తమిళంలో పాటు తెలుగులో మంచి మార్కెట్ ఉన్న విశాల్.. తాజాగా ‘చక్ర’ అనే సినిమాతో వస్తున్నాడు. ఎం.ఎస్.ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విశాల్ సరసన శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తోంది. రెజీనా మరో ముఖ్యపాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ఆఫ్ ట్రైలర్ను విడుదల చేసారు చిత్ర యూనిట్. ఈ గ్లింప్స్ కూడా ఆకట్టుకునే తరహాలో ఉంది. ‘చక్ర’ సినిమాను కూడా విశాల్ గతంలో నటించిన ‘అభిమన్యుడు’ సినిమా తరహాలో సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కించాడు. బ్యాంక్ రాబరీ, సైబర్ క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కించాడు. మొత్తంగా ఇప్పటి వరకు కథ, కథనాలతో ఈ చిత్రం తెరకెక్కింది. మరోసారి విశాల్.. ఈ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ సినిమాతోనైనా హీరోగా విశాల్.. మరో సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.