అదేంటి.. ఎప్పుడూ కలిసే ఉంటారు.. కలిసి పార్టీలు చేసుకుంటారు. అలాంటి వాళ్లిద్దరి మధ్య ఎందుకు ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అనుకుంటున్నారా..? అక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షోతో పాటు మరిన్ని షోలు కూడా చేసుకుంటూ బిజీ అయిపోయింది అనసూయ. ముఖ్యంగా అన్ని ఛానెల్స్‌లో తన హవా చూపిస్తుంది. ఈటీవీలో జబర్దస్త్ కామెడీ షో.. మా టీవీలో ఓ షో.. జెమినిలో ఇప్పుడు తల్లా పెళ్లామా.. జీ తెలుగులో లోకల్ గ్యాంగ్స్ ఇలా అన్నింట్లోనూ తన మార్క్ కనిపించేలా చేస్తుంది అను. మరోవైపు సినిమాలు కూడా చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. రెండు చేతులా బాగానే సంపాదిస్తుంది అనసూయ. ఇలాంటి సమయంలో రోజా కూడా ఈమెకు పోటీగా వస్తుంది.
ఈ ఇద్దరి మధ్య ప్రస్తుతం యుద్ధం జరిగేలా కనిపిస్తుంది. దానికి కారణాలు కూడా ఉన్నాయి. రోజా, అనసూయ కలిసి జబర్దస్త్ షో చేస్తున్నారు. అలాగే ఈ ఇద్దరూ వేర్వేరు ఛానెల్స్‌లో డిఫెరెంట్ షోస్ కూడా చేస్తున్నారు. తాజాగా రోజా అమ్మ సరిలేరు నీకెవ్వరు అంటూ జెమినిలో కొత్త షో ఒకటి మొదలుపెట్టబోతుంది. అమ్మల గొప్పతనం.. పిల్లలతో వాళ్లు చేసే అల్లరి ఈ షోలో హైలైట్ చేయబోతున్నారు. ముఖ్యంగా మోడ్రన్ అమ్మలు ఈ షోలో కనిపిస్తారు. మార్చ్ 3 నుంచి రాత్రి 9.30కు ఈ షో ప్రసారం కానుంది.
మరోవైపు అనసూయ మాత్రం రోజాకు పూర్తి భిన్నంగా మరో షో మొదలుపెట్టింది. మార్చ్ 2 నుంచి ఈ షో మొదలు కానుంది. దీనిపేరు తల్లా పెళ్లామా..? అమ్మ, భార్య మధ్య జరిగే సరదా సంఘటనలే ఈ షో కాన్సెప్ట్. ఇది కూడా జెమినిలోనే వస్తుంది. ఓ వైపు తల్లా పెళ్లామా అంటూ అనసూయ అడుగుతుంటే.. తల్లే గొప్ప అంటూ రోజా కార్యక్రమం చేస్తుంది. దాంతో ఈ ఇద్దరి మధ్య మంచి టిఆర్పీ వార్ జరిగేలా కనిపిస్తుంది. పైగా రెండూ ఒకే ఛానెల్లో రావడం విశేషం. మొత్తానికి చూడాలిక.. ఈ రెండు షోస్ రేటింగ్స్ ఎలా ఉండబోతున్నాయో..?
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anasuya Bharadwaj, Jabardasth comedy show, MLA Roja, Telugu Cinema, Tollywood