యాంకర్ సుమ లేకుండా ఇప్పుడు ఏ వేడుకను ఊహించుకోలేకపోతున్నారు దర్శక నిర్మాతలు. ముఖ్యంగా ఆమె లేకుండా ఏ సినిమా ఫంక్షన్ కూడా జరగడం లేదు. చిన్నదో పెద్దదో సుమ లేకుండా అయితే సినిమా వేడుక జరగడం లేదు. సంక్రాంతి సినిమాల నుంచి ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతున్న డిస్కో రాజా వరకు అన్నింటికీ ఒక్కరే యాంకర్.. ఆమె సుమ కనకాల. తాజాగా డిస్కో రాజా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు కమ్ హీరో వినాయక్ ఈ యాంకర్‌పై అదిరిపోయే సెటైర్ వేసాడు. ఈయన ప్రస్తుతం సీనయ్య సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. రవితేజకు ఆప్తుడు కావడంతో వినాయక్ కూడా డిస్కో రాజా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వచ్చాడు.
వినాయక్ స్టేజిపై ఉన్నపుడు మీ సీనయ్య సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఎప్పుడు జరిగినా కూడా యాంకర్ తనే కదా అంటూ అడిగేసింది సుమ. దానికి వెంటనే వినాయక్ అదిరిపోయే పంచ్ వేసాడు. గుడికి వెళ్ళి దణ్ణం పెట్టుకోవాలంటే.. పూజారి కరుణించాలి.. మీరు లేకుండా సినిమా ఫంక్షన్స్ జరుగుతాయా సుమ గారూ అంటూ రివర్స్ కౌంటర్ వేసాడు. అసలు మీరు లేకుండా జరిగే వ్యవహారమేనా సుమ గారూ అంటూ తన చేతిలోని మైక్ సుమ చేతికి ఇచ్చి నవ్వుకుంటూ కిందకు దిగి వెళ్ళిపోయాడు వివి వినాయక్. ఈయన పంచ్‌తో అక్కడున్న వాళ్లంతా నవ్వుకున్నారు. ఇక సుమ కూడా తనపై వినాయక్ వేసిన పంచ్‌ను బాగానే ఎంజాయ్ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anchor suma, Telugu Cinema, Tollywood, VV Vinayak