Home /News /movies /

VISHAL AS SAAMANYUDU VISHAL 31 MOVIE TITLE ANNOUNCED DUE TO HIS BIRTHDAY TA

Vishal As Saamanyudu : ’సామాన్యుడు’గా పలకరించనున్న విశాల్.. అదిరిన పుట్టినరోజు కానుక..

‘సమాన్యుడు’గా విశాల్ (Twitter/Photo)

‘సమాన్యుడు’గా విశాల్ (Twitter/Photo)

Vishal As Saamanyudu : తమిళంతో పాటు తెలుగులో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో విశాల్ (Vishal).  ఈ రోజు విశాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా విశాల్.. సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేసారు.

    Vishal As Saamanyudu : తమిళంతో పాటు తెలుగులో హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరో విశాల్ (Vishal).  ఈ యేడాది ‘చక్ర’ (Chakra) సినిమాలో పలకరించినా పెద్దగా అలరించలేకపోయారు. మరోవైపు విశాల్.. ఆర్య(Arya)తో కలిసి ‘ఎనిమి’ (Enemy) సినిమా చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌లో విశాల్ తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే కదా. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది.  ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. గతంలో వీళ్లిద్దరు ‘అవన్ ఇవన్’ (వాడు వీడు) సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత ఆర్య నటించిన ‘ఐశ్వర్యాభిరస్తు’ సినిమాలో విశాల్ అతిథి పాత్రలో మెరిసారు. తాజాగా వీళ్లిద్దరు ‘ఎనిమి’ సినిమాలో మరోసారి ఢీ అంటే ఢీ అనబోతున్నారు. ఆనంద్ శంకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌నుఒకేసారి తమిళం, తెలుగు, హిందీలో  విడుదల చేశారు. ఈ టీజర్ విశాల్ గత యాక్షన్ సినిమాల వలే ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా యాక్షన్ ఘట్టాలు విజువల్స్ అట్రాక్టివ్‌గా ఉన్నాయి.

    ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇక మిస్కిన్ దర్శకత్వంలో చేయాల్సిన ‘తుప్పారివాలన్’ (డిటెక్టివ్ 2)  సినిమా ఆగిపోయింది. దర్శకుడికి విశాల్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమా బాధ్యతలను విశాల్ టేకప్ చేశారు. త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేయనున్నారు.

    Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి, నాగబాబులకు ఆయన ఫేవరేట్ హీరో అట..


    ఆ సంగతి పక్కన పెడితే. .. విశాల్ శరవణన్ అనే కొత్త దర్శకుడితో 31వ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ రోజు విశాల్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్  ప్రకటించారు. ఈ సినిమాకు తెలుగులో ‘సామాన్యుడు’ అనే టైటిల్ ఖరారు చేసారు. తమిళంలో ‘వీరమే వాగై సూదమ్’ అనే టైటిల్ పెట్టారు.


    ఈ మూవీని విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పై నిర్మిస్తున్నారు. మొత్తంగా విశాల్ వరుస సినిమాలతో అభిమానులను పలకరించనున్నారు. ఇప్పటికే విశాల్ ఈ సినిమాకు సంబంధించి అన్ని  కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమా విశాల్ నటించిన ఓల్డ్ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ అని చెబుతున్నారు. ఇప్పటికే ‘పందెం కోడి 2’ సీక్వెల్‌తో పలకరించినా.. ఇపుడు తుప్పారివాలన్ సీక్వెల్ ’తుప్పారివాలన్ 2’ మాత్రం ప్రస్తుతం ఆగిపోయింది. ఇపుడు చేయబోతున్న ఈ సూపర్ హిట్ సీక్వెల్‌తో విశాల్ విశాల్ తాను కోరుకున్న సక్సెస్ అందుకుంటారా లేదా అనేది చూడాలి.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Kollywood, Saamanyudu Movie, Tollywood, Vishal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు