VISHWAK SEN ASHOKA VANAMLO ARJUNA KALYANAM RELEASE DATE FINALIZED A POSTER RELEASED SR
Vishwak Sen : అశోకవనంలో అర్జున కళ్యాణం విడుదల విషయంలో క్లారిటీ.. కొత్త రిలీజ్ డేట్ ఇదే..
Vishwak Sen Ashoka Vanamlo Arjuna Kalyanam release date finalized Photo : Twitter
Vishwak Sen : విశ్వక్ సేన్ “అశోక వనంలో అర్జున కళ్యాణం” (Ashoka Vanamlo Arjuna Kalyanam) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు విద్యా సాగర్ చింత దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా ఈ పాటికే పలు మార్లు రిలీజ్ డేట్ వాయిదా పడింది. ఇక చివరగా ఈ సినిమా ఈ ఏప్రిల్ 22న విడుదలవ్వుతున్నట్ల ప్రకటించగా .. మరోసారి వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
Vishwak Sen : యువ నటుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. వరుస సినిమాల్లో నటిస్తూ అదరగొడుతున్నారు. అందులో భాగంగా ఆయన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తోన్న “అశోక వనంలో అర్జున కళ్యాణం” (Ashoka Vanamlo Arjuna Kalyanam) అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు విద్యా సాగర్ చింత దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా ఈ పాటికే పలు మార్లు రిలీజ్ డేట్ వాయిదా పడింది. ఇక చివరగా ఈ సినిమా ఈ ఏప్రిల్ 22న విడుదలవ్వుతున్నట్ల ప్రకటించగా .. మరోసారి వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఏప్రిల్ 22న విడుదల కావాల్సిన విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం చివరి నిమిషంలో వాయిదా పడింది. దీనికి కారణం KGF 2 అని అంటున్నారు. కెజియఫ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో తమ సినిమా ఈ టైమ్‌లో విడుదల చేస్తే.. సరిగా ఆదరణ పొందకపోవచ్చని దర్శక నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత ఈ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుందని.. చిరంజీవి ఆచార్య సినిమా విడుదలైన ఒకరోజు తర్వాత విశ్వక్ సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం విడుదలకానుందని ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేయగా.. అదంతా ఏమి లేదంటూ చిత్రబృందం (Ashoka Vanamlo Arjuna Kalyanam new release date) మరో డేట్‌ను ప్రకటించింది. ఈ సినిమాను మే 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ఓ పోస్టర్‌ను వదిలించి టీమ్. దీంతో ఈ సినిమా విడుదలపై వస్తోన్న రూమర్స్‌కు చెక్ పెట్టినట్లు అయ్యింది.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. విశ్వక్ సేన్ ఈ సినిమాలో అర్జున్ కుమార్ అల్లం పాత్రను పోషించారు. విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బాపినీడు బి, సుధీర్ ఈదరతో పాటు ఎస్విసీసీ డిజిటల్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికవరకు గడ్డంతో కాస్త రఫ్ లుక్‌లో కనిపించిన విశ్వక్ ఈ సినిమా కోసం పూర్తిగా తన మేకోవర్ని మార్చుకుని సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. జయ ఫణి సంగీతం అందిస్తున్నారు. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్గా చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో పాటు విశ్వక్ సేన్ ముఖ చిత్రం (Mukhachitram) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్‌తో పాటు కీలక పాత్రల్లో వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ నటిస్తున్నారు. కలర్ ఫొటో సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ఈ (Mukhachitram) చిత్రానికి కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్ కే ఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మిస్తున్నారు. గంగాధర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ పవర్ ఫుల్ లాయర్ పాత్రలో విశ్వామిత్ర పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాతో పాటు విశ్వక్ సేన్ (Vishwak Sen) నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. విశ్వక్ సేన్.. తమిళ సూపర్ హిట్ ప్రేమకథ చిత్రం ఓ మై కడవులే రీమేక్‌లో విశ్వక్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాను పివిపి సినిమా , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు.
— Pulagam Chinnarayana (@PulagamOfficial) April 17, 2022
ఈసినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) దేవుడిగా కనిపించనున్నాడని అంటున్నారు. తమిళ వర్షెన్‌లో విజయ్ సేతుపతి దేవుడి పాత్రను చేయగా అదే పాత్రలో ఇప్పుడు తెలుగులో అల్లు అర్జున్ చేస్తున్నాడని తెలుస్తోంది. అశోక్ సెల్వన్ పాత్రను తెలుగులో విశ్వక్ సేన్ నటిస్తున్నారు. ఇక విశ్వక్ సేన్ నట ప్రయాణం విషయానికి వస్తే.. మొదట అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించి ఆ తర్వాత నటుడుగా మారారు విశ్వక్. టాలీవుడ్లో బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. ఇండి ఫిల్మ్ వెళ్లిపోమాకే అనే సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమై.. తన రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత మలయాళ హిట్ సినిమా అంగమలై డైరీస్ తెలుగు రీమేక్ ఫలక్నామా దాస్‌లో నటించి నిర్మించి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు విశ్వక్ సేన్. ఈ సినిమాతో విశ్వక్ సేను మాస్కా దాస్ అనే పేరును తెచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత వెంటనే ‘హిట్’ అంటూ క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో అందరినీ ఆశ్చర్చపరిచారు.
కొత్త దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో నాని నిర్మాణంలో వచ్చిన హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటన అబ్బుర పరుస్తుంది. ఈ సినిమాలో విశ్వక్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలా విశ్వక్ సేన్ తనదైన నటనతో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. ఇక విశ్వక్ సేన్ నటించిన పాగల్ ఇటీవల విడుదలై ఓకే అనిపించింది. విశ్వక్ సేన్, (Vishwak Sen Nivetha Pethuraj ) నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో నరేష్ కుప్పిలి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘పాగల్’ . దిల్ రాజు సమర్పణలో బెక్కెమ్ వేణుగోపాల్ ఈ సినిమాను లక్కీ మీడియా పతాకంపై నిర్మించారు. మంచి అంచనాల మధ్య 2021 ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అనుకున్నంతగా అలరించలేకపోయింది. థియేటర్ రన్ ముగిడయంతో ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.