హోమ్ /వార్తలు /సినిమా /

Vishal Marriage: తన పెళ్లి ఎపుడనే విషయమై స్పందించిన విశాల్..

Vishal Marriage: తన పెళ్లి ఎపుడనే విషయమై స్పందించిన విశాల్..

తమిళ ఇండస్ట్రీలో సినిమాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ వార్తల్లోనే ఉండే హీరో విశాల్. ఈ తెలుగబ్బాయిపై ఎప్పుడూ ఏదో ఓ వార్త వార్తల్లో ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా ఈయనపై ఓ అసిస్టెంట్ డైరెక్టర్ సంచలన ఆరోపణలు చేసాడు.

తమిళ ఇండస్ట్రీలో సినిమాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ వార్తల్లోనే ఉండే హీరో విశాల్. ఈ తెలుగబ్బాయిపై ఎప్పుడూ ఏదో ఓ వార్త వార్తల్లో ఉంటూనే ఉంటుంది. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుంది. తాజాగా ఈయనపై ఓ అసిస్టెంట్ డైరెక్టర్ సంచలన ఆరోపణలు చేసాడు.

Vishal Marriage:  తన పెళ్లి ఎపుడనే విషయమై స్పందించిన తమిళ స్టార్ హీరో విశాల్ స్పందించారు. వివారల్లోకి వెళితే..

  Vishal Marriage:  తన పెళ్లి ఎపుడనే విషయమై స్పందించిన తమిళ స్టార్ హీరో విశాల్ స్పందించారు. వివారల్లోకి వెళితే..  43 ఏళ్ల విశాల్ తెలుగమ్మాయి అనీషా రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు. కొన్ని నెలల స్నేహంతోనే ఆమెను పూర్తిగా అర్థం చేసుకుని పెళ్లి వరకు విషయాన్ని తీసుకెళ్లాడు. విశాల్ ఎంగేజ్మెంట్ తర్వాత అభిమానులు పండగ చేసుకున్నారు. ఎట్టకేలకు మా హీరో పెళ్లి చేసుకుంటున్నాడంటూ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ తమిళ హీరో పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఈ ఇద్దరి పెళ్లి 2019లోనే జరుగుతుందని అనౌన్స్ చేసారు. కానీ అది కుదర్లేదు.. ఆ తర్వాత ఈ పెళ్లి గురించి అసలు టాపిక్ కూడా రాలేదు. ఆ తర్వాత వీరి పెళ్లి ఆగిపోయింది. రీసెంట్‌గా విశాల్.. చక్ర సినిమాతో పలకరించాడు. పూర్తి ‘అభిమన్యుడు’ తరహాలో పూర్తి టెక్నాలజీ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. త్వరలో విశాల్.. తన డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నాడు. తాజాగా  ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశాల్ తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు తన పర్సనల్ విషయాలను పంచుకున్నాడు. అంతేకాదు తన పెళ్లి గురించి మనసులో మాట బయట పెట్టాడు. త్వరలోనే తన పెళ్లికి సంబంధించిన వార్తను ఈ యేడాదిలోనే వినవచ్చని చెప్పాడు.

  ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ.. నేను అనుకోకుండా హీరో అయ్యాను. గత 16 యేళ్లుగా హీరోగా కెరీర్ కొనసాగిస్తున్నాను. ఆ తర్వాత నిర్మాతగా మారాను. ఇపుడు దర్శకుడిని అయ్యాను. నా జీవితంలో ఏది ముందుగా ఏది ప్లాన్ చేసుకోని చేయలేదంటూ చెప్పుకొచ్చాడు. సమయం వచ్చినపుడు అన్ని ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోతూ ఉంటాయి. నా పెళ్లి కూడా అలానే జరగొచ్చు అంటూ చెప్పుకొచ్చాడు. మొత్తంగా విశాల్.. తన పెళ్లి విషయమై ఓ నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తోంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Kollywood, Tollywood, Vishal

  ఉత్తమ కథలు