43 ఏళ్ల విశాల్ గతేడాది తెలుగమ్మాయి అనీషా రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆర్నెళ్ల స్నేహంతోనే ఆమెను పూర్తిగా అర్థం చేసుకుని పెళ్లి వరకు విషయాన్ని తీసుకెళ్లాడు. విశాల్ ఎంగేజ్మెంట్ తర్వాత అభిమానులు పండగ చేసుకున్నారు. ఎట్టకేలకు మా హీరో పెళ్లి చేసుకుంటున్నాడంటూ ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. అయితే ఇప్పుడు ఈ తమిళ హీరో పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. చాలా రోజులుగా దీనిపై వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఎప్పట్నుంచో వినిపిస్తున్నట్లుగానే విశాల్ పెళ్లి ఆగిపోయింది. ఈయన నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి మరొకర్ని పెళ్లి చేసుకుందని ప్రచారం జరుగుతుంది. ‘అర్జున్ రెడ్డి’, ‘పెళ్లిచూపులు’ లాంటి సినిమాలలో ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో నటించిన తెలుగమ్మాయి అనీశా రెడ్డితో గతేడాది విశాల్ నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ ఇద్దరి పెళ్లి 2019లోనే జరుగుతుందని అనౌన్స్ చేసారు. కానీ అది కుదర్లేదు.. ఆ తర్వాత ఈ పెళ్లి గురించి అసలు టాపిక్ కూడా రాలేదు. ఇప్పుడు అప్పుడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న తరుణంలో ఇప్పుడు ఏకంగా పెళ్లి ఆగిపోయిందని కన్ఫర్మేషన్ వచ్చేసింది.
నిజానికి నిశ్చితార్థం జరిగిన కొన్ని రోజులకే తన సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి ఫోటోలు అన్నీ డిలీట్ చేసింది అనీషా రెడ్డి. ఇది జరిగిన కొన్ని రోజులకే ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోయారని తెలుస్తుంది. మరోవైపు విశాల్ వరస సినిమాలతో బిజీ అయిపోయాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది. విశాల్‌తో నిశ్చితార్థం చేసుకున్న అనీషాకు ఇప్పుడు మరొకరితో పెళ్లి జరిగిందని వార్తలు వస్తున్నాయి.
హైదరాబాద్ బిజినెస్ మ్యాన్‌ను ఈమె పెళ్లి చేసుకుందని తెలుస్తుంది. ఈ విషయం కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు. ఏదేమైనా కూడా విశాల్‌తో ఎంగేజ్‌మెంట్ జరిగిన తర్వాత మరొకరితో పెళ్లి అని తెలిసి షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. దీనిపై ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు క్లారిటీ ఇస్తారా లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hero vishal, Telugu Cinema, Tollywood