ఆ స్టార్ హీరో పాములు పెంచుకుంటున్నాడా.. ఫారెస్ట్ ఆఫీసర్స్ రైడ్..

అవునా.. ఎవరైనా ఇంట్లో పిల్లుల్ని పెంచుకుంటారు.. కుక్కలను పెంచుకుంటారు కానీ పాములను పెంచుకోవడం ఏంటి..? అంత విచిత్రమైన అలవాటు ఎవరికి ఉంది అనుకుంటున్నారా..? ఇప్పుడు తమిళ నటుడు అజిత్..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 18, 2019, 4:58 PM IST
ఆ స్టార్ హీరో పాములు పెంచుకుంటున్నాడా.. ఫారెస్ట్ ఆఫీసర్స్ రైడ్..
ప్రతీతాత్మక చిత్రం
  • Share this:
అవునా.. ఎవరైనా ఇంట్లో పిల్లుల్ని పెంచుకుంటారు.. కుక్కలను పెంచుకుంటారు కానీ పాములను పెంచుకోవడం ఏంటి..? అంత విచిత్రమైన అలవాటు ఎవరికి ఉంది అనుకుంటున్నారా..? ఇప్పుడు తమిళ నటుడు అజిత్ గురించి ఇలాంటి వార్తలే సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఈయన ఇంట్లో పాములు పెంచుకుంటున్నాడంటూ కొన్ని వార్తలొచ్చాయి. అయితే అటవీశాఖ అధికారులు సోదా చేయడంతో అలాంటిదేం లేదని తెలిసింది. కానీ అజిత్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న సురేష్ చంద్ర ఇంట్లో మాత్రం 3 అడుగుల పొడవైన పామును పెంచుతున్నాడంటూ మరో వార్త బయటికి వచ్చింది. పాముకు ఆయన ఎలుకలను ఆహారంగా ఇస్తున్నట్లు తెలుస్తుంది.

Was really Forest officers riad on Tamil Superstar Ajith house for Pet Snakes pk అవునా.. ఎవరైనా ఇంట్లో పిల్లుల్ని పెంచుకుంటారు.. కుక్కలను పెంచుకుంటారు కానీ పాములను పెంచుకోవడం ఏంటి..? అంత విచిత్రమైన అలవాటు ఎవరికి ఉంది అనుకుంటున్నారా..? ఇప్పుడు తమిళ నటుడు అజిత్.. ajith,ajith twitter,ajith instagram,ajith kumar movies,ajith snakes,ajith manager,forest officers ajith,forest officers raid ajith house,tamil cinama,అజత్,అజిత్ పాములు,అజిత్ ఇంట్లో పాములు,తమిళ్ సినిమా
అజిత్ (Source: Twitter)


సురేష్ చంద్ర అడ్రస్ తెలియకపోవడంతో తిరువన్మియూర్‌లోని అజిత్ నివాసానికి వెళ్లారు అటవీ శాఖ అధికారులు. అక్కడ వాళ్ల నుంచి అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర ఇంటి చిరునామా తీసుకుని.. అధికారులు అతన్ని విచారించి అతను పామును పెంచుతున్నాడా లేదా అనేది ఆరా తీస్తున్నారు. ఈలోగా అటవీశాఖ అధికారులు అజిత్ ఇంటిపై దాడి చేశారు. అజిత్ ఇంట్లో ఈ దాడి జరగలేదని.. కానీ మేనేజర్ సురేష్ చంద్రపై మాత్రం ఓ కన్నేసి ఉంచినట్లు అధికారుల నుంచి సమాచారం వస్తుంది. కానీ అజిత్ మేనేజర్ మాత్రం తన ఇంట్లో అలాంటి దాడులేం జరగలేదని.. అసలు తన ఇంట్లో పాములు లేవని చెబుతున్నాడు. మొత్తానికి అజిత్ ఇంట్లో పాములు.. అటవీ శాఖ అధికారుల దాడి అనే వార్త మాత్రం తమిళనాట వైరల్ అవుతుంది.
Published by: Praveen Kumar Vadla
First published: December 18, 2019, 4:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading