Hit | Hindi Remake : హిందీలో రీమేక్ అవుతోన్న విశ్వక్ సేన్ హిట్ సినిమా.. లాంఛనంగా ప్రారంభం..

Hit Movie Launched Photo : Twitter

Hit | Hindi Remake : యువ హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో శైలేష్ కొలను దర్శకత్వొంలో వచ్చిన క్రైమ్ థిల్లర్ హిట్. ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈరోజు ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం అయ్యింది.

  • Share this:
    విశ్వ‌క్‌సేన్ హీరోగా శైలేష్ కొల‌ను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం క్రైమ్ థిల్లర్ హిట్..  (Vishwak Sen Hit movie) ఈ చిత్రం తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా విజయం తర్వాత వెంటనే దానికి సీక్వెల్ కూడా ఉంటుందని అన్నారు దర్శకనిర్మాతలు. ఈ సినిమాను నాచురల్ స్టార్ నాని నిర్మించారు. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సాధించడమే కాదు.. విమర్శకుల ప్రశంసలు పొందింది. ఇక ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఈ హిందీ రీమేక్‌కు దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఈ చిత్రం  (Hit movie Hindi remake) ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఈ సినిమా హీరోగా చేస్తున్న రాజ్ కుమార్ రావు (Rajkummar Rao) తో పాటు దర్శకుడు శైలేష్ కొలను చిత్రనిర్మాతలు దిల్ రాజు, భూషణ్ కుమార్, కిషన్ కుమార్‌లు పాల్గోన్నారు. హీరోయిన్‌గా సన్యా మల్హోత్రా (Sanya Malhotra) నటిస్తోంది.

    ఈ చిత్రం విషయానికి వస్తే.. 'HIT - The First Case' ఒక తప్పిపోయిన మహిళ కేసును ఎలా హీరో ఛేదించాడు అనేది కథ. ఇక్కడ విశేషం ఏమంటే.. ఈ సినిమా ఇంకా షూటింగ్ కూడా మొదలు పెట్టలేదు. అప్పుడే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ భారీ ధరకు దక్కించుకుంది.


    ఇక ఇదే సినిమాకు తెలుగులో హిట్ 2 వస్తోంది. అయితే ఈ సినిమాలో విశ్వక్ సేన్‌కు బదులుగా అడవి శేష్ నటిస్తున్నారు. అంతేకాదు దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా ఆ మధ్య విడుదలైంది. ఈ సినిమాలో అడవి శేష్ క్రిష్ణ దాస్ పాత్రలో కనిపించనున్నారట.

    ఈ సినిమా త్వరలో షూటింగ్‌ను జరుపుకోనుంది. హిట్ 1 తెలంగాణ నేపథ్యంగా సాగగా.. హిట్ 2 ఏపీ నేపథ్యంగా సాగనుందని తెలుస్తోంది.  హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రి న‌టించ‌నుంది.

    ఈ అమ్మ‌డు ప్ర‌స్తుతం మాస్ మ‌హారాజ ర‌వితేజ ‘ఖిలాడి’లో హీరోయిన్‌గా న‌టించింది. మరో పాత్రలో కొత్త హీరోయిన్ కోమలీ ప్రసాద్ కూడా కనిపించనుంది. ఈ సినిమాను నటుడు నాని నిర్మించనున్నారు.
    Published by:Suresh Rachamalla
    First published: