Vishwak Sen | Dhamki Review : యువ నటుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుస సినిమాల్లో నటిస్తూ అదరగొడుతున్నారు. అందులో భాగంగా ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా దాస్ కా ధమ్కీ. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విశ్వక్ సేన్ నటిస్తూ, నిర్మిస్తూ, దర్శకత్వం వహించారు. నివేదా పెతు రాజ్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఎలా ఉంది.. ఎంతవరకు తెలుగు వారిని అలరించనుందో.. ఈ రివ్యూలో చూద్దాం.
రివ్యూ : దాస్ కా ధమ్కీ..
నటీనటులు : విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్, రావు రమేష్, రోహిణి, అజయ్, హైపర్ ఆది తదితరులు..
దర్శకుడు : విశ్వక్ సేన్
నిర్మాత : కరాటే రాజు
సంగీత దర్శకుడు : లియోన్ జేమ్స్
సినిమాటోగ్రఫీ : దినేష్ కె బాబు
ఎడిటర్ : అన్వర్ అలీ
కథ :
ధమ్కీ కథ విషయానికి వస్తే.. కృష్ణ దాస్ (విశ్వక్ సేన్) ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వెయిటర్‌గా వర్క్ చేస్తుంటాడు. అయితే తనకు మాత్రం జీవితంలో బాగా ఎదగాలనీ.. మంచి స్థాయిలో ఉండాలనీ ఆశ ఉంటుంది. ఎప్పుడూ అవే కలలు కంటూ ఉంటాడు. ఇక మరోవైపు SR ఫార్మా చైర్మన్‌గా డాక్టర్ సంజయ్ రుద్ర ( రెండో విశ్వక్ సేన్) తన ప్రయోగాలతో ప్రపంచంలో క్యాన్సర్ అనేది లేకుండా చేయాలని గట్టి సంకల్పాన్ని కలిగి ఉంటాడు. అయితే ఇద్దరూ ఒకేలా ఎందుకు ఉన్నారు. వీరికి ఏమైనా బయోలాజికల్ సంబంధం ఉందా.. ఇద్దరూ ఒకరేనా లేకా వేర్వేరా.. కీర్తీ (నివేదా పేతు రాజ్) ఎవరితో ప్రేమలో ఉంటుంది.. చివరకు కృష్ణదాస్ తన కలల్నీ నిజం చేసుకున్నాడా.. సంజయ్ రుద్ర తన సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడా అనేది స్టోరీ.
ప్లస్ పాయింట్స్ :
విశ్వక్ సేన్ నటుడిగా అదరగొట్టాడనే చెప్పోచ్చు. విశ్వక్ ఆటిట్యూడే సినిమాకు ప్లస్. విశ్వక్ సేన్ రెండు షేడ్స్‌లోను అదరగొట్టాడు. ముఖ్యంగా కంపెనీ చైర్మన్ రోల్ లో అయితే మంచి నటనను ప్రదర్శించాడు. అలాగే ఎమోషన్స్ విషయంలో కూడా ఇరగదీశాడు. అయితే దర్శకుడిగా మాత్రం ఇంకాస్త మెరుగవ్వాల్సి ఉంది. ఇక హీరోయిన్‌గా నివేదా పేతురాజ్ తన వరకు అందచందాలతో అదరగొట్టింది. తన గ్లామ్ షోతో మాస్ ఆడియెన్స్ మంచి ట్రీట్ ఉంటుంది. ఇంకో అంశం ఏమంటే.. హైపర్ ఆది, జబర్దస్త్ మహేష్‌లతో వచ్చే కామెడీ సీన్స్. వీటితో పాటు రావు రమేష్, పృథ్వీ తదితరులు కూడా తమ తమ పాత్రలో అదరగొట్టారు. ధమ్కీ సినిమా చూడాటానికి బాగా రిచ్‌గా ఉంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. లియోన్ జేమ్స్ సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది.
మైనస్ పాయింట్స్ :
ఈ చిత్రం ఎంటర్టైనింగ్‌గా ఉన్నప్పటికీ పెద్దగా కిక్ అనిపించదు. ముఖ్యంగా కథ పరంగా అయితే ఈ సినిమా మెప్పించదు. డ్యూయల్ రోల్ కాన్సెప్ట్‌తో సాగే ఈ సినిమా గతంలో చూసినట్లే ఉంటుంది. అన్ని వర్గాల ఆడియెన్స్‌కు నచ్చకపోవచ్చు. బోలేడు ట్విస్ట్‌లు ఉన్నాయి కానీ అవి థ్రిల్ కంటే ఆడియెన్స్‌కి విసుగును తెప్పిస్తాయి. సినిమాలో అక్కడక్కడ కొన్ని బోరింగ్ సీన్స్ ట్రిమ్ చేస్తే బాగుండనిపించింది. ఇక విశ్వక్ డైరెక్షన్ విషయానికి వస్తే.. ఓకే అనిపించాడు. సెకండాఫ్‌లో ఇంకాస్తా కేరుఫుల్‌గా చేయాల్సి ఉండాల్సింది.
కథనం, టెక్నికల్ విషయానికి వస్తే :
సాధారణంగా హీరోనే దర్శకుడైతే ఆ సినిమాపై ఇంకాస్త ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. దాస్ కా ధమ్కీపై ఆసక్తి పెరగడానికి కారణం అదే. ఫలక్‌నుమా దాస్‌తో ఓకే అనిపించిన విశ్వక్ సేన్.. ధమ్కీతో ఏం చేసుంటాడో అనే క్యూరియాసిటీ ఉంటుంది. అయితే మొదటి 40 నిమిషాలు చాలా అంటే చాలా నెమ్మదిగా వెళ్లింది సినిమా. హీరో హీరోయిన్ ట్రాక్ అయితే ఇప్పటికే కొన్ని వందల సినిమాల్లో వాడేసారు. ఇంటర్వెల్ ట్విస్ట్ వచ్చేవరకు కథలో.. కథనంలో వేగం అయితే కనిపించలేదు. కీలకమైన సెకండాఫ్ మాత్రం రేసీగానే వెళ్లింది. నిమిషానికి ఓ ట్విస్ట్ వస్తున్నా.. అవి తెలిసినవే ఉన్నాయి. అయినా కూడా ధమ్కీ అక్కడక్కడా మెప్పిస్తుంది. ముఖ్యంగా సెకండాఫ్ బాగుంది.. పైసా వసూల్ అని చెప్పాలి. క్లైమాక్స్ వరకు లెక్కలేనన్ని ట్విస్టులు వస్తుంటాయి. పైగా ధమ్కీ 2 ఉందని చెప్పి మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఇందులో మరో మెయిన్ ట్విస్ట్ ఉంది.. అది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.
చివరి మాట : ఓవరాల్‌గా దాస్ కా ధమ్కీ.. ఈ ఉగాదికి పర్లేదు. ఓసారి చూడోచ్చు.
రేటింగ్ : 2.5
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Das Ka Dhamki, Nivetha Pethuraj, Tollywood news, Vishwak Sen