రిలీజ్ తేదీ | : | అక్టోబర్ 21, 2022 |
దర్శకుడు | : | సూర్య |
సంగీతం | : | అనూప్ రూబెన్స్ |
నటీనటులు | : | మంచు విష్ణు, పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్, వెన్నెల కిషోర్, సద్దాం |
సినిమా శైలి | : | సైకో థ్రిల్లర్ |
సినిమా నిడివి | : | 142 నిమిషాలు |
మంచు విష్ణు (Manchu Vishnu) ఈ మధ్య సినిమాలు తగ్గించిన సంగతి తెలిసిందే. కాగా ఆయన కొంత కాలం తర్వాత నటించిన సినిమా 'జిన్నా' (Gali Nageswara Rao). జిన్నా చిత్రంలో విష్ణు సరసన శృంగార తార సన్నీలియోన్ (Sunny Leone), హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) నటించారు. ఈ సినిమాను డా. మంచు మోహన్ బాబు (Mohan Babu) ఆశీస్సులతో ఏవా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో విష్ణు మంచు నటిస్తూ నిర్మించారు. కొత్త దర్శకుడు ఈషాన్ సూర్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లేను కోన వెంకట్ అందించారు. సినిమాటోగ్రాఫర్ చోటా.కె.నాయుడు, జి.నాగేశ్వరరెడ్డి మూల కథ సమకూర్చారు. ఇక టీజర్, ట్రైలర్స్‌తో మంచి బజ్‌ను క్రియేట్ చేసిన ఈ సినిమా (అక్టోబర్ 21న) ఈరోజు ప్రపంచవ్యా్ప్తంగా విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉంది.. కథ కథనం ఏంటీ.. నటీ నటలు ఫెర్మామెన్స్ ఎలా ఉంది.. మొదలగు అంశాలను ఈ (Ginna Review) రివ్యూలో చూద్దాం..
సినిమా పేరు : జిన్నా
డైరెక్టర్ : సూర్య
నటీనటులు : మంచు విష్ణు, పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్, వెన్నెల కిషోర్, సద్దాం, నరేష్, చంద్ర తదితరులు..
నిర్మాత : మంచు విష్ణు, మోహన్ బాబు మంచు
సంగీతం : అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ : ఛోటా కె. నాయుడు
విడుదల తేది : అక్టోబర్ 21, 2022
కథ విషయానికి వస్తే.. : తిరుపతిలో జిన్నా (మంచు విష్ణు) తన ఫ్రెండ్స్‌తో కలిసి టెంట్ హౌస్ నడుపుతుంటాడు. జిన్నా పూర్తి పేరు.. గాలి నాగేశ్వరరావు. అయితే పూర్తి పేరుతో ఎవరైనా జిన్నాను పిలిస్తే కోపం వస్తుంది. అందుకే షార్ట్ కట్ లో ‘జిన్నా’ అంటూ పిలవాలనీ అంటుంటాడు. జిన్నాకు స్కూల్ టైమ్‌లో రేణుక (సన్ని లియోన్), స్వాతి (పాయల్ రాజ్ పుత్ )లతో మంచి స్నేహం ఉంటుంది. అయితే పల్లెటూరిలో ఉండలేక రేణుక తండ్రి నారాయణస్వామి , రేణుకను తీసుకుని అమెరికా వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు పెరిగి పెద్దయ్యాక చిన్నప్పటి స్వాతితోనే జిన్నా ప్రేమలో పడతాడు. యువకుడిగా మారిన జిన్నా బతకడానికి టెంట్ హౌస్ నడుపుతుంటాడు. అయితే జిన్నాకు ఊరి నిండా అప్పులే.. స్వాతి అతనికి సాయం చేస్తుంటుంది. అయినా ఆ అప్పుల నుండి బయట పడలేకపోతుంటాడు జిన్నా. ఇక ఈ సమయంలో జిన్నా చిన్ననాటి ఫ్రెండ్ రేణుక ఇండియాకు తిరిగి వస్తుంది. అయితే రేణుక దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయని తెలుసుకున్న జిన్నా.. ఆమెను ప్రేమిస్తున్నానంటూ చెప్పి తన సాయంతో అప్పులు తీర్చడంతో పాటు ఊరి ప్రెసిడెంట్ కావాలనే తన కోరికనూ నెరవేర్చుకోవాలని ప్లాన్ వేస్తాడు. ఈ క్రమంలో రేణుకను పెళ్ళి చేసుకోవడానికీ రెడీ అవుతాడు. స్వాతిని ప్రేమించిన జిన్నా.. రేణుకను పెళ్లి చేసుకుంటాడా.. అసలు రేణుకకు అంత డబ్బు ఎలా వచ్చింది.. ఎందుకు జనాలు రేణుకను చూసి భయపడుతుంటారు.. అనేది కథ..
కథ కథనం :
జిన్నా సినిమాలో రేణుక పాత్రలో వచ్చే ట్విస్ట్ సినిమాకు మంచి మలుపు. సినిమా ఓ వైపు కామెడీ, మరోవైపు హారర్ ఛాయలతో సాగుతుంది. అయితే ఇలాంటి సీన్స్ చాలా సినిమాల్లో చూశాం కదా అనిపిస్తుంది ప్రేక్షకుడికి. ఈ సినిమాకు మూల కథను అందించిన ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి తనదైన శైలిలో వినోదాన్ని బాగానే అందించాడు. కోన వెంకట్ స్క్రీన్ ప్లే కూడా పరవాలేదనిపిస్తుంది. ఇక ఫస్టాఫ్ కంటే సెకాండ్ మరింత ఆకట్టుకుంటుంది. అనూప్ రూబెన్స్ సంగీతం బాగుంది. ఈ సినిమాకు మరో హైలెట్ ఏమంటే.. హీరో ఓ సన్నివేశంలో ‘నువ్వు నన్ను ట్రోల్ చేయ్ ఎంజాయ్ చేస్తా.. కానీ మా వాళ్ళ జోలి కొస్తే తోలు తీస్తా’ అంటూ డైలాగ్‌ను అసందర్భంగా చెప్పడం.
నటీ నటుల విషయానికి వస్తే : జిన్నాగా మంచు విష్ణు మంచి నటనను ప్రదర్శించాడు. ముఖ్యంగా కామెడీ సన్నివేశాల్లో చాలా బాగా నటించాడు. ముఖ్యంగా విష్ణు డ్యాన్సులు చాలా బాగున్నాయి. పాయల్ రాజ్ పుత్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. సన్నీలియోన్ విషయానికి వస్తే తన గ్లామర్‌తో మరోసారి వావ్ అనిపించింది. చెప్పాలంటే తనదే సినిమాలో హైలెట్ పాత్ర. ఇక మిగతా పాత్రల్లో నటించిన వెన్నెలకిషోర్, సద్దాం, చంద్ర, నరేష్ కామెడీని తమదైన శైలిలో పండించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర కోసం రాసిన డైలాగ్స్ ఫన్నీగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
మంచు విష్ణు నటన..
సన్నీలియోన్ క్యారెక్టర్..
మైనస్ పాయింట్స్ :
రొటీన్ కామెడీ..
కథ నెమ్మదిగా సాగడం..
చివరి మాట : కామెడీ ఎంటర్టైనర్.. ఒకసారి చూడోచ్చు..
రేటింగ్ : 2. 75
కథ | : | 3/5 |
స్క్రీన్ ప్లే | : | 2.5/5 |
దర్శకత్వం | : | 3/5 |
సంగీతం | : | 3/5 |
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ginna Movie, Manchu Vishnu, Payal Rajput, Sunny Leone, Tollywood news