తమిళ నటుడు విశాల్ పెళ్లి కుదరడంతో అభిమానులు గాల్లో తేలిపోతున్నారు. ఆయన పెళ్లి కోసం చాలా ఏళ్లుగా వేచి చూస్తున్న అభిమానులకు తీపికబురు చెప్పాడు విశాల్. తాజాగా ఈయన నిశ్చితార్థం ఎలాంటి సందడి లేకుండా హైదరాబాద్లోని ఓ స్టార్ హోటల్లో జరిగింది. పెద్దగా ఎవరూ సెలెబ్రెటీలు కానీ.. సినిమా వాళ్లు కానీ ఈ వేడుకకు రాలేదు. ఈ మధ్యే షూటింగ్లో యాక్సిడెంట్ తర్వాత కోలుకున్న విశాల్.. ఇప్పుడు తన ఎంగేజ్మెంట్ పనులతో బిజీ అయిపోయాడు. నిశ్చితార్థం ఇప్పుడు జరిగినా పెళ్లి మాత్రం ఆగస్ట్ లేదంటే సెప్టెంబర్లో జరగనుంది.
ఆ లోపు తాను చక్కబెట్టాల్సిన కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నాడు ఈ హీరో. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన అనీషా రెడ్డితో ఈయన ఏడడుగులు వేస్తున్నాడు. ఇదిలా ఉంటే దానికి ముందే నడిగర్ సంఘం బిల్డింగ్ పనులు పూర్తి చేయాలని ఫిక్సైపోయాడు ఈ హీరో. ఆ తర్వాతే పెళ్లి అంటున్నాడు విశాల్. ఇప్పటికే బిల్డింగ్ పనులు కూడా పూర్తి కానుండటంతో ఆనందంలో ఉన్నాడు ఈ హీరో.
పెళ్లికి ఇంకా నాలుగు నెలలు సమయం ఉండటంతో తమిళనాట రాజకీయాల్లోనూ తనను తాను సిద్ధం చేసుకుంటున్నాడు ఈ హీరో. పెళ్లికి ముందే అన్నీ సిద్ధం చేసుకుని.. ఆ తర్వాత కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాడు విశాల్. నిశ్చితార్థం సింపుల్ గానే జరిగినా కూడా.. విశాల్ పెళ్లి ఘనంగా చేయడానికి తల్లిదండ్రులు ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, తమిళ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ నుంచి కూడా ప్రముఖులు హాజరు కానున్నారు. మొత్తానికి విశాల్ నిశ్చితార్థం ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telugu Cinema, Tollywood, Vishal