Vishwak Sen : యువ నటుడు విశ్వక్ సేన్ (Vishwak Sen) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వరుస సినిమాల్లో నటిస్తూ అదరగొడుతున్నారు. అందులో భాగంగా ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఓరి దేవుడా. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ఆ మధ్య విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. ఇక అది అలా ఉంటే విశ్వక్ సేన్ స్వయంగా నటిస్తూ, నిర్మిస్తోన్న దర్శకత్వం వహించిన లేటెస్ట్ మాస్ యాక్షన్ చిత్రం ధమ్కీ(Dhamki ). ఈ సినిమా మార్చి22న విడుదలకానుంది. ఇక అది అలా ఉంటే లేటెస్ట్‌గా విశ్వక్ సేన్ తన నుంచి తన కెరీర్ 10వ ప్రాజెక్ట్‌ని ప్రకటించాడు. ఈ సినిమాను ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. దీనిని దర్శకుడు రవితేజ ముళ్ళపూడి డైరెక్ట్ చేయనున్నాడు. మీనాక్షి చౌదరి (meenakshi chaudhary) హీరోయిన్‌గా చేస్తోంది. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా ఈరోజు గ్రాండ్‌గా లాంఛ్ అయ్యింది. ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
ఇక ధమ్కీ విషయానికి వస్తే.. టీజర్ అండ్ ట్రైలర్‌తో మంచి బజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ సినిమాకు ఇప్పటికే చాలా ఏరియాల్లో బిజినెస్ జరిగిపోయిందని తెలుస్తోంది. ఇక నైజాం ఏరియాలో ఈ సినిమాకి 3 కోట్ల దాకా రేటు దక్కిందని తెలుస్తోంది. అంతేకాదు అటు ఏపీలోని ఇతర ఏరియాల్లో కూడా మంచి బిజినెస్ ను సొంతం చేసుకుందని తెలుస్తోంది. అంతేకాదు విశ్వక్ సేన్ కెరీర్‌లో హైయెస్ట్ బిజినెస్‌ను అందుకునే అవకాశం ఉందట. మంచి మాస్ యాక్షన్‌గా వస్తోన్న ఈ సినిమాలో కంటెంట్ బాగుంటే విశ్వక్ సేన్ కెరీర్‌లో భారీ విజయాన్ని నమోదు చేయనుంది.
Our #ProductionNo7, the highly anticipated 'Mass ka Das' @VishwakSenActor's #VS10 begins with a Pooja ceremony! ✨️????
???? @itsRamTalluri ✍️ & ???? @RaviTejaDirects ⭐️ing @Meenakshiioffl ???? @JxBe ???? @manojhreddydop ✂️ @anwaraliedit ???? #RajaniTalluri ???? on by @BvsRavi pic.twitter.com/bsVClrfpvo — SRT Entertainments (@SRTmovies) March 19, 2023
ఇక మరోవైపు ఇప్పటికే టీజర్స్, ట్రైలర్స్‌తో మంచి బజ్‌ను క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు (NTR) ఎన్టీఆర్ (Dhamki pre release event ) వస్తున్నారు. దీనికి సంబంధించి ఓ ప్రకటన కూడా విడుదలైంది. మార్చి 17న హైదరాబాద్‌లోని శిల్పాకళావేదికలో ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరుగనుంది. ఈ ఈవెంట్‌కు ఎన్టీఆర్ వస్తున్నారు. నాటు నాటు పాటకు ఆస్కార్ వచ్చిన తర్వాత మొదటిసారి ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో మాట్లాడానున్నారు.
ఇక ధమ్కీ విషయానికి వస్తే.. పాటలతో అదిరే రెస్పాన్స్‌ను దక్కించుకున్న ఈ సినిమాకు సంబంధించి మరో ట్రైలర్ విడుదలైంది. ఈకొత్త (Dhamki Trailer ) ట్రైలర్ కేక పెట్టిస్తోంది. మాస్ అంశాలతో రూపోందిన ఈ ట్రైలర్‌ను చూస్తుంటే విశ్వక్‌కు ఈసారి భారీ హిట్ దక్కేలా ఉందని అంటున్నారు. ట్రైలర్‌ను బట్టి ఈ సినిమాలో విశ్వక్ సేన్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడని తెలుస్తోంది. ఒకడే రెండు పాత్రల్లో కనిపిస్తాడా అనేది చూడాలి. గతంలో తెరకెక్కిన రౌడీ అల్లుడు, విక్రమార్కుడు తరహాలో ఒక హీరో ప్లేస్‌లో మరో హీరో వెళ్లే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించినట్టు కనబడుతోంది. ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు మలయాళం,కన్నడ, తమిళం, హిందీలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.
A Mass feast with a double treat ????#DasKaDhamki TRAILER 2.0 is out now????
- https://t.co/C728lpvMRt Releasing WW IN CINEMAS on MARCH 22nd ????@Nivetha_Tweets @leon_james @KumarBezwada @VanmayeCreation @VScinemas_ @JMedia_Factory @saregamasouth pic.twitter.com/UYo2YmEzO0 — VishwakSen (@VishwakSenActor) March 12, 2023
ఇక ఈసినిమాను మార్చి 22న గ్రాండ్‌గా విడుదలచేయున్నారు. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ (Nivetha Pethuraj) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇతర పాత్రల్లో రావు రమేశ్, పృథ్వీరాజ్, హైపర్ ఆది నటిస్తున్నారు. ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందించారు. లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వన్మయి క్రియేషన్స్, విష్వక్సేన్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఇక విశ్వక్ లేటెస్ట్ సినిమా ఓరి దేవుడా విషయానికి వస్తే.. ఈ సినిమాలో వెంకటేష్ మోడ్రన్ దేవుడి పాత్రలో కనిపించారు. ఆయన భక్తుడిగా విశ్వక్ సేన్ నటించారు. దీపావళీ సందర్భంగా 2022 అక్టోబర్ 21న విడుదలైన ఈ సినిమా అనుకున్న రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. మిథిలా పాల్కర్, ఆశాభట్ హీరోయిన్స్‌గా నటించారు. పీవిపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా తెరకెక్కించాయి. ఈ సినిమా ఓటీటీలో సూపర్ రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ముఖ్యంగా ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే అబ్బాయి పాత్రలో విశ్వక్ సేన్ నటన బాగుంది. ఈ నేపథ్యంలో ఆయన్ని కాపాడే దేవుడి పాత్రలో వెంకటేష్ నటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tollywood news, Vishwak Sen