Mukhachitram theatrical Trailer Review | యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. వరుస సినిమాల్లో నటిస్తూ అదరగొడుతున్నారు. అందులో భాగంగా ఆయన ముఖ చిత్రం (Mukhachitram) అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే విశ్వక్ సేన్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఆయనకు సంబంధించి ఓ వీడియోను వదిలితే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్‌తో పాటు కీలక పాత్రల్లో వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ నటిస్తున్నారు. కలర్ ఫొటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ (Mukhachitram) చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్ కే ఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు.
ముఖచిత్రంతో గంగాధర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ పవర్ ఫుల్ లాయర్ పాత్రలో విశ్వామిత్ర పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో ప్లాస్టిక్ సర్జరీ గురించి ముఖ్యంగా ఫేస్ఆఫ్ మూవీతో పాటు రామ్ చరణ్ , అల్లు అర్జున్ నటించిన ‘ఎవడు’ సినిమాలో చూపించనట్టు ఓ అనుకోని సంఘటనలో ఓ అమ్మాయికి ముఖం పూర్తిగా కాలిపోతుంది. మరో సంఘటనలో ఓ అమ్మాయి చనిపోతుంది. ఆ తర్వాత చనిపోయిన అమ్మాయి ముఖాన్ని కాలిపోయిన అమ్మాయికి ప్లాస్టిక్ సర్జరీ చేస్తారు. ఈ నేపథ్యంలో జరిగిన పరిణామాలు ఏమిటనేదే ఈ సినిమా స్టోరీ. ఇందులో ఇతర ముఖ్యపాత్రలో బొమ్మాళీ రవి శంకర్ నటించారు.
Idhi love story oo.. thriller oo kadhu… anthaku minchi ????#Mukhachitram hitting hard in theatres from Dec 9th ???? ▶️https://t.co/ljQA5EM0pV@VishwakSenActor @sandeepraaaj @SKNonline @imVdeshK @PriyaVadlamani @vishalbunn @kaalabhairava7 @IamChaitanyarao @DISISDEEEPU @adityamusic pic.twitter.com/xN9nSW951d
— BA Raju's Team (@baraju_SuperHit) December 1, 2022
ఇక కోర్టు గెలుపు మెట్లెక్కొచ్చిన ఒక మంచోడిని గెలిపించడంలో లేదు.. ఇంట్లో కూర్చున్న ఒక చెడ్డోడికి కూడా భయాన్ని పుట్టించడంలో ఉంది. ఇక ఈ సినిమాతో పాటు విశ్వక్ సేన్ (Vishwak Sen) నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. విశ్వక్ సేన్.. ఈ యేడాది ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో పాటు ఓరి దేవుడా’ సినిమాలతో ప్రేక్షకులను పలకరించారు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర అబౌ యావరేజ్‌గా నిలిచి నటుడిగా విశ్వక్సేన్కు మంచి పేరు తీసుకొచ్చాయి. ఓరి దేవుడా ఈ సినిమాలో వెంకటేష్ దేవుడి పాత్రలో కనిపించారు.
టాలీవుడ్లో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. ఇండి ఫిల్మ్ వెళ్లిపోమాకే అనే సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమై.. తన రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత మలయాళ హిట్ సినిమా అంగమలై డైరీస్ తెలుగు రీమేక్ ఫలక్నామా దాస్‌లో నటించి నిర్మించి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు విశ్వక్ సేన్. ఈ సినిమాతో విశ్వక్ సేను మాస్కా దాస్ అనే పేరును తెచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత వెంటనే ‘హిట్’ అంటూ క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో అందరినీ ఆశ్చర్చపరిచారు. అటు పాగల్ సినిమాతో పలకరించారు. త్వరలో ‘ధమ్కీ’ మూవీతో విశ్వక్ సేన్ ప్రేక్షకుల ముందకు రానున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tollywood, Vishwak Sen