Jr NTR VV Vinayak: ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ ప్రాణం పోయేది.. ఆది సినిమా తెరవెనక నిజం చెప్పిన వివి వినాయక్..

Jr NTR VV Vinayak: జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో ఎన్ని సినిమాలున్నా కూడా ఆది మాత్రం ప్రత్యేకమే. ఎందుకంటే ఈయనకు మాస్ హీరోగా సూపర్ క్రేజ్ తీసుకొచ్చిన సినిమా ఇది. 20 ఏళ్ల వయసులోనే సూపర్ స్టార్‌గా మారడానికి బీజం..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: October 17, 2020, 5:24 PM IST
Jr NTR VV Vinayak: ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ ప్రాణం పోయేది.. ఆది సినిమా తెరవెనక నిజం చెప్పిన వివి వినాయక్..
జూనియర్ ఎన్టీఆర్ వివి వినాయక్ (vv vinayak jr ntr)
  • Share this:
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో ఎన్ని సినిమాలున్నా కూడా ఆది మాత్రం ప్రత్యేకమే. ఎందుకంటే ఈయనకు మాస్ హీరోగా సూపర్ క్రేజ్ తీసుకొచ్చిన సినిమా ఇది. 20 ఏళ్ల వయసులోనే సూపర్ స్టార్‌గా మారడానికి బీజం వేసిన సినిమా ఇది. 2002లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయం సాధించడమే కాదు అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులు కూడా తిరగరాసింది. వివి వినాయక్ తెరకెక్కించిన ఈ సినిమా విడుదలై 18 ఏళ్లవుతున్నా కూడా ఇప్పటికీ ఆది సినిమా గురించి మాట్లాడుతుంటారు. దానికి కారణం వినాయక్ టేకింగ్. అప్పటికి ఎలాంటి ఇమేజ్ లేని ఎన్టీఆర్‌ను స్టార్ హీరోగా మార్చేసాడు ఈయన. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నపుడు జరిగిన ఓ సంఘటన గురించి ఇప్పుడు చెప్పుకొచ్చాడు వినయ్. తాజాగా అలీతో సరదాగా షోకు వచ్చిన వినాయక్.. చాలా విషయాల గురించి చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా తను నటుడిగా మారే దగ్గర్నుంచి.. ఊళ్లో వెక్కిరింపుల వరకు కూడా అన్నీ కెమెరా ముందు చెప్పుకొచ్చాడు. అందులోనే ఆది సినిమా విషయాలు కూడా పంచుకున్నాడు వినాయక్. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నపుడు ఎన్టీఆర్‌కు ఓ ప్రమాదం జరిగింది. అది చాలాసార్లు ఎన్టీఆర్ కూడా చెప్పాడు.
జూనియర్ ఎన్టీఆర్ వివి వినాయక్ (vv vinayak jr ntr)
జూనియర్ ఎన్టీఆర్ వివి వినాయక్ (vv vinayak jr ntr)


తనకు అప్పుడు జరిగిన ప్రమాదం కూడా పెద్దదే అని రెండు మూడుసార్లు ఎన్టీఆర్ చెప్పాడు. క్లైమాక్స్ సన్నివేశం చిత్రీకరిస్తున్న సమయంలో ఈ యాక్సిడెంట్ జరిగింది. అప్పుడు ఎమోషన్‌తో సీన్‌లో మరింత ఇన్‌వాల్వ్ కావడంతో చేతికి దెబ్బ తగిలింది. దాని గురించి ఇప్పుడు బయట పెట్టాడు వినాయక్. ఆ రోజు జరిగింది తలుచుకుంటే భయమేస్తుందని చెప్పాడు వినాయక్. అసలేం జరిగిందంటే ఆది షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎన్టీఆర్ చేతికి అనుకోకుండా గాయమైంది. ముందు అది చిన్నదే అనుకున్నారంతా. అయినా కూడా వినాయక్ రిస్క్ తీసుకోలేదు. పైగా ఎన్టీఆర్ అప్పటికి కుర్రాడంతే.

ఆవేశంలో ఫైట్ సీన్ చేసాడు.. అది కాస్తా కట్ అయిపోయింది. చేతికి రక్తం కారిపోతుంది.. అయినా కూడా షూటింగ్ పూర్తి చేసిన తర్వాతే హాస్పిటల్‌కు వచ్చాడంటూ చెప్పాడు వినయ్. అక్కడ డాక్టర్ ఎన్టీఆర్‌ను చూసి నరం కట్ అయిందని.. ఏదైనా తేడా కొడితే ప్రాణాలు పోయేవని చెప్పాడు. దాంతో అందరికీ భయం వేసిందని.. ఏదైనా జరిగితే ఏంటి పరిస్థితి అనే వణుకు పుట్టిందని చెప్పాడు వినాయక్. దాని గురించి ఇప్పుడు తలుచుకున్నా కూడా భయమేస్తుందని చెప్పాడు వినాయక్. ఆది తర్వాత ఈ కాంబినేషన్‌లో సాంబ, అదుర్స్ సినిమాలు వచ్చాయి.
Published by: Praveen Kumar Vadla
First published: October 17, 2020, 5:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading