Home /News /movies /

VISHAL SAAMANYUDU MOVIE STREAMING ON ZEE5 OTT TODAY HERE ARE THE DETAILS TA

Vishal - Saamanyudu OTT Streaming : విశాల్ ‘సామాన్యుడు’ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ నేటి నుంచే.. ఏ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో అంటే..

నేటి నుంచే విశాల్ ‘సామాన్యుడు’ వరల్డ్ డిజిట్ ప్రీమియర్  (Twitter/Photo)

నేటి నుంచే విశాల్ ‘సామాన్యుడు’ వరల్డ్ డిజిట్ ప్రీమియర్ (Twitter/Photo)

Vishal As Saamanyudu : తమిళ చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో  హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విశాల్. ఇక ఈయన హీరోగా నటించిన ఈ మూవీ ఈ రోజు నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

    Vishal As Saamanyudu : తమిళ చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో  హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విశాల్ (Vishal).  గతేడాది ‘చక్ర’ (Chakra) సినిమాతో పలకరించినా పెద్దగా అలరించలేకపోయారు. ఇక మిస్కిన్ దర్శకత్వంలో చేయాల్సిన ‘తుప్పారివాలన్’ (డిటెక్టివ్ 2)  సినిమా ఆగిపోయింది. దర్శకుడికి విశాల్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమా బాధ్యతలను విశాల్ టేకప్ చేశారు. త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేయనున్నారు. ఆ సంగతి పక్కన పెడితే. .. విశాల్ శరవణన్ అనే కొత్త దర్శకుడితో  ఓ సినిమా చేశారు.  తెలుగులో ఈ చిత్రానికి  ‘సామాన్యుడు’ అనే టైటిల్‌తో విడుదలైంది. తమిళంలో ‘వీరమే వాగై సూదమ్’ అనే టైటిల్‌తో  వచ్చింది. గతంలో జగపతి బాబు హీరోగా ‘సామాన్యుడు’ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు విశాల్ అదే సూపర్ హిట్‌ టైటిల్‌తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు.

    తమిళంలో పాటు తెలుగులో పెద్దగా అలరించలేకపోయింది విశాల్ ‘సామాన్యుడు’ మూవీ. ఈ సినిమా  సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఒక నేరాన్ని కనిపెట్టడం కంటే.. దాన్ని ఏ యాంగిల్‌లో చేస్తున్నామన్నదే ముఖ్యమైన అర్హత అన్నారు. ఈ సినిమాలో విశాల్ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో విశాల్ సరసన డింపుల్ హయతి నటించింది. థియేటర్స్‌లో అంతగా అలరించని ఈ మూవీ నేటి నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.


    సామాన్యుడు టైటిల్  అంటూనే.. Not A Common Man ట్యాగ్ ఇచ్చారు. ముందుగా ఈ సినిమాను జనవరి 26న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఫిబ్రవరి 4న విడుదల చేసారు. ఈ సినిమా తెలుగు బిజినెస్ విషయానికొస్తే.. ఈ సినిమాను తెలంగాణ (నైజాం)లో రూ. 2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇక రాయలసీమ (సీడెడ్) రూ. 70 లక్షలు..ఇక ఏపీలో రూ. 2.4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా కలిపి ఈ సినిమా రూ. 5 కోట్ల 10 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కానీ ఆ రేంజ్‌లో మాత్రం వసూళ్లను రాబట్టలేకపోయింది. ఈ మూవీని విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పై నిర్మించారు. మొత్తంగా బిగ్ స్క్రీన్ పై అలరించని ఈ మూవీ.. స్మాల్ స్క్రీన్ పై ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

    Chiranjeevi Old Titles : ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సహా చిరంజీవి పాత టైటిల్స్‌తో తెరకెక్కిన సినిమాలు ఇవే..

    విశాల్ విషయానికొస్తే.. ‘అభిమన్యుడు’ తర్వాత ఇతని సినిమాలేవి తెలుగులో పెద్దగా వర్కౌట్ కాలేదు.  ఇప్పటికే ‘పందెం కోడి 2’ సీక్వెల్‌తో పలకరించినా.. ఇపుడు తుప్పారివాలన్ సీక్వెల్ ’తుప్పారివాలన్ 2’ మాత్రం ప్రస్తుతం ఆగిపోయింది. ఇపుడు  ‘సామాన్యుడు’ మూవీతో విశాల్‌కు పెద్ద షాకే ఇచ్చిందనే చెప్పాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Tollywood, Vishal, Zee5

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు