హోమ్ /వార్తలు /సినిమా /

Vishwak Sen - Dhamki: బాలయ్య చేతుల మీదుగా విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ ట్రైలర్ విడుదల..

Vishwak Sen - Dhamki: బాలయ్య చేతుల మీదుగా విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ ట్రైలర్ విడుదల..

బాలకృష్ణ చేతులు మీదుగా విశ్వక్‌సేన్ ‘ధమ్కీ’ ట్రైలర్ లాంఛ్ (Twitter/Photo)

బాలకృష్ణ చేతులు మీదుగా విశ్వక్‌సేన్ ‘ధమ్కీ’ ట్రైలర్ లాంఛ్ (Twitter/Photo)

Vishwak Sen - Dhamki Trailer : యువ నటుడు విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుస సినిమాల్లో నటిస్తూ అదరగొడుతున్నారు. తాజాగా ఈయన హీరోగా నటించిన ‘ధమ్కీ’ సినిమా ట్రైలర్‌ను బాలకృష్ణ విడుదల చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Vishwak Sen - Dhamki Trailer : యువ నటుడు విశ్వక్‌ సేన్‌ (Vishwak Sen) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుస సినిమాల్లో నటిస్తూ అదరగొడుతున్నారు. అందులో భాగంగా ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ ఓరి దేవుడా. ఈ సినిమా ప్రస్తుతం ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. ఇక అది అలా ఉంటే విశ్వక్ సేన్ స్వయంగా నటిస్తూ, నిర్మిస్తోన్న దర్శకత్వం వహించిన చిత్రం ధమ్కీ. ఈ చిత్రంలో తన ఫస్ట్ లుక్ పోస్టర్‌‌ ను విష్వక్ సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను నందమూరి బాలకృష్ణ ఆవిష్కరించారు. రీసెంట్‌గా విశ్వక్ సేన్ బాలయ్య ‘అన్‌స్టాపబుల్ షో’లో వెళ్లారు. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ఈ కోవలో విశ్వక్ సేన్ తను హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ‘ధమ్కీ’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు బాలయ్యను ముఖ్య అతిథిగా పిలిచారు.

బాలకృష్ణ కూడా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై  ఈ సినిమా ట్రైలర్‌ను లాంఛ్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఆద్యంత ఆకట్టుకునే రీతిలో ఉంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడా.. ఒకడే రెండు పాత్రల్లో కనిపిస్తాడా అనేది చూడాలి. గతంలో తెరకెక్కిన రౌడీ అల్లుడు, విక్రమార్కుడు తరహాలో ఒక హీరో ప్లేస్‌లో మరో హీరో వెళ్లే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించినట్టు కనబడుతోంది. ఈ సినిమా మలయాళంలో హిట్టైన ’అంగమాలి డైరీస్‌’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు మలయాళం,కన్నడ, తమిళం, హిందీలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

ఇక ఈసినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కాబోతుందని తెలుస్తోంది. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇతర పాత్రల్లో రావు రమేశ్, పృథ్వీరాజ్‌, హైపర్‌ ఆది నటిస్తున్నారు. ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందించారు. లియోన్‌ జేమ్స్ మ్యూజిక్‌ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వన్మయి క్రియేషన్స్‌, విష్వక్సేన్ సినిమాస్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇక విశ్వక్ లేటెస్ట్ సినిమా ఓరి దేవుడా విషయానికి వస్తే..  ఈ  సినిమాలో వెంకటేష్ మోడ్రన్ దేవుడి పాత్రలో కనిపించారు. ఆయన భక్తుడిగా విశ్వక్ సేన్ నటించారు. దీపావళీ సందర్భంగా అక్టోబర్ 21న విడుదలైన ఈ సినిమా అనుకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్స్‌గా నటించారు. పీవిపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కించాయి. ఈ సినిమా ఓటీటీలో సూపర్ రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ముఖ్యంగా ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే అబ్బాయి పాత్రలో విశ్వక్ సేన్ నటన బాగుంది. ఈ నేపథ్యంలో ఆయన్ని కాపాడే దేవుడి పాత్రలో వెంకటేష్ నటించారు.

First published:

Tags: Balakrishna, Dhamki, Tollywood, Vishwak Sen

ఉత్తమ కథలు