Home /News /movies /

VISWASAM MOVIE TELUGU TRAILER RELEASED AJITH KUMAR BACK WITH COMPLETE ACTION ENTERTAINER PK

‘విశ్వాసం’ తెలుగు ట్రైలర్ టాక్.. అజిత్ ఆశలన్నీ నయనతారపైనే..

విశ్వాసం ట్రైలర్

విశ్వాసం ట్రైలర్

ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. అజిత్ క‌ళ్లు తెరిపించింది. త‌న నుంచి అభిమానులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో అనే క్లారిటీ వ‌చ్చేలా చేసింది. దాంతో ఈయ‌న మ‌ళ్లీ త‌న పాత దారిలోనే వెళ్లి విశ్వాసం సినిమాతో హిట్ కొట్టాడు అజిత్ కుమార్.

ఇంకా చదవండి ...
ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా.. అజిత్ క‌ళ్లు తెరిపించింది. త‌న నుంచి అభిమానులు ఎలాంటి సినిమాలు కోరుకుంటున్నారో అనే క్లారిటీ వ‌చ్చేలా చేసింది. దాంతో ఈయ‌న మ‌ళ్లీ త‌న పాత దారిలోనే వెళ్లి విశ్వాసం సినిమాతో హిట్ కొట్టాడు అజిత్ కుమార్. వివేగంతో ఆల్ట్రామోడ్ర‌న్ స్టైలిష్ ఎంట‌ర్టైన‌ర్ ట్రై చేసి త‌న వ‌ర‌స విజ‌యాల‌కు త‌నే బ్రేక్ వేసుకున్నాడు అజిత్. ఆ తర్వాత పక్కా మాస్ కథతో వచ్చి సంక్రాంతికి తమిళనాట సంచలన విజయం అందుకున్నాడు అజిత్ కుమార్. ఇక ఇప్పుడు విశ్వాసం సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ ‘విశ్వాసం’ తెలుగు ట్రైల‌ర్ విడుద‌లైంది. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని శివ తెరకెక్కించాడు.

‘వీర‌మ్’, ‘వేదాలం’, ‘వివేగం’ సినిమాల త‌ర్వాత అజిత్-శివ కాంబినేష‌న్‌లో వచ్చిన నాలుగో సినిమా ఇది. రెండేళ్ల కింద వివేగంతో ఫ్లాప్ ఇచ్చినా కూడా క‌చ్చితంగా ఈ సారి ‘విశ్వాసం’తో విజ‌యం అందించాడు శివ. పేటకు పోటీగా వచ్చి దాదాపు 130 కోట్లు వసూలు చేసింది విశ్వాసం. తాజాగా మార్చ్ 1న తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఇప్పుడు విడుద‌లైన ట్రైల‌ర్ చూస్తుంటే మాస్ అనే ప‌దానికి నిలువెత్తు నిద‌ర్శ‌నంలా ఉంది. ప‌క్కా విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో శివ తెరకెక్కించిన సినిమా ఇది. ట్రైల‌ర్‌లో కూడా ఇదే హైలైట్ చేసాడు ద‌ర్శ‌కుడు. నయనతార హీరోయిన్ కావడంతో ఇక్కడ కూడా మంచి వసూళ్లు తీసుకొస్తుందని నమ్ముతున్నారు దర్శక నిర్మాతలు. మరి వాళ్ల నమ్మకాన్ని విశ్వాసం ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.
First published:

Tags: Ajith, Nayanatara, Tamil Cinema, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు