ స్టార్ అనే ట్యాగ్ లైన్ ఎప్పుడూ అతడి వెంటే ఉంటుంది కాబట్టి. akira nandan twitter,akira nandan facebook,akira nandan pawan kalyan,akira nandan janasena party,pawan akira nandan,akira nandan about pawan kalyan health,akira nandan renu desai,telugu cinema,పవన్ కళ్యాణ్ అకీరా నందన్,అకీరా నందన్ పవన్ అనారోగ్యం,పవన్ అనారోగ్యంపై స్పందించిన అకీరా నందన్,తెలుగు సినిమా,అకీరా నందన్ రేణు దేశాయ్,తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్ అకీరా నందన్
నాన్న గారి కష్టం చూస్తుంటే కన్నీరొస్తుంది.. ఆయన కష్టపడుతున్న తీరు చూస్తుంటే నీళ్లు తిరుగుతున్నాయి.. ఓ వ్యక్తి ప్రజల కోసం ఎంత మేరకు కష్టపడాలో అంతా చేస్తున్నారు.. తన సర్వస్వం ధారపోస్తున్నారు అంటూ తండ్రి గురించి ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు అకీరా. అయితే ఇది నిజంగా ఆయన అఫీషియల్ పేజా లేదంటే ఫ్యాన్ పేజ్ అనేది ఆసక్తికరంగా మారింది. అసలు అకీరా పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్‌లో ఉండడు. పైగా రాజకీయాలకు ఇప్పట్నుంచే అలవాటు పడే వయసు కూడా కాదు. దాంతో అది ఫ్యాన్స్ గ్రూప్ నుంచి వచ్చిన మెసేజ్ కావచ్చని అభిప్రాయ పడుతున్నారు అభిమానులు. ఒకవేళ అది నిజంగానే అకీరా పెట్టుంటే ఫ్యాన్స్‌కు అంతకంటే ఆనందం ఇంకేం ఉంటుంది..?
First published: April 6, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...