Home /News /movies /

VISHWAK SEN ASHOKA VANAMLO ARJUNA KALYANAM FIRST LYRICAL SONG OO ADAPILLA SONG RELEASED TA

Vishwak Sen : ’అశోకవనంలో అర్జున కల్యాణం’ నుంచి మొదటి లిరికల్‌ సాంగ్ విడుదల.. సోషల్ మీడియాలో వైరల్..

విశ్వక్‌సేన్ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ మూవీ నుంచి తొలి లిరికల్ సాంగ్ విడుదల (Twitter/Photo)

విశ్వక్‌సేన్ ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ మూవీ నుంచి తొలి లిరికల్ సాంగ్ విడుదల (Twitter/Photo)

Vishwak Sen :  యువ నటుడు విశ్వక్‌ సేన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. విశ్వక్ సేన్ మొదట అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించి ఆ తర్వాత నటుడుగా మారారు. తాజాగా ఈయన హీరోగా నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ నుంచి మొదటి పాటను విడుదల చేశారు.

ఇంకా చదవండి ...
  Vishwak Sen :  యువ నటుడు విశ్వక్‌ సేన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర లేదు. విశ్వక్ సేన్ మొదట అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప్రారంభించి ఆ తర్వాత నటుడుగా మారారు. టాలీవుడ్‌‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి మంచి పాపులారిటీ తెచ్చుకున్న హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. ఇండి ఫిల్మ్ ‘వెళ్లిపోమాకే’ అనే సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమై.. తన రెండో సినిమా ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ తరువాత మలయాళ హిట్ సినిమా అంగమలై డైరీస్ తెలుగు రీమేక్ ‘ఫలక్‌నుమా దాస్‌’లో నటించి నిర్మించి డైరెక్ట్ చేసి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించారు విశ్వక్ సేన్. ఈ సినిమాతో విశ్వక్ సేన్ మాస్‌కా దాస్ అనే పేరును తెచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత వెంటనే ‘హిట్’ అంటూ క్రైమ్ థ్రిల్లర్ సినిమాతో అందరినీ ఆశ్చర్చపరిచారు. కొత్త దర్శకుడు శైలేష్ కొలను దర్శకత్వంలో నాని నిర్మాణంలో వచ్చిన హిట్ సినిమాలో విశ్వక్ సేన్ నటన అబ్బుర పరుస్తుంది. ఈ సినిమాలో విశ్వక్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అలా విశ్వక్ సేన్ తనదైన నటనతో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు.

  తాజాగా  ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'అశోకవనంలో అర్జునకళ్యాణం' (Ashoka Vanamlo Arjuna Kalyanam first look). రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి విద్యా సాగర్ చింతా దర్శకత్వం వహిస్తున్నారు. బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించి ఆ మధ్య ఫస్ట్ లుక్, టీజర్ చాలా ఫ్రెష్‌గా ఉండి నెటిజన్స్‌ను ఆకట్టుకుంది.

  Vijay Devarakonda: బాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ మరో రికార్డు.. ఆ ఇద్దరు హీరోల తర్వాత ఆ రికార్డు అందుకున్న లైగర్..

  తనకు ఓ మంచి అమ్మాయిని చూడాలని, తనకు పెద్దగా పట్టింపులు, కట్నం వంటి డిమాండ్లు కూడా ఏమీ లేవని విశ్వక్ చెప్పడం ఆకట్టుకుంది. ఇప్పటికవరకు గడ్డంతో కాస్త రఫ్ లుక్‌లో కనిపించిన విశ్వక్ ఈ సినిమా కోసం పూర్తిగా తన మేకోవర్‌ని మార్చుకుని సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ఇప్పటివరకూ విశ్వక్ నటించిన చిత్రాలకు పూర్తి భిన్నమైన కథతో వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ .. ‘ఓ ఓ ఆడపిల్ల’ సాంగ్‌ను రిలీజ్ చేసారు. ఈ పాట సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన రుక్సర్ థిల్లాన్ కథానాయికగా నటించింది.


  సింగర్‌ రామ్‌ మిరియాల పాడారు. అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాలో వడ్డీ వ్యాపారి అర్జున్‌ కుమార్‌గా అలరించనున్నారు విశ్వక్ సేన్. ఇక విశ్వక్ సేన్ నటించిన పాగల్ ఇటీవల విడుదలై అంతగా ఆకట్టుకోలేదు . విశ్వక్ సేన్, (Vishwak Sen Nivetha Pethuraj ) నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో నరేష్ కుప్పిలి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘పాగల్’ . దిల్ రాజు సమర్పణలో బెక్కెమ్ వేణుగోపాల్ ఈ సినిమాను లక్కీ మీడియా పతాకంపై నిర్మించారు.

  Prabhas - Radhe Shyam : 1970 నాటి ఇట‌లీని రాధే శ్యామ్ లో ఎలా క్రీయేట్ చేశారు..? ఆర్ట్ డైరెక్ట‌ర్ చెప్పిన విశేషాలు.. ?

  ఇక విశ్వక్ నటిస్తున్న ఇతర చిత్రాల విషయానికి వస్తే.. తమిళ హిట్ సినిమా ఓ మై కడవులేలో విశ్వక్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ దేవుడిగా కనిపించనున్నాడని అంటున్నారు. తమిళ వర్షెన్‌లో విజయ్ సేతుపతి దేవుడి పాత్రను చేయగా అదే పాత్రలో ఇప్పుడు తెలుగులో అల్లు అర్జున్ చేస్తున్నాడని తెలుస్తోంది. అశోక్‌ సెల్వన్ పాత్రను తెలుగులో విశ్వక్ సేన్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో ఉంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Ashoka Vanamlo Arjuna Kalyanam, Tollywood, Vishwak Sen

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు