హోమ్ /వార్తలు /సినిమా /

Manchu Vishnu | Ginna : మంచు విష్ణు జిన్నా నుంచి మాస్ సాంగ్.. జారు మిఠాయా విడుదల..

Manchu Vishnu | Ginna : మంచు విష్ణు జిన్నా నుంచి మాస్ సాంగ్.. జారు మిఠాయా విడుదల..

Ginna movie Jaru Mitaya Lyrical Video Photo : Twitter

Ginna movie Jaru Mitaya Lyrical Video Photo : Twitter

Manchu Vishnu : చాలాకాలం తర్వాత మంచు విష్ణు (Manchu Vishnu) నటిస్తున్న సినిమా 'జిన్నా' (Ginna). ఈ చిత్రంలో విష్ణు సరసన శృంగార తార సన్నీలియోన్ (Sunny Leone), హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) నటిస్తున్నారు. నూతన దర్శకుడు సూర్య తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ 21న విడుదలకానున్న ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదలైంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా నుంచి తాజాగా ఓ మాస్ సాంగ్‌ను విడదుల చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మంచు విష్ణు (Manchu Vishnu) ఈ మధ్య సినిమాలు తగ్గించిన సంగతి తెలిసిందే. కాగా ఆయన కొంత కాలం తర్వాత నటిస్తున్న సినిమా 'జిన్నా' (Gali Nageswara Rao). జిన్నా చిత్రంలో విష్ణు సరసన శృంగార తార సన్నీలియోన్ (Sunny Leone), హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ (Payal Rajput) నటిస్తున్నారు. నూతన దర్శకుడు సూర్య తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం రిలీజ్ డేట్ వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను మొదట అక్టోబర్ 5, 2022న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేశారు చిత్ర దర్శక నిర్మాతలు. అయితే అదే రోజు రెండు పెద్ద సినిమాలు.. చిరంజీవి గాడ్‌ఫాదర్, నాగార్జున ఘోస్ట్ విడుదలవుతుండడంతో థియేటర్స్ విషయంలో ఇబ్బంది తలెత్తే అవకాశం ఉన్నందున వాయిదా వేశారు. ఇక ఈ సినిమాను అక్టోబర్ 21, 2022కి పోస్ట్ పోన్ చేసినట్లు చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా ట్రైలర్‌ను దసరా సందర్భంగా అక్టోబర్ 5న విడుదల చేశారు. ప్పటికే విడుద‌లైన ట్రైల‌ర్‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. ఇక తాజాగా జారు మిటాయా (Jaru mitaya lyrical Song) అంటూ సాగే ఓ రొమాంటిక్ పాట లిరిక‌ల్ వీడియోను విడుద‌ల చేశారు. గ‌ణేశ్ రాసిన ఈ పాట‌ను సింహా, నిర్మలా రాథోడ్ పాడారు. మాస్ ప్రేక్షకులకు ఆకట్టకునేవిధంగా ఉంది పాట.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. సినిమా చిత్తూరు యాసలో సాగుతోందని డైలాగ్స్‌ను బట్టి తెలుస్తోంది. ‘‘నాకు దుడ్లు ముఖ్యమే కానీ, నా అనుకున్న వాళ్లు దుడ్లు కన్నా ఎక్కువ ముఖ్యం’’ అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా హారర్‌ కామెడీ జానర్‌లో వస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమా ట్రైలర్‌‌ను చూస్తుంటే.. ఆద్యంతం నవ్వులు పూయించేలా ఉంది. నటుడు విష్ణుతో పాటు.. కమెడియన్స్, చంద్ర, సద్దాంల టైమింగ్ సినిమాకు ప్లస్ కానుంది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే.. ఈ చిత్రంతో సూర్య దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పాయల్‌ రాజ్‌పుత్‌, సన్నీలియోన్ హీరోయిన్స్‌గా నటించారు.ఇక ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి చిత్రబృందం, ఈ సినిమా పై క్యూరియాసిటీని పెంచుతూనే ఉంది. అందులో భాగంగా ఈ సినిమాను రకరకాలుగా ప్రమోట్ చేస్తోంది. ఈ చిత్రం నుంచి విడుదలై ప్రచార చిత్రాలు కూడా మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి.

