ఏప్రిల్ 12న విడుదల కానున్న పీఎం నరేంద్ర మోడీ..

ప్రధాని నరేంద్ర మోదీ(File)

సార్వత్రిక ఎన్నికల వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తెరకెక్కించిన పీఎం నరేంద్రమోడీ బయోపిక్‌ను విడుదల చేయడానికి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

  • Share this:
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీస్‌లో బయోపిక్స్ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే కొన్ని విడుదలకు రెడీ గున్నాయి. మరొకొన్ని సెట్స్‌పై ఉన్నాయి. ఇప్పటికే  మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి  ఎన్టీఆర్ జీవితంపై రెండు బయోపిక్‌లు వచ్చాయి.  రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ త్వరలో విడుదల కానుంది ఇంకోవైపు దివంగత సీఎం వైయస్.రాజశేఖర్ రెడ్డి పాద యాత్ర నేపథ్యంలో ‘యాత్ర’ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే కదా. దాంతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధానిగా దారి తీసిన పరిస్థితులపై ‘ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిష్టర్’ సినిమా పలు వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచింది. తాజాగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై ‘పీఎం నరేంద్ర మోడీ’ టైటిల్‌తో బయోపిక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఓబరాయ్..నరేంద్రమోడీ పాత్రలో నటిస్తున్నారు. ఒమంగ్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను  ఏప్రిల్ 12న విడుదల చేయబోతున్నట్టు అఫీషియల్‌గా ప్రకటించారు.

PM Narendra Modi,PM Narendra Modi Biopic,Vivek oberoi PM Narendra Modi Biopic,PM Modi Election Rally,Vivek Oberoi,PM Naredndra modi biopic vivek oberoi,Prime Minister Narendra Modi Vivek oberoi Omung kumar,PM Modi Omung Kumar,వెండితెరపై ప్రధాని నరేంద్ర మోదీ,వివేక్ ఓబరాయ్ పీఎం నరేంద్ర మోడీ,ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వివేక్ ఓబరాయ్, ఏప్రిల్ 12న విడుదల కానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ,మంత్రి నరేంద్ర మోదీ,పీఎం మోదీ,ప్రధాని మోదీ వివేక్ ఓబరాయ్ ఓమంగ్ కుమార్
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ

మాములు దిగువ తరగతి కుటుంబంలో పుట్టి..రైల్వే స్టేషన్‌లో ‘టీ’ అమ్ముతూ బీజేపీలో అంచలంచెలుగా ఎదిగి ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా...ఆపై దేశ ప్రధాన మంత్రిగా ఎదిగిన వైనాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు.  ఒక కమర్షియల్ సినిమాకు కావాల్సినంత మసాలా ప్రధాని నరేంద్ర మోదీ జీవితంలో ఉంది.ఈ సినిమాను దేశంలోని అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

PM Narendra Modi,PM Narendra Modi Biopic,Vivek oberoi PM Narendra Modi Biopic,PM Modi Election Rally,Vivek Oberoi,PM Naredndra modi biopic vivek oberoi,Prime Minister Narendra Modi Vivek oberoi Omung kumar,PM Modi Omung Kumar,వెండితెరపై ప్రధాని నరేంద్ర మోదీ,వివేక్ ఓబరాయ్ పీఎం నరేంద్ర మోడీ,ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వివేక్ ఓబరాయ్, ఏప్రిల్ 12న విడుదల కానున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ,మంత్రి నరేంద్ర మోదీ,పీఎం మోదీ,ప్రధాని మోదీ వివేక్ ఓబరాయ్ ఓమంగ్ కుమార్
‘పీఎం నరేంద్రమోదీ’

ద‌ర్శ‌న్ కుమార్‌, బొమ‌న్ ఇరానీ, మ‌నోజ్ జోషీ, ప్ర‌శాంత్ నారాయ‌ణ‌న్‌, జ‌రీనా వాహ‌బ్‌, సేన్‌గుప్తాలు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఒమంగ్ కుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను  సందీప్ సింగ్ నిర్మిస్తున్నాడు. సార్వత్రిక ఎన్నికల వేల విడుదల కాబోతున్న ఈ సినిమాపై ప్రతిపక్షాలు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం  చేస్తాయో చూడాలి.

First published: