హోమ్ /వార్తలు /సినిమా /

Vishal: వర్సటైల్ యాక్టర్ విశాల్ బర్త్ డే సందర్బంగా ‘మార్క్ ఆంటోని’ ఫస్ట్ లుక్ రిలీజ్..

Vishal: వర్సటైల్ యాక్టర్ విశాల్ బర్త్ డే సందర్బంగా ‘మార్క్ ఆంటోని’ ఫస్ట్ లుక్ రిలీజ్..

విశాల్ ‘మార్క్ ఆంటోని’ ఫస్ట్ లుక్ విడుదల (Twitter/Photo)

విశాల్ ‘మార్క్ ఆంటోని’ ఫస్ట్ లుక్ విడుదల (Twitter/Photo)

Vishal - Mark Antony | వర్సటైల్ యాక్టర్ విశాల్ హీరోగా సరికొత్త గెటప్ లో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న 33వ చిత్రం "మార్క్ ఆంటోనీ"(Mark Antony). ఈ రోజు విశాల్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  Vishal - Mark Antony | వర్సటైల్ యాక్టర్ విశాల్ హీరోగా సరికొత్త గెటప్ లో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న 33వ చిత్రం "మార్క్ ఆంటోనీ"(Mark Antony). మినీ స్టూడియోస్ పతాకంపై రీతు వర్మ , సునీల్ వర్మ , అభినయ , YGee మహేంద్రన్ , నిజగల్ రవి , కింగ్స్లీ నటీ నటులుగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్ వినోద్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది. దర్శకుడు ఎస్ జే సూర్య ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్యాన్ ఇండియా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వర్సటైల్ యాక్టర్ విశాల్ బర్త్ డే సందర్బంగా "మార్క్ ఆంటోని" ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు మూవీ మేకర్స్.

  "మార్క్ ఆంటోనీ" ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే హీరో విశాల్ చాలా రౌద్రంగా షాట్ గన్ పట్టుకుని యుద్ధరంగంలో షూట్ చేస్తున్నటువంటి సరికొత్త గెటప్ లో పవర్ ఫుల్ పాత్రలో ఉన్నట్టు కనిపిస్తోంది.

  తమిళ చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో  హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు విశాల్ (Vishal).  గతేడాది ‘చక్ర’ (Chakra) సినిమాతో పలకరించినా పెద్దగా అలరించలేకపోయారు. ఇక మిస్కిన్ దర్శకత్వంలో చేయాల్సిన ‘తుప్పారివాలన్’ (డిటెక్టివ్ 2)  సినిమా ఆగిపోయింది. దర్శకుడికి విశాల్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమా బాధ్యతలను విశాల్ టేకప్ చేశారు. త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేయనున్నారు. ఆ సంగతి పక్కన పెడితే. .. విశాల్ శరవణన్ అనే కొత్త దర్శకుడితో  ఓ సినిమా చేశారు.  తెలుగులో ఈ చిత్రానికి  ‘సామాన్యుడు’ అనే టైటిల్‌తో విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తమిళంలో ‘వీరమే వాగై సూదమ్’ అనే టైటిల్‌తో  వచ్చింది.

  Nagarjuna Remakes: విక్రమ్ టూ వైల్డ్ డాగ్ వరకు నాగార్జున తన కెరీర్‌లో రీమేక్ చేసిన సినిమాలు ఇవే..


  తారాగణం:

  విశాల్ , ఎస్. జె.సూర్య , రీతు వర్మ , సునీల్ వర్మ , అభినయ , YGee మహేంద్రన్ , నిజగల్ రవి , కింగ్స్లీ.

  సాంకేతిక నిపుణులు

  బ్యానర్ : మినీ స్టూడియోస్

  నిర్మాతలు : ఎస్ వినోద్ కుమార్ -మినీ స్టూడియోస్ రచయిత & దర్శకుడు - అధిక్ రవిచంద్రన్

  సంగీతం - జివి ప్రకాష్ కుమార్

  డి ఓ పి - అభినందన్ రామానుజం

  ఆర్ట్ డైరెక్టర్ -ఆర్ విజయ్ మురుగన్

  ఎడిటర్ - విజయ్ వేలుకుట్టి

  యాక్షన్ డైరెక్టర్స్ - దిలీప్ సుబ్బరాయన్, పీటర్ హెయిన్, కనల్ కన్నన్, రవివర్మ

  కాస్ట్యూమ్ డిజైనర్-సత్య NJ

  కొరియోగ్రాఫర్లు - దినేష్, బాబా బాస్కర్, అజహర్

  గీత రచయితలు- మధుర కవి, అసల్ కొలారు, అధిక్ రవిచంద్రన్

  పబ్లిసిటీ డిజైన్స్ -కబిలన్

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Chiranjeevi, Kollywood, Tollywood, Vishal

  ఉత్తమ కథలు