హోమ్ /వార్తలు /సినిమా /

Manchu Vishnu | Ginna Teaser : మంచు విష్ణు జిన్నా టీజర్‌కు సోషల్ మీడియాలో అదిరిన రెస్పాన్స్..

Manchu Vishnu | Ginna Teaser : మంచు విష్ణు జిన్నా టీజర్‌కు సోషల్ మీడియాలో అదిరిన రెస్పాన్స్..

Vishnu Manchu Sunny Leone Paayal Rajput Ginna Teaser Twitter

Vishnu Manchu Sunny Leone Paayal Rajput Ginna Teaser Twitter

Manchu Vishnu : చాలాకాలం తర్వాత మంచు విష్ణు (Manchu Vishnu) నటిస్తున్న సినిమా 'జిన్నా' (Ginna). ఈ చిత్రంలో విష్ణు సరసన శృంగార తార సన్నీలియోన్ (Sunny Leone), హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) నటిస్తున్నారు. నూతన దర్శకుడు సూర్య తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ 5న విడుదలకానున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా టీజర్ (Ginna Teaser) ని రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  మంచు విష్ణు (Manchu Vishnu) ఈ మధ్య సినిమాలు తగ్గించిన సంగతి తెలిసిందే. కాగా ఆయన కొంత కాలం తర్వాత నటిస్తున్న సినిమా 'జిన్నా' (Gali Nageswara Rao). జిన్నా చిత్రంలో విష్ణు సరసన శృంగార తార సన్నీలియోన్ (Sunny Leone), హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) నటిస్తున్నారు. నూతన దర్శకుడు సూర్య తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి తాజాగా టీజర్ (Ginna Teaser) ని రిలీజ్ చేశారు. మరి ఈ టీజర్ మంచి ఫన్ ఎలిమెంట్స్‌తో మాస్‌ను ఆకట్టుకునేలా ఉంది. టీజర్‌ను బట్టి చూస్తే సినిమాలో హారర్ బ్యాక్ డ్రాప్ కూడా ఉందని తెలుస్తోంది. టీజర్‌ను చూస్తుంటే విష్ణు హిట్ కొట్టేలా ఉన్నారు. ఈ టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.  ఈ టీజర్ ఇప్పటికే యూట్యూబ్‌లో 1.9 మిలియన్ వ్యూస్‌తో అదరగొడుతోంది. ఇక అనూప్ మంచి మ్యూజిక్ అందించగా పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నారు.  హాస్య కథాచిత్రాల స్పెషలిస్ట్ గా పేరు గాంచిన జి.నాగేశ్వర రెడ్డి ఈ సినిమాకి కథ అందించగా, కోన వెంకట్ స్క్రీన్ ప్లే - సంభాషణలు అందిస్తున్నారు.

  ఇక ఈ సినిమాలో ఒక పాటను విష్ణు కుమార్తెలు అరియనా, వివియానా పాడారట. సింగర్స్‌గా వాళ్ళకు తొలి పాటని తెలుస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్న ఈ సినిమాలోని ఓ పాటను అరియానా, వివియానా పాడటం విశేషం అంటున్నారు. భాస్కరభట్ల ఈ పాటకు సాహిత్యం అందించారట. ఈ పాట సినిమాకి కీలకంగా ఉండనుందని అంతేకాదు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాను డా. మంచు మోహన్ బాబు (Mohan Babu) ఆశీస్సులతో ఏవా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌లో విష్ణు మంచు నిర్మిస్తున్నారు. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు.

  ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లేను కోన వెంకట్ అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరామ్యాన్ గా, భాను, నందు డైలాగ్స్ అందిస్తున్నారు. జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు. మా అధ్యక్షుడు అయిన తర్వాత అసలు సినిమాలపై ఫోకస్ చేయడం లేదు మంచు విష్ణు. దానికంటే ముందు కూడా కొన్ని రోజులుగా సినిమాలు చేయడం లేదు. ఒప్పుకోవడం లేదు. ముఖ్యంగా వరస ఫ్లాపులు వస్తున్న నేపథ్యంలో గ్యాప్ తీసుకోవాలనుకున్నారు విష్ణు. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ కెరీర్‌పై ఫోకస్ చేస్తున్నారు. ఇక విష్ణు కెరీర్ విషయానికి వస్తే.. అయితే ఒకట్రెండు మంచి విజయాలు వచ్చినా కూడా కోరుకున్న గుర్తింపు రాలేదు.

  విష్ణు ఢీ, దేనికైనా రెడీ లాంటి బ్లాక్‌బస్టర్స్ అందుకున్న తర్వాత కూడా కెరీర్‌ను అనుకున్న దారిలో సెట్ చేసుకోలేకపోయారు. వరస సినిమాలు అయితే చేస్తున్నారు కానీ విజయాలు మాత్రం రావడం లేదు. ఆ మధ్య 50 కోట్లతో నిర్మించిన మోసగాళ్లు కూడా పెద్దగా ఉపయోగపడలేదు.  భారీ క్యాస్టింగ్‌తో వచ్చిన మోసగాళ్ళు ఏమాత్రం అలరించలేకపోయింది. అయితే తన కెరీర్ ఇంత దారుణంగా ముందుకు వెళ్లడానికి.. ఇప్పటి వరకు స్టార్‌గా గుర్తింపు సంపాదించుకోకపోవడానికి ఆత్మ విశ్లేషణ చేసుకున్నారు విష్ణు. దీనికి సమాధానం ఓ షోలో చెప్పారు. కొందరు దర్శకుల కారణంగానే తన కెరీర్ ఇలా అయిపోయిందని.. తాను చేసిన కొన్ని తప్పులు.. దర్శకులను గుడ్డిగా నమ్మడం వల్లే తనకు ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు విష్ణు.

  Published by:Suresh Rachamalla
  First published:

  Tags: Manchu Vishnu, Tollywood news

  ఉత్తమ కథలు