Home /News /movies /

VISHAL PANEL WIN MAXIMUM SEATS IN TAMIL FILM INDUSTRY NADIGAR SANGAM ELECTIONS TA

Vishal : నడిగర్ సంఘం ఎన్నికల్లో సత్తా చాటిన విశాల్ ప్యానల్.. తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగోడు సత్తా..

నగిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ ప్యానల్ విజయం (File/Photo)

నగిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ ప్యానల్ విజయం (File/Photo)

Vishal : దక్షిణ భారత నటీనటుల సంఘం (Nadighar Sangham) ఇపుడు తమిళ సినీ నటీనటుల సంఘం అయింది. ఎపుడో 20196లో ఈ సంఘం ఎన్నికల ఫలితాలను ఈ ఆదివారం ప్రకటించారు.

    Vishal : దక్షిణ భారత నటీనటుల సంఘం (Nadighar Sangham) ఇపుడు తమిళ సినీ నటీనటుల సంఘం అయింది. ఒకపుడు ఈ సంఘంలో సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన తెలుగు, కన్నడ, తమిళం, మలయాళానికి చెందిన నటీనటులు సభ్యులుగా ఉన్నారు. ఆ తర్వాత ఆయా భాషలకు చెందిన నటీనటులు తమకంటూ సొంతంగా అసోసియేషన్స్‌ను ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ఇక దక్షిణ భారత నటీనటుల సంఘమైన నడిగర్ సంఘానికి మూడేళ్ల క్రితం 2019 జూలై 23న ఎన్నికలు నిర్వహించారు. ఒక ప్యానల్ నుంచి నాజర్ అధ్యక్షుడిగా, విశాల్ సెక్రటరీగా పోటీ చేశారు. ఇక మరో ప్యానల్ నుంచి భాగ్యరాజ్, సెక్రటరీగా గణేషన్ పోటీలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో హీరో విశాల్.. అక్రమాలకు పాల్పడినట్టు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు నడిగర్ సంఘం ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ నిలిపివేసింది. ఎలక్షన్ నిర్వహించిన బాక్సులను బ్యాంకు లాకర్‌లో భద్రపరిచారు.

    ఆ తర్వాత ఫిబ్రవరి 23న హైకోర్టు.. నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్ సహా ఎవరు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని నిర్ధారించి ఈ పిటిషన్‌ను కొట్టేసారు. ఆ తర్వాత నాలుగు వారాల తర్వాత  రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో నడిగర్ సంఘానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు జరిగింది. దీంతో ఆదివారమే ఎన్నికల ఫలితాలను వెల్లడించారు. ఇక నడిగర్ సంఘం అధ్యక్షుడిగా నాజర్ రెండోసారి విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా విశాల్, ట్రెజరర్‌గా కార్తీ (Karthi) విక్టరీ సాధించారు.

    Balakrishna - Mahesh Babu : బాలకృష్ణను ఆ విధంగా ఫుల్లుగా వాడుకున్న మహేష్ బాబు..


    విశాల్ విషయానికొస్తే.. తమిళ చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో  హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విశాల్ (Vishal).  గతేడాది ‘చక్ర’ (Chakra) సినిమాతో పలకరించినా పెద్దగా అలరించలేకపోయారు. ఇక మిస్కిన్ దర్శకత్వంలో చేయాల్సిన ‘తుప్పారివాలన్’ (డిటెక్టివ్ 2)  సినిమా ఆగిపోయింది. దర్శకుడికి విశాల్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమా బాధ్యతలను విశాల్ టేకప్ చేశారు. త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేయనున్నారు. ఆ సంగతి పక్కన పెడితే. .. విశాల్ శరవణన్ అనే కొత్త దర్శకుడితో  ఓ సినిమా చేశారు.  తెలుగులో ఈ చిత్రానికి  ‘సామాన్యుడు’ అనే టైటిల్‌తో విడుదలైంది. తమిళంలో ‘వీరమే వాగై సూదమ్’ అనే టైటిల్‌తో  వచ్చింది.

    The Kashmir Files : ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ మరో సెన్సేషనల్ రికార్డ్.. ట్రేడ్ సైతం ఆశ్చర్యపోయేలా కలెక్షన్స్..


    తెలుగులో ఈ చిత్రానికి  ‘సామాన్యుడు’ అనే టైటిల్‌తో విడుదలైంది. తమిళంలో ‘వీరమే వాగై సూదమ్’ అనే టైటిల్‌తో  వచ్చింది. గతంలో జగపతి బాబు (Jagapati Babu) హీరోగా ‘సామాన్యుడు’ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు విశాల్ అదే సూపర్ హిట్‌ టైటిల్‌తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.అక్కడ ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Kollywood, Nadighar Sangham, Vishal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు