హోమ్ /వార్తలు /సినిమా /

Vishal - Arya - Enemy Trailer Talk: విశాల్, ఆర్యల ‘ఎనిమి’ ట్రైలర్ టాక్.. బరిలో ఉంటే శత్రువులు..

Vishal - Arya - Enemy Trailer Talk: విశాల్, ఆర్యల ‘ఎనిమి’ ట్రైలర్ టాక్.. బరిలో ఉంటే శత్రువులు..

విశాల్, ఆర్యల ‘ఎనిమి’ ట్రైలర్ విడుదల (Twitter/Photo)

విశాల్, ఆర్యల ‘ఎనిమి’ ట్రైలర్ విడుదల (Twitter/Photo)

Vishal - Arya - Enemy Trailer Talk: తమిళ స్టార్ హీరో విశాల్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఎనిమి’. ఈ సినిమాలో ఆర్య మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.

    Vishal - Arya - Enemy Trailer Talk: తమిళ స్టార్ హీరో విశాల్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఎనిమి’. ఈ సినిమాలో ఆర్య మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. గతంలో వీళ్లిద్దరు ‘అవన్ ఇవన్’ (వాడు వీడు) సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత ఆర్య నటించిన ‘ఐశ్వర్యాభిరస్తు’ సినిమాలో విశాల్ అతిథి పాత్రలో మెరిసారు. ఇపుడు మళ్లొసారి వీళ్లిద్దరు ‘ఎనిమి’ సినిమాలో మరోసారి ఢీ అంటే ఢీ అనబోతున్నారు. ఆనంద్ శంకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేసారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్‌ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ ఆద్యంతం యాక్షన్‌తో ఉండి ఆసక్తి రేకిస్తోంది. విశాల్, ఆర్యల ‘ఎనిమి’ సినిమాను  ఒకేసారి తమిళం, తెలుగు, హిందీలో  విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా యాక్షన్ ఘట్టాలు విజువల్స్ అట్రాక్టివ్‌గా ఉన్నాయి.

    ఈ సినిమా ట్రైలర్ విషయానికొస్తే.. చిన్నప్పటి నుంచి తన కుమారుడు పెద్దవాడు కావాలనే ఉద్దేశ్యంతో వాడి చదువుకు కావాల్సిన పుస్తకాలతో పాటు వచ్చే యేడాదికి కావాల్సిన పుస్తకాలను కొనిపెట్టేస్తాడు.  ఏ రోజు ఏ సమయంలో ఏది చదవాలనేది తండ్రి డిసైడ్ చేస్తారు. ఆ తర్వాత కట్ చేస్తే.. హీరో చిన్నపుడు ఊటీలో మాజీ పోలీస్ ఆఫీసర్ అయిన ప్రకాష్  రాజ్ దగ్గర పోలీస్ ట్రైయిన్ అవుతుంటాడు.

    అక్కడ హీరోతో పాటు మరో కథానాయికుడు ఆర్య కూడా ఉంటారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. వీడు పోలీస్ ట్రైయింగ్‌కు వస్తే తన కొడుకు కంటే బెటర్ పోలీస్ ఆఫీసర్ అవుతాడు. ఇక పోటీ అంటూ వచ్చాకా.. నీకు అతుడు శత్రువే. మిగతా సమయాల్లో బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు. ఇలా మిత్రుల్లా ఉండాల్సిన విశాల్, ఆర్యలు ఎందుకు శత్రువులుగా మారారనేది ఈ సినిమా స్టోరీ.

    Akshay Kumar OMG 2 : ఉజ్జయినిలో ప్రారంభమైన అక్షయ్ కుమార్ OMG 2 షూటింగ్..

    ఈ సినిమాలో మృణాళిని రవి, మమతా మోహన్ దాస్ హీరోయిన్స్‌గా నటించారు. మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ సినిమాకు సమర్ఫకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేస్తున్నట్టు ట్రైలర్‌లో చూపించారు. మొత్తంగా రజినీకాంత్ ‘పెద్దన్న’ మూవీతో విశాల్, ఆర్యల ‘ఎనిమి’ పోటీ పడుతున్నట్టు ప్రకటించారు.  ఇక ఈ సినిమా షూటింగ్‌లో ఆర్య గాయపడ్డారు. ఆ తర్వాత కోలుకొని కొన్ని యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేశారు. మరోవైపు విశాల్ కూడా ఈ సినిమా షూటింగ్‌లో గాయాలపాలైన సంగతి తెలిసిందే కదా.

    Chiranjeevi : చిరంజీవితో సాయి ధరమ్ తేజ్ వాళ్ల నాన్న నిర్మించిన ఈ సినిమా తెలుసా..


    ఇక విశాల్ మిస్కిన్ దర్శకత్వంలో చేయాల్సిన ‘తుప్పారివాలన్’ (డిటెక్టివ్ 2)  సినిమా ఆగిపోయింది.దర్శకుడికి విశాల్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమా బాధ్యతలను విశాల్ టేకప్ చేశారు. త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేయనున్నారు. తమిళంలో పాటు తెలుగులో మంచి మార్కెట్ ఉన్న విశాల్.. రీసెంట్‌గా ‘చక్ర’ అనే సినిమాతో పలకరించారు.

    HBD Rebel Star Prabhas : రెబల్ స్టార్‌ టూ ప్యాన్ ఇండియా స్టార్‌గా ఆకాశమే హద్దుగా ప్రభాస్ సినీ ప్రస్థానం..

    ఎం.ఎస్.ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విశాల్ సరసన శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించింది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.  మరోవైపు విశాల్ శరవణన్ అనే కొత్త డైరెక్టర్‌తో ఓ సినిమా చేస్తున్నారు.  తెలుగులో మూవీకి  ‘సామాన్యుడు’ అనే టైటిల్ ఖరారు చేసారు. తమిళంలో ‘వీరమే వాగై సూదమ్’ అనే టైటిల్ పెట్టారు.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Arya, Enemy Movie, Kollywood, Tollywood, Vishal

    ఉత్తమ కథలు