ఈ రోజుల్లో కంటెంట్ ఉన్న సినిమాలకు భారీ ఆదరణ దక్కుతుండటం చూస్తున్నాం. హీరోహీరోయిన్ల సంగతి పక్కనబెట్టి కంటెంట్ చూసి సినిమాను నీరాజనం పలుకుతున్నారు నేటితరం ఆడియన్స్. ముఖ్యంగా యూత్ ఓరియెంటెడ్ సినిమాలు సూపర్ సక్సెస్ సాధిస్తున్నాయి. దీంతో యువత నచ్చే, మెచ్చే సన్నివేశాలతో సినిమాల రూపకల్పన చేస్తున్నారు దర్శకనిర్మాతలు. ఈ క్రమంలోనే వైవిద్యభరితమైన కథతో బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ (Boy Friend For Hire) అనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. గత కొన్ని రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ (Boy Friend For Hire Release Date) అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మేరకు బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ అంటూ వదిలిన పోస్టర్ వైరల్ గా మారింది.
విశ్వంత్ దుద్దుంపూడి, మాళవిక సతీషన్ హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న ఈ బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ సినిమాకు సంతోష్ కంభంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ కామెడి ఎంటర్టైనర్ గా `బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్` సినిమా రూపొందుతోంది. స్వస్తిక సినిమా, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై వేణుమాధవ్ పెద్ది, కె. నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30న విడుదల చేస్తున్నట్లు తాజాగా నిర్మాతలు ప్రకటించారు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ మూవీపై క్యురియాసిటీని పెంచింది. చిత్రంలో మధునందన్, సుదర్శన్, హర్ష వర్ధన్ ఇందులో కీలక పాత్రలు పోహిస్తున్నారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా, బాల సరస్వతి సినిమాటోగ్రఫర్ గా, విజయ్ వర్ధన్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.
విశ్వంత్, మాళవిక సతీషన్, పూజా రామచంద్రన్, హర్ష వర్ధన్, నెల్లూరు సుదర్శన్, మధునందన్, అమృతం అప్పాజీ, రాజా రవీంద్ర, రూప లక్ష్మి తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు మేకర్స్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tollywood, Tollywood actor, Tollywood Cinema