Home /News /movies /

VISHAL ARYA ENEMY TEASER TALK ANOTHER SUSPECE THRILLER FROM VISHAL TEAM TA

Vishal - Arya - Enemy Teaser Talk: విశాల్, ఆర్యల ‘ఎనిమి’ టీజర్ టాక్.. ఈ ప్రపంచలో ప్రమాదకర శత్రువు అతడేనా..

విశాల్, ఆర్యల ‘ఎనిమి’ టీజర్ టాక్ (Twitter/Photo)

విశాల్, ఆర్యల ‘ఎనిమి’ టీజర్ టాక్ (Twitter/Photo)

Vishal - Arya - Enemy Teaser Talk: హీరో విశాల్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఎనిమి’. ఈ సినిమాలో ఆర్య మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు.

    Vishal - Arya - Enemy Teaser Talk: హీరో విశాల్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘ఎనిమి’. ఈ సినిమాలో ఆర్య మరో కథానాయకుడిగా నటిస్తున్నారు. గతంలో వీళ్లిద్దరు ‘అవన్ ఇవన్’ (వాడు వీడు) సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత ఆర్య నటించిన ‘ఐశ్వర్యాభిరస్తు’ సినిమాలో విశాల్ అతిథి పాత్రలో మెరిసారు. తాజాగా వీళ్లిద్దరు ‘ఎనిమి’ సినిమాలో మరోసారి ఢీ అంటే ఢీ అనబోతున్నారు. ఆనంద్ శంకర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా టీజర్‌నుఒకేసారి తమిళం, తెలుగు, హిందీలో  విడుదల చేశారు. ఈ టీజర్ విశాల్ గత యాక్షన్ సినిమాల వలే ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా యాక్షన్ ఘట్టాలు విజువల్స్ అట్రాక్టివ్‌గా ఉన్నాయి.

    ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకర శత్రవు ఎవరో తెలుసా.. నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడు అంటూ ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో మృణాళిని రవి, మమతా మోహన్ దాస్ హీరోయిన్స్‌గా నటించారు. మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ సినిమాకు సమర్ఫకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో విడుదల చేస్తున్నట్టు టీజర్‌లో చూపెట్టారు. ఇక ఈ సినిమా షూటింగ్‌లో ఆర్య గాయపడ్డారు. ఆ తర్వాత కోలుకొని కొన్ని యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేశారు. మరోవైపు విశాల్ కూడా ఈ సినిమా షూటింగ్‌లో గాయాలపాలైన సంగతి తెలిసిందే కదా. 

    ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇక మిస్కిన్ దర్శకత్వంలో చేయాల్సిన ‘తుప్పారివాలన్’ (డిటెక్టివ్ 2)  సినిమా ఆగిపోయింది.దర్శకుడికి విశాల్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమా బాధ్యతలను విశాల్ టేకప్ చేశారు. త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేయనున్నారు. తమిళంలో పాటు తెలుగులో మంచి మార్కెట్ ఉన్న విశాల్.. రీసెంట్‌గా ‘చక్ర’ అనే సినిమాతో పలకరించారు ఎం.ఎస్.ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విశాల్ సరసన శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించింది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Arya, Enemy Movie, Kollywood, Tollywood, Vishal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు