Home /News /movies /

VISHAL MADRAS HIGH COURT SHOCK TO VISHAL DUE TO LYCA PRODUCTIONS TA

Vishal : హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు షాక్.. ఇంతకీ ఏం జరిగిందంటే..

విశాల్‌కు మద్రాస్ హైకోర్టు షాక్ (Twitter/Photo)

విశాల్‌కు మద్రాస్ హైకోర్టు షాక్ (Twitter/Photo)

Vishal As Saamanyudu : తమిళ చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో  హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విశాల్. తాజాగా ఈయనకు మద్రాస్ హైకోర్టు పెద్ద షాక్ ఇచ్చింది.

  Vishal As Saamanyudu : తమిళ చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో  హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విశాల్ (Vishal).  అభిమన్యుడు, డిటెక్టివ్ మూవీస్ తర్వాత విశాల్‌కు సరైన సక్సెస్ రాలేదనే చెప్పాలి. ఈ కోవలో హీరో విశాల్‌కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. విశాల్ లైకా ప్రొడక్షన్స్ నుంచి ‘వీరమే వాగై సుడుం’ మూవీ కోసం అప్పుగా రూ. 21.29 కోట్లు తీసుకున్నారు. అంతేకాదు లైకా సంస్థకు అప్పు తీర్చకుండానే విశాల్.. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్, శాటిలైట్ రైట్స్ అమ్మడానికి రెడీ అయ్యారని లైకా ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. తమ అప్పు తీర్చేంత వరకు ఆ సినిమాకు సంబంధించిన అన్ని థియేట్రికల్, నాన్ థియోట్రికల్ హక్కులు అమ్మకుండా స్టే విధించాలని కోర్టును విధించింది.

  ఇక కోర్టు కూడా విశాల్‌కు హైకోర్టు రిజిస్ట్రార్ పేరున రూ. 15 కోట్లు మూడు వారాల్లో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. మరి దీనిపై విశాల్ పై కోర్టుకు అప్పీల్‌కు వెళతారా లేదా అనేది చూడాలి. గతంలో కూడా 2019లో  తమన్నాతో కలిసి ‘యాక్షన్’ టైటిల్‌తో ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే కదా. సి.సుందర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ అయింది. ముందుగా దర్శకుడు సుందర్, విశాల్.. ఈ సినిమాను తక్కువ బడ్జెట్‌లో తెరకెక్కిస్తున్నాని మాట ఇచ్చారు. తీరా సెట్స్ పైకి వెళ్లేసరికి  బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. ఒకవేళ సినిమా రిలీజ్ తర్వాత బడ్జెట్ వెనక్కి తిరిగి రాకపోతే..  ఆ నష్టాన్ని తానే భరిస్తానని నిర్మాతలకు హామి పత్రం కూడా ఇచ్చాడట విశాల్. మొత్తంగా ప్రచార ఖర్చులు అవి అన్ని కలిపి ఈ సినిమాకు రూ. 44 కోట్లు ఖర్చు అయిందట.

  Radhe Shyam : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సహా ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాలు..

  తీరా ‘యాక్షన్’ సినిమా విడుదలైన బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం తెలుగులోనే కాదు.. తమిళంలో కూడా సరైన విజయాన్ని నమోదు చేయలేకపోయింది. దీంతో నిర్మాతలు ఈ సినిమాకు వచ్చిన లాస్ గురించి విశాల్ దగ్గర ప్రస్తావించారు. అయితే.. విశాల్ మాత్రం ఆ నిర్మాతల బ్యానర్‌ ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్‌లో  చేస్తానని మాట ఇచ్చాడు. తీరా విశాల్ తాను నటిస్తోన్న కొత్త చిత్రాన్ని ట్రైడెంట్ బ్యానర్‌లో కాకుండా..  తన ఓన్ ప్రొడక్షన్ హౌస్‌లో చేయడంతో నిర్మాతలు ఈ విషయమై విశాల్‌ను నిలదీసారు. ఇక  విశాల్.. సినిమా నిర్మాణ విషయమై సెలెంట్‌గా ఉండడంతో    ‘యాక్షన్’ చిత్ర నిర్మాతలు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.  దీంతో కోర్టు విచారణ జరిపి.. యాక్షన్ సినిమా వల్ల నష్టపోయిన నిర్మాతలకు విశాల్ నష్టపరిహారం చెల్లించాలని తీర్పు నిచ్చింది. అంతేకాదు యాక్షన్ సినిమా నిర్మాతలకు రూ. 8.29 కోట్ల నష్టాన్ని భర్తీ చేసేలా వెంటనే  విశాల్ బ్యాండ్ గ్యారంటీ ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. మొత్తంగా విశాల్‌కు ఓ వైపు సినిమా షూటింగ్స్‌లో గాయపడుతూ ఒళ్లు హూనం చేసుకుంటున్నారు. మధ్యలో కోర్డు గొడవలతో విశాల్‌కు కంటి మీద కునుకు లేకుండా పోతుంది.

  Roja - Vijayashanti - Sai Pallavi: ఆ తరంలో విజయశాంతి.. ఆ తర్వాత రోజా.. ఈ జనరేషన్‌లో సాయి పల్లవి..

  విశాల్ సినిమాల విషయానికొస్తే.. గతేడాది  ‘చక్ర’ (Chakra) సినిమాతో పలకరించినా పెద్దగా అలరించలేకపోయారు. ఇక మిస్కిన్ దర్శకత్వంలో చేయాల్సిన ‘తుప్పారివాలన్’ (డిటెక్టివ్ 2)  సినిమా ఆగిపోయింది. దర్శకుడికి విశాల్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమా బాధ్యతలను విశాల్ టేకప్ చేశారు. త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేయనున్నారు. ఆ సంగతి పక్కన పెడితే. .. విశాల్ శరవణన్ అనే కొత్త దర్శకుడితో  ఓ సినిమా చేశారు.  తెలుగులో ఈ చిత్రానికి  ‘సామాన్యుడు’ అనే టైటిల్‌తో విడుదలైంది. తమిళంలో ‘వీరమే వాగై సూదమ్’ అనే టైటిల్‌తో  వచ్చింది. గతంలో జగపతి బాబు హీరోగా ‘సామాన్యుడు’ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు విశాల్ అదే సూపర్ హిట్‌ టైటిల్‌తో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది.
  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Kollywood, Madras high court, Vishal

  తదుపరి వార్తలు