Vishwak Sen - Das Ka Dhamki : యువ నటుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుస సినిమాల్లో నటిస్తూ అదరగొడుతున్నారు. అందులో భాగంగా ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓరి దేవుడా. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఆ మధ్య విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. ఇక అది అలా ఉంటే విశ్వక్ సేన్ స్వయంగా నటిస్తూ, నిర్మిస్తోన్న దర్శకత్వం వహించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ చిత్రం ధమ్కీ(Dhamki ). ఈ సినిమా మార్చి22న (ఉగాది)న మరికాసేట్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా బిజినెస్ డీటెల్స్ ఏంటో చూద్దాం.. టీజర్ అండ్ ట్రైలర్‌తో మంచి బజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమాకు ఇప్పటికే చాలా ఏరియాల్లో బిజినెస్ జరిగిపోయింది
‘దాస్ కా దమ్కీ’ సినిమాను విశ్వక్ సేన్ డైరెక్ట్ చేస్తూ వాళ్ల నాన్న కరాటే రాజు నిర్మించారు. విశ్వక్ సేన్ కెరీర్‌లో హైయెస్ట్ బిజినెస్‌ను అందుకునే అవకాశం ఉందట. మంచి మాస్ యాక్షన్‌గా వస్తోన్న ఈ సినిమాలో కంటెంట్ బాగుంటే విశ్వక్ సేన్ కెరీర్‌లో భారీ విజయాన్ని నమోదు చేయనుంది.
ఈ సినిమా ఏరియా వైజ్ బిజినెస్ డీటెల్స్ విషయానికొస్తే..
నైజాం (తెలంగాణ)లో - రూ. 3 కోట్లు..
సీడెడ్ (రాయలసీమ)లో - రూ. 1 కోటి..
ఆంధ్ర ప్రదేశ్ - రూ. 2.8 కోట్లు..
తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 6.80 కోట్లు..
కర్ణాటక + రెస్టాఫ్ భారత్ + ఓవర్సీస్ - రూ. 0.70 కోట్లు..
మొత్తంగా రూ. 7.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
విశ్వక్ సేన్ నటించిన ‘దాస్ కా దమ్కీ’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర హిట్ అనిపించుకోవాలంటే.. రూ. 8 కోట్లు రాబట్టాలి. మొత్తంగా ఈ యువ నటుడి కెరీర్‌లోనే అత్యధిక బిజినెస్ చేసిన సినిమా రికార్డులకు ఎక్కింది.
ఈ సినిమాలో విశ్వక్‌సేన్ రెండు పాత్రల్లో నటిస్తున్నట్టు చూపించారు. ఒకటి ఫార్మా కంపెనీ ఓనర్‌గా నటిస్తే.. మరొకటి స్లమ్‌డాగ్ తరహా క్యారెక్టర్. ఈ సినిమాలో విశ్వక్ సేన్ రెండు విభిన్న పాత్రల్లో నటించాడా.. ఒకడే రెండు పాత్రల్లో కనిపిస్తాడా అనేది చూడాలి. గతంలో తెరకెక్కిన రౌడీ అల్లుడు, విక్రమార్కుడు తరహాలో ఒక హీరో ప్లేస్‌లో మరో హీరో వెళ్లే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించినట్టు కనబడుతోంది. ఈ సినిమా మలయాళంలో హిట్టైన మూవీకి రీమేక్‌గా తెరకెక్కించినట్టు సమాచారం.
ఈ సినిమాలో విశ్వక్‌సేన్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. ఇతర పాత్రల్లో రావు రమేశ్, పృథ్వీరాజ్, హైపర్ ఆది నటిస్తున్నారు. ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందించారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రాన్ని వన్మయి క్రియేషన్స్, విష్వక్సేన్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Das Ka Dhamki, Tollywood, Vishwak Sen