హోమ్ /వార్తలు /సినిమా /

టెంపర్ చూపిస్తోన్న విశాల్

టెంపర్ చూపిస్తోన్న విశాల్

విశాల్ ఫైల్ ఫోటో

విశాల్ ఫైల్ ఫోటో

యూనివర్సల్ కాన్సెప్ట్‌తో నిర్భయ థీమ్‌తో తెరకెక్కిన ‘టెంపర్’ మూవీని తమిళంలో ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీని ఏ.ఆర్. మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ డైరెక్ట్ చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.

ఇంకా చదవండి ...

  జూనియర్ ఎన్టీఆర్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘టెంపర్’ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే కదా. ఈ మూవీ నటుడిగా తారక్‌కు మరో మెట్టు పైకెక్కించింది. కాజల్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీని పలు భాషల్లో రీమేక్ చేస్తున్నారు.

  ఇప్పటికే హిందీలో ఈ మూవీని రోహిత్ శెట్టి దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ హీరోగా ‘సింబా’ టైటిల్‌తో రీమేక్ చేశారు. ఈ మూవీని డిసెంబర్ 28న విడుదల చేయనున్నారు. ఈ మూవీలో సైఫ్, అమృతాల ముద్దుల కూతురు సారా అలీ ఖాన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

  ‘సింబా’గా రణ్‌వీర్ సింగ్

  యూనివర్సల్ కాన్సెప్ట్‌తో నిర్భయ థీమ్‌తో తెరకెక్కిన ఈ మూవీని తమిళంలో ‘అయోగ్య’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీని ఏ.ఆర్. మురుగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ డైరెక్ట్ చేస్తున్నాడు. రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో పార్థిపన్, కే.యస్.రవికుమార్‌లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ లుక్‌లో టెంపర్‌లో ఎన్టీఆర్ లుక్‌ను యదాతథంగా దింపేసినట్టు కనబడుతోంది.

  ఈ మూవీని 2019 జనవరిలో రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలో సన్నిలియోన్ ఐటెం సాంగ్ స్పెషల్ అట్రాక్షన్ అని చెబుతున్నారు. మరి ఎన్టీఆర్ చూపించిన టెంపర్‌ను విశాల్ ఎంత మేరకు చూపిస్తాడో చూడాలి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Kollywood, Tollywood, Vishal

  ఉత్తమ కథలు