వెంకీ మామ విషయంలో నాగార్జున అప్సెట్.. అసలు కారణం అదేనా..?

వెంకీ మామ సినిమా తనకెంత ముఖ్యమనేది నాగ చైతన్య చాలా సార్లు చెప్పాడు. మనం తర్వాత తన కెరీర్లో అంత కీలకమైన సినిమా ఇదేనని.. ఈ రెండు సినిమాలు తను ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పాడు చైతూ.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: December 14, 2019, 6:23 PM IST
వెంకీ మామ విషయంలో నాగార్జున అప్సెట్.. అసలు కారణం అదేనా..?
వెంకీ మామ నాగార్జున
  • Share this:
వెంకీ మామ సినిమా తనకెంత ముఖ్యమనేది నాగ చైతన్య చాలా సార్లు చెప్పాడు. మనం తర్వాత తన కెరీర్లో అంత కీలకమైన సినిమా ఇదేనని.. ఈ రెండు సినిమాలు తను ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పాడు చైతూ. దాన్నిబట్టి వెంకీ మామ సినిమాకు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడనేది అర్థమవుతుంది. అలాంటి సినిమా కోసం అక్కినేనితో పాటు దగ్గుబాటి అభిమానులు కూడా బాగానే వేచి చూసారు. ఇప్పుడు విడుదలైంది.. కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఈ సినిమాకు రానాతో పాటు అందరు హీరోలు సపోర్ట్ చేసారు. ప్రమోషన్ కూడా బాగానే చేసారు. అయితే ఎంతమంది చేసినా కూడా నాగార్జున మాత్రం ప్రమోట్ చేయలేదు.

Was Nagarjuna Akkineni upset with the story of Venkatesh Naga Chaitanya multi starrer Venky Mama movie pk వెంకీ మామ సినిమా తనకెంత ముఖ్యమనేది నాగ చైతన్య చాలా సార్లు చెప్పాడు. మనం తర్వాత తన కెరీర్లో అంత కీలకమైన సినిమా ఇదేనని.. ఈ రెండు సినిమాలు తను ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పాడు చైతూ. venky mama,venkatesh,nagarajuna akkineni,nagarajuna naga chaitanya,venkatesh naga chaitanya,venky mama nagarjuna,nagarjuna upset with venky mama,venky mama collections,telugu cinema,nagarjuna twitter,వెంకటేష్,వెంకటేష్ నాగ చైతన్య,వెంకీ మామ,వెంకీ మామ నాగార్జున,నాగార్జున ట్విట్టర్
వెంకీ మామ నాగార్జున

వెంకీ మామ సినిమాపై ముందు నుంచి కూడా ఎందుకో తెలియదు కానీ నాగార్జున అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అందుకే ఈ చిత్రం గురించి ఎక్కడా పెద్దగా స్పందించలేదు.. మాట్లాడలేదు నాగార్జున అంటున్నారు విశ్లేషకులు. ఇదిలా ఉంటే చైతూకు ఇంత ప్రతిష్టాత్మకమైన సినిమా గురించి నాగార్జున పెద్దగా రియాక్ట్ కాకపోవడం ఏంటి అంటూ అక్కినేని అభిమానులు కూడా అయోమయంలో పడిపోయారు. కేవలం విడుదలకు ఓ రోజు ముందు ట్వీట్ మాత్రం వేసాడంతే.. అందులోనూ వెంకీ గురించి ఏం రాయలేదు నాగార్జున. ఈ సినిమాపై ఒక్క నాగార్జున మాత్రమే కాదు.. అక్కినేని కుటుంబం అంతా ఆసక్తిని చూపించలేదనే ప్రచారం జరుగుతుంది.దాని వెనక కూడా కొన్ని కారణాలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అక్కినేని కుటుంబం నుంచి ఎవరూ రాలేదు.. తన కొడుకు ప్రతీ వేడుకకు వచ్చే నాగార్జున ఈ సారి మిస్ అయ్యాడు. దాంతో పాటు మ్యూజికల్ నైట్‌లో కూడా కనిపించలేదు. పైగా నాగ్ ఇప్పుడు ఏ సినిమా కూడా చేయడం లేదు. అంటే ఖాళీగా ఉండి కూడా రాలేదని తెలుస్తుంది. ఈ సినిమా కథ విషయంలోనే నాగార్జున కాస్త అసంతృప్తిగా ఉన్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో తల్లిదండ్రులకు దూరమైన పాత్రలో చైతూ నటించాడు. ఆ సమయంలో మేనమామ వెంకటేష్ అతన్ని చేరదీస్తాడు. అన్నీ తానేయై ప్రాణంగా పెంచుతాడు.

Was Nagarjuna Akkineni upset with the story of Venkatesh Naga Chaitanya multi starrer Venky Mama movie pk వెంకీ మామ సినిమా తనకెంత ముఖ్యమనేది నాగ చైతన్య చాలా సార్లు చెప్పాడు. మనం తర్వాత తన కెరీర్లో అంత కీలకమైన సినిమా ఇదేనని.. ఈ రెండు సినిమాలు తను ఎప్పటికీ మరిచిపోలేనని చెప్పాడు చైతూ. venky mama,venkatesh,nagarajuna akkineni,nagarajuna naga chaitanya,venkatesh naga chaitanya,venky mama nagarjuna,nagarjuna upset with venky mama,venky mama collections,telugu cinema,nagarjuna twitter,వెంకటేష్,వెంకటేష్ నాగ చైతన్య,వెంకీ మామ,వెంకీ మామ నాగార్జున,నాగార్జున ట్విట్టర్
నాగార్జున ఫ్యామిలీ
యాదృశ్చికంగా చైతూ నిజ జీవితంలో కూడా అతడి తల్లిదండ్రులు నాగార్జున, వెంకటేష్ చెల్లెలు లక్ష్మీ అనివార్య కారణాలతో విడిపోయారు. ఆ తర్వాత దగ్గుబాటి కుటుంబమే చైతూను పెంచారని ఇండస్ట్రీలో వార్తలున్నాయి. అయితే వెంకీ మామ సినిమాలో కథ.. చైతూ లైఫ్‌లో జరిగిన కథకు కొన్ని దగ్గరి పోలికలు ఉండటంతో నాగార్జున ఈ కథపై పెద్దగా ఆసక్తి చూపించలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాయింట్ నాగ్ కాస్త ఫీల్ అయ్యాడని.. అందుకే వెంకీ మామ గురించి పెద్దగా ఈయన ప్రమోషన్ కూడా చేయలేదని ప్రచారం జరుగుతుంది. కారణమేదైనా కూడా వెంకీ మామ విషయంలో నాగార్జున మాత్రం డల్‌గానే కనిపించాడు. చైతూ ముందు సినిమాల విషయంలో ఈయన చూపించిన శ్రద్ధ వెంకీ మామకు మాత్రం కనిపించలేదనేది కాదనలేని వాస్తవం.
Published by: Praveen Kumar Vadla
First published: December 14, 2019, 6:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading