హోమ్ /వార్తలు /సినిమా /

Manchu Vishnu: పాయల్ పరువుతీసిన మంచు విష్ణు.. ఈ పిల్ల చేష్టలు అర్థం కావట్లేదంటూ!

Manchu Vishnu: పాయల్ పరువుతీసిన మంచు విష్ణు.. ఈ పిల్ల చేష్టలు అర్థం కావట్లేదంటూ!

Manchu Vishnu Payal (Photo Twitter)

Manchu Vishnu Payal (Photo Twitter)

Payal Rajput: మంచు విష్ణు తాజాగా ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో పాయల్‌ను పక్కన పెట్టేసినట్టు అనిపిస్తోంది. ఈ పిల్ల చేష్టలు అర్థం కావట్లేదంటూ ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మంచు విష్ణు (Manchu Vishnu) ఈ మధ్య ఎంతగా ట్రోలింగ్‌కు గురవుతున్నాడో అందరికీ తెలిసిందే. అయితే ఆ ట్రోలింగ్‌ను మాత్రం మంచు విష్ణు అంతగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. మంచు విష్ణు సోషల్ మీడియాలో ఏ పోస్ట్ వేసినా, ఏ ట్వీట్ వేసినా, ఏ అంశం మీద స్పందించినా, ఫోటోను షేర్ చేసినా కూడా నెటిజన్లు ఆడేసుకుంటున్నారు. అలా మంచు విష్ణు నెట్టింట్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా మారుతున్నాడు. మంచు విష్ణు తాజాగా ఓ వీడియోను షేర్ చేశాడు. అందులో పాయల్‌ను (Payal Rajput) పక్కన పెట్టేసినట్టు అనిపిస్తోంది. మంచు విష్ణుని సోషల్ మీడియా ఓ ట్రోలింగ్ మెటీరియల్‌లా చూస్తోంది. కానీ మంచు విష్ణు మాత్రం అందరితో ఎంతో సరదాగా ఉంటారు.సెట్‌లో అందరినీ నవ్విస్తుంటాడు. అందరితో కలిసి పోతాడు. మంచు విష్ణు గత కొన్ని రోజులుగా జిన్నా సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. జిన్నాకు సంబంధించిన ప్రతీ అప్డేట్ అందరినీ ఆకట్టుకుంటోంది.

జిన్నా టైటిల్‌ ప్రకటన విషయంలోనే ఎంతో కాంట్రవర్సీ ఏర్పడింది. తిరుమల కొండ బ్యాక్ గ్రౌండ్‌లో ఉండటం.. జిన్నా అనే పేరు పెట్టడంతో కాంట్రవర్సీ క్రియేట్ అయింది. అయితే జిన్నా షార్ట్ నేమ్ అని అసలు పేరు వేరే ఉంటుందని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి ఆ కాంట్రవర్సీలో జిన్నా సినిమా ఒక్కసారిగా హాట్ టాపిక్ అయింది. ఇక జిన్నా సినిమాలో సన్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్‌లు నటించడంతో అందరి కళ్లు పడ్డాయి. సన్నీ లియోన్ ఇది వరకే మంచు మనోజ్ కరెంట్ తీగ సినిమాలో స్పెషల్ రోల్ చేసింది. ఇక ఇప్పుడు మంచు విష్ణు జిన్నా చిత్రంలో ఓ లెంగ్తీ రోల్ చేస్తోంది. జిన్నా సెట్‌లో సన్నీ లియోన్ పాయల్‌లతో మంచు విష్ణు చేస్తోన్న సందడికి సంబంధించిన వీడియోలెన్నో వైరల్ అవుతూ వస్తున్నాయి.

పాయల్, సన్నీలతో కలిసి మంచు విష్ణు చేసిన రీల్ వీడియోలు, ఆ ఇద్దరూ కలిసి మంచు విష్ణును సరదాగా కొట్టిన వీడియోలు ఇలా ఎన్నో వైరల్ అయ్యాయి. ఈ ముగ్గురూ కలిసి చేసిన రీల్ వీడియోలు, మంచు విష్ణు చెప్పిన వంట చిట్కాలు ఇలా అన్నీ కూడా నెట్టింట్లో అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ ముగ్గురూ కలిసి చేసిన సందడి, వీడియోలతో జిన్నా సినిమా కూడా ప్రమోట్ అయింది. అయితే మొదటగా.. సన్నీ లియోన్‌ను తీసుకోకూడదని మంచు విష్ణు అనుకున్నాడట. కానీ అందరూ సజెస్ట్ చేయడం, మీడియా మిత్రులు కూడా ఓకే అనడంతో ఆ పాత్రకు సన్నీ లియోన్‌ను తీసుకున్నట్టుగా చెప్పుకొచ్చాడు. మొత్తానికి జిన్నా సినిమాను మాత్రం విష్ణు గట్టిగా ప్రమోట్ చేస్తున్నాడు. వచ్చే నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్ పెంచేస్తున్నారు. తాజాగా మంచు విష్ణు ఓ వీడియోను షేర్ చేశాడు. ఇందులో భాగంగా జిన్నా సెట్‌లో సాంగ్ కంపోజిషన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. డ్యాన్స్ మూమెంట్స్‌తో కాయ్ కచోరి అవుతోందని మంచు విష్ణు తన బాధలను సెటైరికల్‌గా అందరితో పంచుకున్నాడు. పాయల్ రాజ్‌పుత్ ఏదో లొడలొడా వాగేస్తోన్నట్టుగా చూపించాడు. పాయల్ తనంతట తాను ఏదో చెబుతూ ఉంటే.. మంచు విష్ణు మాత్రం ఇదేందిరా సోది అన్నట్టుగా ఎక్స్‌ప్రెషన్స్ పెట్టేశాడు. ఈ పిల్ల ఏం చెబుతోందో అర్థం కావడం లేదు.. అక్కడేమో డ్యాన్సులతో కాయ్ కచోరి అవుతోందంటూ పాయల్ పరువుతీసేశాడు మంచు విష్ణు.

Published by:Sunil Boddula
First published:

Tags: Manchu Vishnu, Payal Rajput, Tollywood

ఉత్తమ కథలు