Home /News /movies /

VISHAL CHAKRA MOVIE TRAILER RELEASED AND IT SEEMS TO BE ABHIMANYUDU SEQUEL PK

విశాల్ ‘చక్ర’ ట్రైలర్.. ‘అభిమన్యుడు’ పార్ట్ 2 చూసినట్లుందిగా..

విశాల్ చక్ర ఫస్ట్ గ్లింప్స్ విడుదల (Twitter/Photo)

విశాల్ చక్ర ఫస్ట్ గ్లింప్స్ విడుదల (Twitter/Photo)

Vishal Chakra movie trailer: ఒకప్పుడు విశాల్ సినిమా అంటే కేరాఫ్ మాస్ అంతే. రొటీన్ కథలతో సినిమాలు చేసాడు. అయితే కొన్నేళ్ళుగా విశాల్ ఎంచుకుంటున్న కథల్లో చాలా వైవిధ్యం కనిపిస్తుంది.

ఒకప్పుడు విశాల్ సినిమా అంటే కేరాఫ్ మాస్ అంతే. రొటీన్ కథలతో సినిమాలు చేసాడు. అయితే కొన్నేళ్ళుగా విశాల్ ఎంచుకుంటున్న కథల్లో చాలా వైవిధ్యం కనిపిస్తుంది. పైగా తానే నిర్మాతగా ఉండటం వల్ల కొత్త తరహా కథలను కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు ఈ హీరో. ఇప్పుడు కూడా ఇలాంటి కథతోనే వస్తున్నాడు. ప్రపంచాన్ని వణికిస్తున్న డిజిటల్ క్రైమ్స్ ఆధారంగా చక్ర సినిమా చేస్తున్నాడు విశాల్. ఎంఎస్ ఆనందన్ ఈ చిత్రానికి దర్శకుడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఒకేసారి మూడు భాషల్లో ఈ ట్రైలర్ విడుదల చేసాడు విశాల్. తెలుగుతో పాటు తమిళ, కన్నడల్లో కూడా ఈ సినిమా విడుదల కాబోతుంది.
తమిళ హీరో విశాల్ ఫైల్ ఫోటో (Vishal)
తమిళ హీరో విశాల్ ఫైల్ ఫోటో (Vishal)

సౌత్ అన్ని భాషల్లోనూ చక్ర కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్ముతున్నాడు ఈయన. శ్రద్ధా శ్రీనాథ్, రెజీనా కసాండ్రా ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు విడుదలైన ట్రైలర్ చూస్తుంటే అభిమన్యుడు సినిమా గుర్తుకు రాక మానదు. అందులో కూడా పూర్తిగా డిజిటల్ క్రైమ్స్‌పైనే ఫోకస్ చేసాడు దర్శకుడు.

ఇప్పుడు చక్రలో కూడా ఇదే కనిపిస్తుంది. విలన్‌ను దాచేసి ఆయన చేసే క్రైమ్స్.. అతడిని పట్టుకోడానికి పోలీసులు వేసే ప్లాన్స్ మాత్రమే ట్రైలర్‌లో చూపించాడు దర్శకుడు ఆనందన్. ట్రైలర్ అయితే ఆసక్తికరంగానే అనిపిస్తుంది. తెలుగులో కూడా చక్రపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ చిత్రంతో విశాల్ ఏం మ్యాజిక్ చేస్తాడో చూడాలిక.
First published:

Tags: Hero vishal, Telugu Cinema, Tollywood

తదుపరి వార్తలు