Viva Harsha: గాయాలతో హాస్పిటల్ పాలైన కమెడియన్ వైవా హర్ష.. ఇంతకీ ఏం జరిగిందంటే..

గాయాల పాలైన వైవా హర్ష (Instagram/Photo)

Viva Harsha: గాయాలతో హాస్పిటల్ పాలైన కమెడియన్ వైవా హర్ష. ఈయన యూట్యూబ్‌ నుంచి సిల్వర్ స్క్రీన్ ‌కు పరిచయమయ్యాడు.తాజాగా ఇతను గాయాల పాలై హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు. దానికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Share this:
    Viva Harsha: గాయాలతో హాస్పిటల్ పాలైన కమెడియన్ వైవా హర్ష. ఈయన యూట్యూబ్‌ నుంచి సిల్వర్ స్క్రీన్ ‌కు పరిచయమయ్యాడు. అంతేకాదు ఇక్కడ కూడా తనదైన కామెడీ టైమింగ్‌తో రాణిస్తున్నాడు. అంతేకాదు రీసెంట్‌గా విడుదలైన ‘కలర్ ఫోటో’ మూవీలో కామెడీతో పాటు ఎమోషనల్ సీన్స్‌లో కూడా ఇరగదీసాడు. త్వరలోనే ఇతను ఓ ఇంటివాడు కాబోతున్నాడు. రీసెంట్‌గా ఇతని ఎంగేజ్మెంట్ జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా హర్ష .. తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో గాయాలతో ఉన్న ఓ ఫోటోను షేర్ చేసాడు. దీంతో అభిమానులు అతనికి ఏం జరిగిందా అని ఆరా తీస్తున్నారు. ఇక వైవా హర్ష విషయానికొస్తే.. యూట్యూబ్‌లో వైవా అనే షార్ట్ ఫిల్మ్‌తో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. అంతేకాదు ఇందులో హర్ష ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్, ఫ్రస్టేషన్ క్యారెక్టర్ కు ఆడియన్స్ ఫిదా అయ్యాడు. అక్కడ నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. యూట్యూబ్ నుంచి సిల్వర్ స్క్రీన్‌కు షిఫ్ట్ అయ్యాడు.

    తాజాగా హర్ష గాయాలతో హాస్పిటల్‌లో ఉన్న ఫోటోను షేర్ చేసాడు. ఒక్కసారి ఈ ఫోటో చూసి అభిమానులు కూడా కంగారు పడుతున్నారు.








    View this post on Instagram






    A post shared by Harsha (@harshachemudu)






    సుమంత హీరోగా నటిస్తోన్న ‘అనగనగా ఓ రౌడీ’ సినిమా షూటింగ్‌లో భాగంగా గాయాలపాలైన వేషం వేసినట్టు కూల్‌గా చెప్పాడు. అసలు నిజం తెలిసి అభిమానులు హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: