హోమ్ /వార్తలు /సినిమా /

Vishal: షూటింగ్ స్పాట్‌లో మరోసారి తీవ్రంగా గాయపడ్డ హీరో విశాల్.. వీడియో వైరల్..

Vishal: షూటింగ్ స్పాట్‌లో మరోసారి తీవ్రంగా గాయపడ్డ హీరో విశాల్.. వీడియో వైరల్..

హీరో విశాల్ (Twitter/Photo)

హీరో విశాల్ (Twitter/Photo)

Vishal: షూటింగ్ స్పాట్‌లో మరోసారి తీవ్రంగా గాయపడ్డ హీరో విశాల్.. వివరాల్లోకి వెళితే..

    Vishal: షూటింగ్ స్పాట్‌లో మరోసారి తీవ్రంగా గాయపడ్డ హీరో విశాల్.. వివరాల్లోకి వెళితే.. విశాల్ ప్రస్తుతం ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ అనే సినిమా చేస్తున్నారు. శరవణనన్ దర్శకుడు. హీరోగా విశాల్‌కు 31వ సినిమా. ఈ సినిమాకు సంబంధించి క్లైమాక్స్ చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా విశాల్‌తో పాటు పలువురు నటీనటులపై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా విశాల్ ఫైట్ సీన్ చేస్తుండగా బలంగా గోడను ఢీకొని కింద పడిపోయారు. ఆకస్మాత్తుగా జరిగిన పరిణామానికి చిత్ర యూనిట్ ఉలిక్కిపడింది. ఈ ప్రమాదంలో విశాల్.. వెన్నుపూసకు భారీగా దెబ్బ తగిలింది. దీంతో డాక్టర్లు విశాల్‌కు ట్రీట్మెంట్ అందించారు. తాజాగా విశాల్ ఫైటింగ్ సీన్‌కు సంబంధించిన వీడియో నెటింట్ వైరల్ అవుతోంది. గతంలో ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ షూటింగ్ విశాల్ తీవ్రంగా గాయపడ్డారు. అపుడు ఫైట్ సీన్ తీస్తున్న సందర్భంలో సరైన కో ఆర్ఢినేషన్ లేక విజయ్ తలకు, కంటికి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే కదా. యాక్షన్ ఎంటర్టైనర్‌గా రానున్న ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించేలా ఉంటాయని టాక్.

    ఈ సినిమాలో విశాల్ సరసన డింపుల్ హయతి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను కేవలం రెండు నెలల్లో పూర్తి చేసి ఆగష్టులో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఇప్పటికే విశాల్ ఈ సినిమాకు సంబంధించి అన్ని కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమా విశాల్ నటించిన ఓల్డ్ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ అని చెబుతున్నారు. ఇప్పటికే ‘పందెం కోడి 2’ సీక్వెల్‌తో విశాల్ పలకరించారు. ఇపుడు తుప్పారివాలన్ సీక్వెల్ తుప్పారివాలన్ 2 మాత్రం ప్రస్తుతం ఆగిపోయింది. ఇపుడు చేయబోతున్న ఈ సూపర్ హిట్ సీక్వెల్‌తో విశాల్ విశాల్ తాను కోరుకున్న సక్సెస్ అందుకుంటారా లేదా అనేది చూడాలి.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Kollywood, Tollywood, Vishal