Vishal As Saamanyudu : తమిళంతో పాటు తెలుగులో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో విశాల్ (Vishal). గతేడాది ‘చక్ర’ (Chakra) సినిమాతో పలకరించినా పెద్దగా అలరించలేకపోయారు. ఇక మిస్కిన్ దర్శకత్వంలో చేయాల్సిన ‘తుప్పారివాలన్’ (డిటెక్టివ్ 2) సినిమా ఆగిపోయింది. దర్శకుడికి విశాల్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమా బాధ్యతలను విశాల్ టేకప్ చేశారు. త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేయనున్నారు. ఆ సంగతి పక్కన పెడితే. .. విశాల్ శరవణన్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా సంగతి తెలిసిందే కదా. తెలుగులో ఈ చిత్రానికి ‘సామాన్యుడు’ అనే టైటిల్ ఖరారు చేసారు. తమిళంలో ‘వీరమే వాగై సూదమ్’ అనే టైటిల్ పెట్టారు. గతంలో జగపతి బాబు హీరోగా ‘సామాన్యుడు’ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు విశాల్ అదే సూపర్ హిట్ టైటిల్‌తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను హిందీ తప్ప మిగతా దక్షిణాది భాషల్లో విడుదల చేశారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తమిళ,తెలుగు, కన్నడ, మలయాళం ట్రైలర్స్‌ను విడుదల చేశారు. తెలుగులో సామాన్యుడుగా వస్తోన్న ఈ చిత్రం.. వివిధ భాషల్లో నేటివిటీకి తగ్గ టైటిల్స్‌తో రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్‌కు యూట్యూబ్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది.
Here’s the fierce and rageful trailer @VishalKOfficial’s #VeeramaeVaagaiSoodum & #Saamanyudu ?
?Tamil: https://t.co/jnUy8aXglc
? Telugu: https://t.co/IwJiWc5gk1#VeeramaeVaagaiSoodumTrailer #SaamanyuduTrailer #VVSTrailer#Vishal @Thupasaravanan1 @thisisysr @DimpleHayathi pic.twitter.com/z6qgfrxVmL
— Vishal Film Factory (@VffVishal) January 19, 2022
ఈ ట్రైలర్ చూస్తుంటే.. ఈ మూవీని విశాల్ తనకు కలిసొచ్చిన సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఒక నేరాన్ని కనిపెట్టడం కంటే.. దాన్ని ఏ యాంగిల్లో చేస్తున్నామన్నదే ముఖ్యమైన అర్హత అన్నారు. ఈ సినిమాలో విశాల్ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో విశాల్ సరసన డింపుల్ హయతి నటించింది. మొత్తంగా టైటిల్ సామాన్యుడు అంటూనే.. Not A Common Man ట్యాగ్ ఇచ్చారు. ఈ సినిమాను జనవరి 26న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
ఈ మూవీని విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే విశాల్ ఈ సినిమాకు సంబంధించి అన్ని కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమా విశాల్ నటించిన ఓల్డ్ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ అని చెబుతున్నారు. ఇప్పటికే ‘పందెం కోడి 2’ సీక్వెల్‌తో పలకరించినా.. ఇపుడు తుప్పారివాలన్ సీక్వెల్ ’తుప్పారివాలన్ 2’ మాత్రం ప్రస్తుతం ఆగిపోయింది. ఇపుడు చేయబోతున్న ‘సామాన్యుడు’ మూవీతో విశాల్ తాను కోరుకున్న సక్సెస్ అందుకుంటారా లేదా అనేది చూడాలి. ఈ చిత్రాన్ని హిందీ కాకుండా ఒకేసారి తమిళం, తెలుగు, కన్నడ, మలయాళంలో విడుదల చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kollywood, Saamanyudu Movie, Tollywood, Vishal