VISHAL REDDY MARRAIGE STILL ON CARDS AND HIS FIANCE ANISHA REDDY SAYS BIRTHDAY WISHES PK
విశాల్ పెళ్లిపై తొలగిన అనుమానాలు.. క్లారిటీ ఇచ్చిన కాబోయే భార్య..
విశాల్, అనిశా Photo: Twitter
విశాల్ పెళ్ళి ఆగిపోయింది.. ఆయన నిశ్చితార్థం రద్దు అయిపోయింది.. మళ్లీ ఇప్పుడు విశాల్ సింగిల్ అయిపోయాడు అంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి.
విశాల్ పెళ్ళి ఆగిపోయింది.. ఆయన నిశ్చితార్థం రద్దు అయిపోయింది.. మళ్లీ ఇప్పుడు విశాల్ సింగిల్ అయిపోయాడు అంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి. హైదరాబాద్ బిజినెస్ మ్యాన్ కుమారై అయిన అనీశా రెడ్డితో హీరో విశాల్ నిశ్చితార్ధం ఘనంగా జరిగింది. ఈమెను ఓ సినిమా షూటింగ్ కోసం విజయవాడ వచ్చినపుడు కలిసాడు విశాల్. ఒకటి రెండు సార్లే కలిసినా కూడా ఎందుకో తెలియదు కానీ అనీషాలో ఏదో తెలియని మాయ ఉందని.. అదే తనను ప్రేమలో పడేసిందని చెప్పాడు విశాల్. ఇదే పరిచయం ప్రేమగా మారి.. పెళ్లి వరకు వచ్చింది.
కాబోయే భార్య అనీషాతో విశాల్ (ఇన్స్టాగ్రామ్ ఫోటో)
ఈ మధ్య ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అక్టోబర్‌లో పెళ్ళికి ముహూర్తం పెట్టినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఉన్నట్లుండి ఈ ఇద్దరి పెళ్లి ఆగిపోయిందంటూ వార్తలు వచ్చాయి. దానికితోడు అనీషా కూడా తమ నిశ్చితార్థం ఫోటోలని పర్సనల్ ఎకౌంట్ నుండి డిలీట్ చేయడంతో నిజమే అని అంతా ఫిక్సైపోయారు. విశాల్ ఈ విషయంపై మాట్లాడకుండా సినిమాలు చేసుకోవడంతో నిజంగానే పెళ్లి ఆగిపోయిందంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు క్లారిటీ వచ్చింది.
కాబోయే భార్య అనీషాతో విశాల్ (ఇన్స్టాగ్రామ్ ఫోటో)
విశాల్ బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 29న తనకి కాబోయే భర్తకు శుభాకాంక్షలు చెప్పింది అనీషా. నువ్వు స్టార్‌గా మెరవడానికి పుట్టావు.. జీవితంలోకి మంచి రోజులు రానున్నాయి.. ఆ నమ్మకం నాకుంది.. నిన్ను ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటానంటూ రాసుకొచ్చింది అనీశా రెడ్డి. ఈ పోస్ట్ చూసిన తర్వాత కూడా విశాల్ పెళ్లి ఆగిపోయింది అనుకుంటే అంతకంటే తెలివి తక్కువ వ్యవహారం మరోటి ఉండదేమో..? మొత్తానికి త్వరలోనే విశాల్ ఇంటివాడు కాబోతున్నాడనేది మాత్రం నిజమే.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.