ఇక ఆ మధ్య విడుదలైన ఈ సినిమా టీజర్ మంచి ఫన్ ఎలిమెంట్స్‌తో మాస్‌ను ఆకట్టుకునేలా ఉంది. టీజర్‌ను బట్టి చూస్తే సినిమాలో హారర్ బ్యాక్ డ్రాప్ కూడా ఉందని తెలుస్తోంది. టీజర్‌, ట్రైలర్‌ను చూస్తుంటే విష్ణు హిట్ కొట్టేలా ఉన్నారు. ఈ ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.  ఈ సినిమాకు అనూప్ మంచి మ్యూజిక్ అందించగా పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని అక్టోబర్ 21న రిలీజ్ చేస్తున్నారు.  హాస్య కథాచిత్రాల స్పెషలిస్ట్ గా పేరు గాంచిన జి.నాగేశ్వర రెడ్డి ఈ సినిమాకి కథ అందించగా, కోన వెంకట్ స్క్రీన్ ప్లే - సంభాషణలు అందిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో ఒక పాటను విష్ణు కుమార్తెలు అరియనా, వివియానా పాడారట. సింగర్స్‌గా వాళ్ళకు తొలి పాటని తెలుస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్న ఈ సినిమాలోని ఓ పాటను అరియానా, వివియానా పాడటం విశేషం అంటున్నారు. భాస్కరభట్ల ఈ పాటకు సాహిత్యం అందించారట. ఈ పాట సినిమాకి కీలకంగా ఉండనుందని అంతేకాదు ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాను డా. మంచు మోహన్ బాబు (Mohan Babu) ఆశీస్సులతో ఏవా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌లో విష్ణు మంచు నిర్మిస్తున్నారు. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లేను కోన వెంకట్ అందిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ చో టా.కె.నాయుడు కెమెరామ్యాన్ గా, భాను, నందు డైలాగ్స్ అందిస్తున్నారు. జి.నాగేశ్వరరెడ్డి మూల కథ అందించారు.

మా అధ్యక్షుడు అయిన తర్వాత అసలు సినిమాలపై ఫోకస్ చేయడం లేదు మంచు విష్ణు. దానికంటే ముందు కూడా కొన్ని రోజులుగా సినిమాలు చేయడం లేదు. ఒప్పుకోవడం లేదు. ముఖ్యంగా వరస ఫ్లాపులు వస్తున్న నేపథ్యంలో గ్యాప్ తీసుకోవాలనుకున్నారు విష్ణు. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ కెరీర్‌పై ఫోకస్ చేస్తున్నారు. ఇక విష్ణు కెరీర్ విషయానికి వస్తే.. అయితే ఒకట్రెండు మంచి విజయాలు వచ్చినా కూడా కోరుకున్న గుర్తింపు రాలేదు.

విష్ణు ఢీ, దేనికైనా రెడీ లాంటి బ్లాక్‌బస్టర్స్ అందుకున్న తర్వాత కూడా కెరీర్‌ను అనుకున్న దారిలో సెట్ చేసుకోలేకపోయారు. వరస సినిమాలు అయితే చేస్తున్నారు కానీ విజయాలు మాత్రం రావడం లేదు. ఆ మధ్య 50 కోట్లతో నిర్మించిన మోసగాళ్లు కూడా పెద్దగా ఉపయోగపడలేదు.  భారీ క్యాస్టింగ్‌తో వచ్చిన మోసగాళ్ళు ఏమాత్రం అలరించలేకపోయింది. అయితే తన కెరీర్ ఇంత దారుణంగా ముందుకు వెళ్లడానికి.. ఇప్పటి వరకు స్టార్‌గా గుర్తింపు సంపాదించుకోకపోవడానికి ఆత్మ విశ్లేషణ చేసుకున్నారు విష్ణు. దీనికి సమాధానం ఓ షోలో చెప్పారు. కొందరు దర్శకుల కారణంగానే తన కెరీర్ ఇలా అయిపోయిందని.. తాను చేసిన కొన్ని తప్పులు.. దర్శకులను గుడ్డిగా నమ్మడం వల్లే తనకు ఈ పరిస్థితి వచ్చిందంటున్నారు విష్ణు.

First published:

Tags: Ginna Movie, Manchu Vishnu

ఉత్తమ కథలు