హోమ్ /వార్తలు /సినిమా /

Acharya:దిల్ రాజుకు షాక్.. మరో డిస్ట్రిబ్యూటర్‌కు భారీ ధరకు ఆచార్య నైజాం రైట్స్

Acharya:దిల్ రాజుకు షాక్.. మరో డిస్ట్రిబ్యూటర్‌కు భారీ ధరకు ఆచార్య నైజాం రైట్స్

‘ఆచార్య’ మూవీ నుంచి భలే భలే బంజారా సాంగ్ విడుదల (Twitter/Photo)

‘ఆచార్య’ మూవీ నుంచి భలే భలే బంజారా సాంగ్ విడుదల (Twitter/Photo)

‘ఆచార్య’ డిస్ట్రిబ్యూషన్ విషయంలో దిల్ రాజుకు, వరంగల్ శ్రీనుకి మధ్య గట్టి పోటీ నడిచిందని, కానీ శ్రీను పట్టుబట్టి మరీ ఎక్కువ మొత్తం చెల్లించి ఈ మెగా ఆచార్య సినిమా హక్కులను సొంతం చేసుకున్నారని సమాచారం.

మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ఆచార్య. ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ఆన్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. తండ్రీకొడుకులను ఆన్ స్క్రీన్ పై చూసేందుకు మెగా అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈనెల 29న ాచార్య సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. మెగాస్టార్ సినిమాకు మామూలు క్రేజ్ ఉండదు. థియేటర్లు ముందే బుక్, టికెట్ల కూడా రిలీజ్ అయిన రెండుమూడు రోజుల వరకు సామాన్యులకు దొరకని పరిస్థితి. అయితే ఈ క్రమంలో ఆచార్య సినిమా నైజా హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయాయి.ఆచార్య సినిమాని భారీ ధరకి వరంగల్ శ్రీను కొన్నారు.

‘ఆచార్య’ నైజాం డిస్ట్రిబ్యూషన్‌ను వరంగల్ శ్రీను 42 కోట్లకు సొంతం చేసుకున్నారు. ‘ఆచార్య’ డిస్ట్రిబ్యూషన్ విషయంలో దిల్ రాజుకు, వరంగల్ శ్రీనుకి మధ్య గట్టి పోటీ నడిచిందని, కానీ శ్రీను పట్టుబట్టి మరీ ఎక్కువ మొత్తం చెల్లించి ఈ మెగా ఆచార్య సినిమా హక్కులను సొంతం చేసుకున్నారని సమాచారం. తెలంగాణలో సినిమా డిస్ట్రిబ్యూషన్ అంటే మనకు దిల్ రాజుయే గుర్తొచ్చారు. నిర్మాతగా మారినా బడా బడా సినిమాల నైజాం హక్కులన్నీ దిల్ రాజునే   కొంటారు. పెద్ద సినిమాలన్నీ నైజాంలో ఈయన రిలీజ్ చేయాల్సిందే. చాలా మంది చిన్న డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నా పెద్ద సినిమాలు వారి దాకా వెళ్లనివ్వరు దిల్ రాజు.


అయితే ఇటీవల మరో డిస్ట్రిబ్యూటర్ అయిన వరంగల్ శ్రీను దిల్ రాజుకి పోటీగా నైజాంలో వస్తున్నారు. మొదట చిన్న చిన్న సినిమాలతో డిస్ట్రిబ్యూషన్ మొదలు పెట్టిన వరంగల్ శ్రీను ఇప్పుడు పెద్ద సినిమాలని కూడా నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇటీవల క్రాక్ సినిమా సమయంలో దిల్ రాజుకి వరంగల్ శ్రీనుకి గొడవలు కూడా  జరిగినట్లు సమాచారం. క్రాక్, నాంది, ఇలా వరుసగా కొన్ని పెద్ద సినిమాలు, ఓ మోస్తరు సినిమాలు రిలీజ్ చేస్తూ దిల్ రాజుకి నైజాంలో ప్రత్యామ్నాయంగా ఎదిగారు వరంగల్ శ్రీను. ఇప్పుడు ఏకంగా ఆచార్య సినిమాని భారీ ధరకి వరంగల్ శ్రీను చేజెక్కించుకోవడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

First published:

Tags: Acharya, Dil raju, Megastar Chiranjeevi, Ram Charan

ఉత్తమ కథలు