Vishal 31: హీరో విశాల్ 31వ చిత్రం ఈ గురువారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. వివరాల్లోకి వెళితే.. తమిళంలో పాటు తెలుగులో మంచి మార్కెట్ ఉన్న విశాల్.. రీసెంట్గా ‘చక్ర’ అనే సినిమాతో పలకరించారు ఎం.ఎస్.ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విశాల్ సరసన శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించింది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం విశాల్.. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘ఎనిమి’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో మరో ’ఆర్య’ మరో కథానాయికగా నటించారు. ఈ సినిమా షూటింగ్లో ఆర్య గాయపడ్డారు. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇక మిస్కిన్ దర్శకత్వంలో చేయాల్సిన ‘తుప్పారివాలన్’ (డిటెక్టివ్ 2) సినిమా ఆగిపోయింది.
దర్శకుడికి విశాల్‌కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమా బాధ్యతలను విశాల్ టేకప్ చేశారు. త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేయనున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. విశాల్.. ఈ గురువారం తన 31వ సినిమాకు కొబ్బరికాయ కొట్టారు.
ఈ సినిమాతో షార్ట్ ఫిల్మ్స్ మేకర్‌గా గుర్తింపు పొందిన టి.పి.శర్వానన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో విశాల్ సరసన డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను కేవలం రెండు నెలల్లో పూర్తి చేసి ఆగష్టులో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఇప్పటికే విశాల్ ఈ సినిమాకు సంబంధించి అన్ని కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఈ సినిమా విశాల్ నటించిన ఓల్డ్ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ అని చెబుతున్నారు. ఇప్పటికే ‘పందెం కోడి 2’ సీక్వెల్‌తో పలకరించినా.. ఇపుడు తుప్పారివాలన్ సీక్వెల్ తుప్పారివాలన్ 2 మాత్రం ప్రస్తుతం ఆగిపోయింది. ఇపుడు చేయబోతున్న ఈ సూపర్ హిట్ సీక్వెల్‌తో విశాల్ విశాల్ తాను కోరుకున్న సక్సెస్ అందుకుంటారా లేదా అనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.