హోమ్ /వార్తలు /సినిమా /

#ViswasamTrailer: ‘విశ్వాసం’ ట్రైల‌ర్.. అజిత్ ఊర‌మాస్ అవ‌తారం..

#ViswasamTrailer: ‘విశ్వాసం’ ట్రైల‌ర్.. అజిత్ ఊర‌మాస్ అవ‌తారం..

విశ్వాసం సినిమా పోస్టర్

విశ్వాసం సినిమా పోస్టర్

ఒక్క సినిమా.. ఒకేఒక్క సినిమా.. అజిత్ క‌ళ్లు తెరిపించింది. త‌న నుంచి అభిమానులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో అనే క్లారిటీ వ‌చ్చేలా చేసింది. దాంతో ఈయ‌న మ‌ళ్లీ త‌న పాత దారినే ఎంచుకున్నాడు. వివేగంతో ఆల్ట్రామోడ్ర‌న్ స్టైలిష్ ఎంట‌ర్టైన‌ర్ ట్రై చేసి త‌న వ‌ర‌స విజ‌యాల‌కు త‌నే బ్రేక్ వేసుకున్నాడు అజిత్. దాంతో ఇప్పుడు పక్కా మాస్ మసాలా సినిమా ‘విశ్వాసం’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.

ఇంకా చదవండి ...

ఒక్క సినిమా.. ఒకేఒక్క సినిమా.. అజిత్ క‌ళ్లు తెరిపించింది. త‌న నుంచి అభిమానులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో అనే క్లారిటీ వ‌చ్చేలా చేసింది. దాంతో ఈయ‌న మ‌ళ్లీ త‌న పాత దారినే ఎంచుకున్నాడు. వివేగంతో ఆల్ట్రామోడ్ర‌న్ స్టైలిష్ ఎంట‌ర్టైన‌ర్ ట్రై చేసి త‌న వ‌ర‌స విజ‌యాల‌కు త‌నే బ్రేక్ వేసుకున్నాడు అజిత్. దాంతో ఇప్పుడు రిస్క్ వ‌ద్ద‌నుకుని ప‌క్కా మాస్ సినిమాతో వ‌స్తున్నాడు అజిత్. అది కూడా అచ్చొచ్చిన సంక్రాంతి పండ‌క్కి. ప్ర‌స్తుతం ఈయ‌న న‌టిస్తున్న ‘విశ్వాసం’ ట్రైల‌ర్ విడుద‌లైంది. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని శివ తెర‌కెక్కిస్తున్నాడు.

‘వీర‌మ్’, ‘వేదాలం’, ‘వివేగం’ సినిమాల త‌ర్వాత అజిత్-శివ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న నాలుగో సినిమా ఇది. గ‌తేడాది వివేగంతో ఫ్లాప్ ఇచ్చినా కూడా క‌చ్చితంగా ఈ సారి ‘విశ్వాసం’తో విజ‌యం అందిస్తాడ‌ని విశ్వాసంగా ఉన్నాడు అజిత్. పొంగ‌ల్ బ‌రిలో ఉంది ఈ చిత్రం. తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ చూస్తుంటే మాస్ అనే ప‌దానికి నిలువెత్తు నిద‌ర్శ‌నంలా ఉంది. అజిత్ ఇందులో ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. ప‌క్కా విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో శివ తెర‌కెక్కిస్తున్న సినిమా ఇది. ట్రైల‌ర్ కూడా ఇదే హైలైట్ చేసాడు ద‌ర్శ‌కుడు.

#ViswasamTrailer: Viswasam Trialer Released.. Ajith Kumar in mass avatar.. ఒక్క సినిమా.. ఒకేఒక్క సినిమా.. అజిత్ క‌ళ్లు తెరిపించింది. త‌న నుంచి అభిమానులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో అనే క్లారిటీ వ‌చ్చేలా చేసింది. దాంతో ఈయ‌న మ‌ళ్లీ త‌న పాత దారినే ఎంచుకున్నాడు. వివేగంతో ఆల్ట్రామోడ్ర‌న్ స్టైలిష్ ఎంట‌ర్టైన‌ర్ ట్రై చేసి త‌న వ‌ర‌స విజ‌యాల‌కు త‌నే బ్రేక్ వేసుకున్నాడు అజిత్. దాంతో ఇప్పుడు పక్కా మాస్ మసాలా సినిమా ‘విశ్వాసం’తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. viswasam movie twitter,viswasam movie release date,viswasam movie trailer,viswasam movie trailer date,viswasam movie release date,ajith viswasam movie,ajith viswasam,ajith nayanthara siva,tamil cinema,అజిత్ విశ్వాసం,విశ్వాసం ట్రైలర్,విశ్వాసం సినిమా,విశ్వాసం అజిత్ కుమార్,విశ్వాసం నయనతార,అజిత్ నయనతార,తమిళ్ సినిమా
అజిత్ రజినీకాంత్

ఇప్ప‌టికే ర‌జినీకాంత్ ‘పేట’ కూడా ఈ బ‌రిలో ఉంది. కానీ ఒకేసారి రెండు సినిమాలు రావ‌డం.. విజ‌యం సాధించ‌డం త‌మిళ‌నాట చాలాసార్లు జ‌రిగాయి. ఇప్పుడు కూడా ఇదే జ‌రుగుతుందనే న‌మ్మ‌కంతో ఉన్నాడు అజిత్. పైగా అటు ర‌జినీ.. ఇటు అజిత్ ఇద్ద‌రికీ విజ‌యం కీల‌క‌మే. మ‌రి చూడాలిక‌.. ఈ వార్ లో విజ‌యం ఎవ‌ర్ని వ‌రిస్తుందో..?

అదాశర్మ హాట్ ఫోటోస్..

ఇవి కూడా చదవండి..

నాగార్జున మ‌ల్టీస్టార‌ర్‌ను దెబ్బ‌కొట్టిన త‌మిళ హీరో విజ‌య్..


బాల‌కృష్ణ వ‌ద్ద‌న్నాడు.. వెంక‌టేష్ ర‌మ్మ‌న్నాడు.. స్టార్ డైరెక్ట‌ర్ వింత‌గాధ‌..


అల్లూరి సీతారామ‌రాజుగా బాల‌య్య‌.. అదిరిపోయావు క‌ద‌య్యా..

Published by:Praveen Kumar Vadla
First published:

Tags: Ajith, Kollywood, Nayanatara, Tamil Cinema, Telugu Cinema

ఉత్తమ కథలు