Vishnupriya : బుల్లితెర అందాల యాంకర్ విష్ణుప్రియకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది... పోవే పోరా ప్రోగ్రాంతో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా బుల్లితెరమీదకు అడుగులేసింది. ఈ భామ సోషల్ మీడియాలో కూడా యమ యాక్టివ్. తన హాట్ ఫిగర్‌తో ఫోటో షూట్లు చేస్తూ సోషల్ మీడియాను ఊపేస్తోంది. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా తన యాంకరింగ్ చేస్తోన్న కార్యక్రమాలకు సంబందించిన షూటింగ్స్ రద్దవ్వడంతో ఇంటిపట్టునే ఉంటున్న ఈ భామ ఓ పాప్ సాంగ్‌కు అదిరిపోయే డాన్స్ వేసి అదరగొట్టింది. దానికి సంబందించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో విష్ణుప్రియ తన నడుమును బీట్‌కు తగ్గట్లు ఊపుతూ వయ్యారంగా అదరగొట్టింది. ఇక ఈ వీడియోను చూసిన ఇన్‌స్టాగ్రామ్‌లోని ఆమె ఫాలోవర్స్, నెటిజన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు. వావ్ విష్ణుప్రియ సూపర్.. అదిరిపోయిందంటూ పొగుడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అలా విష్ణుప్రియ ఈ లాక్ డౌన్ కాలంలో తన అభిమానులకు చేరువుతోంది. ఇక మరో హాట్ యాంకర్ శ్రీముఖి కూడా ఈ లాక్ డౌన్ కాలంలో సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతోంది. అందులో భాగంగా ఆ మధ్య ఓ బిర్యానీ వీడియో పోస్ట్ చేసిన శ్రీముఖి.. తాజాగా మరో వీడియోను పోస్ట్ చేసింది.
A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) on
Published by:Suresh Rachamalla
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.