హోమ్ /వార్తలు /సినిమా /

Vishal : తమిళ స్టార్ హీరో విశాల్ ఇంటిపై రాళ్లతో దాడి.. అసలేం జరిగిందంటే..

Vishal : తమిళ స్టార్ హీరో విశాల్ ఇంటిపై రాళ్లతో దాడి.. అసలేం జరిగిందంటే..

విశాల్ ఇంటిపై రాళ్లతో దాడి (Twitter/Photo)

విశాల్ ఇంటిపై రాళ్లతో దాడి (Twitter/Photo)

Vishal : తమిళ స్టార్ హీరో విశాల్  ఇంటిపై కొంత మంది గుర్తు తెలియని ఆగంతకులు రాళ్లతో దాడి చేసిన ఘటన తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. వివారాల్లోకి వెళితే..

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Vishal : తమిళ స్టార్ హీరో విశాల్  ఇంటిపై కొంత మంది గుర్తు తెలియని ఆగంతకులు రాళ్లతో దాడి చేసిన ఘటన తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. ఈ సందర్భంగా విశాల్.. పర్సనల్ మేనేటర్ స్థానికంగా ఉన్న చెన్నైలోని అన్నా నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విశాల్ .. తన ఫ్యామిలీతో కలిసి అన్నానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నాడు. సోమవారం (26-9-2022) రాత్రి రెడ్ కలకర్ కారులో వచ్చిన గుర్తు తెలియని ఆగంతకులు రాళ్లతో దాడి చేసారు. ఈ దాడిలో విశాల్ ఇంటి అద్దాలతో పాటు లైటింగ్ సిస్టమ్ దెబ్బ తిన్నట్టు సమాచారం. అయితే దుండగులు దాడి చేసిన విజువల్స్ సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అంతేకాదు దానికి సంబంధించిన రికార్డులను విశాల్ మేనేజర్ పోలీసులకు అందించారు. వీరి కంప్లైంట్‌‌ను తీసుకొని పోలీసులు కేసు దర్యాప్తు చేసే పనిలో పడ్డారు.

దాడి జరిగిన సమయంలో విశాల్ ఇంట్లో లేరు. షూటింగ్ నిమిత్తం వేరే ప్రాంతంలో ఉన్నారు. దాడి జరిగిన సంఘటన తెలిసిన తర్వాత విశాల్ తన కుటుంబ సభ్యులను దాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. విశాల్.. ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన నడిగర సంఘం జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఈయనంటే చిత్ర పరిశ్రమలో గిట్టని వారే ఈ దాడికి పాల్పడ్డారా.. లేక మరేదైనా కారణాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేసే పనిలో పడ్డారు.

ఇక దక్షిణ భారత నటీనటుల సంఘమైన నడిగర్ సంఘానికి మూడేళ్ల క్రితం 2019 జూలై 23న ఎన్నికలు నిర్వహించారు. ఒక ప్యానల్ నుంచి నాజర్ అధ్యక్షుడిగా, విశాల్ సెక్రటరీగా పోటీ చేశారు. ఇక మరో ప్యానల్ నుంచి భాగ్యరాజ్, సెక్రటరీగా గణేషన్ పోటీలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో హీరో విశాల్.. అక్రమాలకు పాల్పడినట్టు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు నడిగర్ సంఘం ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ నిలిపివేసింది. ఎలక్షన్ నిర్వహించిన బాక్సులను బ్యాంకు లాకర్‌లో భద్రపరిచారు. విశాల్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.

ఆ తర్వాత ఫిబ్రవరి 23న హైకోర్టు.. నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ సహా ఎవరు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని నిర్ధారించి ఈ పిటిషన్‌ను కొట్టేసారు. ఆ తర్వాత నాలుగు వారాల తర్వాత  రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో నడిగర్ సంఘానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు జరిగింది. ఆ తర్వాత ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. ఇక నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్ రెండోసారి విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా విశాల్, ట్రెజరర్‌గా కార్తీ (Karthi) విక్టరీ సాధించారు.

Ponniyin Selvan: బాహుబలి లెవల్లో మణిరత్నం ’పొన్నియన్ సెల్వన్’.. అభిమానులను ఆకట్టుకునే పాత్రలు ఇవే..

విశాల్ విషయానికొస్తే.. తమిళ చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో  హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విశాల్ (Vishal).  గతేడాది ‘చక్ర’ (Chakra) సినిమాతో పలకరించినా పెద్దగా అలరించలేకపోయారు. ఇక మిస్కిన్ దర్శకత్వంలో చేయాల్సిన ‘తుప్పారివాలన్’ (డిటెక్టివ్ 2)  సినిమా ఆగిపోయింది. దర్శకుడికి విశాల్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమా బాధ్యతలను విశాల్ టేకప్ చేశారు. త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేయనున్నారు. ఆ సంగతి పక్కన పెడితే. .. విశాల్ శరవణన్ అనే కొత్త దర్శకుడితో  ఓ సినిమా చేశారు.  తెలుగులో ఈ చిత్రానికి  ‘సామాన్యుడు’ అనే టైటిల్‌తో విడుదలైంది. తమిళంలో ‘వీరమే వాగై సూదమ్’ అనే టైటిల్‌తో  వచ్చింది.

Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Kollywood, Tollywood, Vishal

ఉత్తమ కథలు