Vishwak Sen : యువ నటుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుస సినిమాల్లో నటిస్తూ అదరగొడుతున్నారు. అందులో భాగంగా ఆయన హీరోగా వచ్చిన యాక్షన్ డ్రామా దాస్ కా ధమ్కీ (Dhamki ). మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ స్వయంగా నటిస్తూ, నిర్మించారు. ఇక అది అలా ఉంటే ఈరోజు విశ్వక్ సేన్ తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మరో సినిమాను ప్రకటించారు. విశ్వక్ సితార బ్యానర్‌లో ఓ సినిమాను చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహించనున్నారు. కృష్ణ చైతన్య (krishna chaitanya) గతంలో రౌడీ ఫెలో, చల్ మోహన రంగా వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. విశ్వక్ కెరీర్‌లో 11వ సినిమాగా వస్తోన్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించనున్నారు. ఈసినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
ఇక ఆ మధ్య విశ్వక్ సేన్ తన కెరీర్‌లో 10వ ప్రాజెక్ట్‌ని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. దీనిని దర్శకుడు రవితేజ ముళ్ళపూడి డైరెక్ట్ చేయనున్నాడు. మీనాక్షి చౌదరి (meenakshi chaudhary) హీరోయిన్‌గా చేస్తోంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.
The most GREY character you'll ever meet! ???? ???????????????????????????????????????? ???????? ???????? ~ Announcement out today at 11:16am ???? Stay tuned ▶️ https://t.co/C5hJrReKlh pic.twitter.com/1cMrSa9zw9
— Sithara Entertainments (@SitharaEnts) March 29, 2023
ఇక ధమ్కీ విషయానికి వస్తే.. టీజర్ అండ్ ట్రైలర్‌తో మంచి బజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమాకు ఇప్పటికే చాలా ఏరియాల్లో లాభాల్లోకి వచ్చింది. ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే.. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి మంచి వసూళ్లను రాబడుతోంది. మొదటి వారంలో ఇప్పటి వరకు సాధించిన టోటల్ కలెక్షన్స్‌ని చూస్తే.. నైజాం: 3.47 కోట్లు, సీడెడ్: 1.14 కోట్లు, ఉత్తరాంధ్ర : 98 లక్షలు, తూర్పు: 63 లక్షలు, పశ్చిమ: 35 లక్షలు, గుంటూరు: 63 లక్షలు, కృష్ణ: 50లక్షలు, నెల్లూరు: 28లక్షలు, ఏపీ తెలంగాణ మొత్తంగా : 7.98 కోట్ల షేర్.. 14.65 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక కర్నాటక, రెస్టాఫ్ ఇండియాలో 1.12 కోట్లు, ఓవర్సీస్‌లో 1.25 కోట్లు. మొత్తంగా వరల్డ్ వైడ్’గా చూస్తే.. 10.35 కోట్ల షేర్, 20.10 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది. ఈ సినిమా 8 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగగా.. మొదటి వారం పూర్తీ అయ్యే సమయానికి 2.35 కోట్ల రేంజ్ లాభాలను అందుకుంది.
ఈ సినిమాలో నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) హీరోయిన్‌గా నటించింది. ఇతర పాత్రల్లో రావు రమేశ్, పృథ్వీరాజ్, హైపర్ ఆది కనిపించారు. ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందించారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వన్మయి క్రియేషన్స్, విష్వక్సేన్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి.
ఇక విశ్వక్ లేటెస్ట్ సినిమా ఓరి దేవుడా విషయానికి వస్తే.. ఈ సినిమాలో వెంకటేష్ మోడ్రన్ దేవుడి పాత్రలో కనిపించారు. ఆయన భక్తుడిగా విశ్వక్ సేన్ నటించారు. దీపావళీ సందర్భంగా 2022 అక్టోబర్ 21న విడుదలైన ఈ సినిమా అనుకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్స్‌గా నటించారు. పీవిపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కించాయి. ఈ సినిమా ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ముఖ్యంగా ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే అబ్బాయి పాత్రలో విశ్వక్ సేన్ నటన బాగుంది. ఈ నేపథ్యంలో ఆయన్ని కాపాడే దేవుడి పాత్రలో వెంకటేష్ నటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tollywood news, Vishwak Sen