Sai Dharam Tej SDT: గతేడాది అనుకోని ప్రమాదానికి గురయ్యారు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ఆ ప్రమాదం నుంచి తేరుకోవడానికి దాదాపు యేడాది పట్టింది. దీంతో సాయి ధరమ్ తేజ్ మళ్లీ ముఖానికీ రంగేసుకుంటాడా అని అభిమానులు వెయిట్ చేశారు. వారి ఎదురుచూపులు ఫలించాయి. ఎట్టకేలకు సాయి ధరమ్ తేజ్ తన కొత్త చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. సాయి ధరమ్ తేజ్.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. తన పెద మేనమామ చిరు మాదిరి మొదటి సినిమా పూర్తైయిన విడుదల కాకుండానే రెండో సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. మెగా మేనల్లుడుగా పరిచమైన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే జయంత్ దర్శకత్వంలో ఓ సినిమాకు కొబ్బరికాయ కొట్టిన సాయి ధరమ్ తేజ్.. తాజాగా మరో సినిమాను అనౌన్స్ చేసాడు.
ఈ సినిమాకు ‘విరూపాక్ష’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాకు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అందించారు. అజ్ఞానం భయానికి మూలం. భయం మూఢ నమ్మకానికి కారణం. ఆ నమ్మకమే నిజమైనపుడు .. ఆ నిజం జ్ఞానానికి అంతు చిక్కనపుడు.. అసలు నిజం చూపించే జ్ఞాన నేత్రం.. హీరోగా తొలిసారి సాయి ధరమ్ చేస్తోన్న థ్రిల్లర్ చిత్రం. మొత్తంగా ఈ గ్లింప్స్‌తోనే ఆకట్టుకుంటుంది.
Here's the captivating #Virupaksha Title Glimpse in the Majestic voice of Man of Masses @tarak9999 ????
- https://t.co/KSSxzTjZIR#NTRforSDT @IamSaiDharamTej @iamsamyuktha_ @karthikdandu86 @AJANEESHB @Shamdatdop @aryasukku @BvsnP @bkrsatish @SVCCofficial @SukumarWritings pic.twitter.com/k0yPqBWAiY — BA Raju's Team (@baraju_SuperHit) December 7, 2022
సుకుమార్ రైటింగ్‌లో కార్తీక్ దండు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను బీవీయస్ ప్రసాద్ తెరకెక్కిస్తున్నాడు. హీరోగా సాయి ధరమ్ తేజ్‌కు 15వ సినిమా. ఈ సినిమాను వచ్చే యేడాది 21 ఏప్రిల్ 2023లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సాయి ధరమ్ తేజ్.. గతేడాది అనుకోకుండా హైదరాబాద్‌లో బైక్ నడుపుతూ ప్రమాదానికి గురయ్యారు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్. ఆ ప్రమాదం నుంచి తేరుకోవడానికి దాదాపు యేడాది పట్టింది. ఈయన ప్రచారం చేయకుండానే ఈయన నటించిన రిపబ్లిక్ మూవీ విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా కమర్షియల్‌గా మాత్రమ అంతగా సక్సెస్ కాలేదు.ఎట్టకేలకు సాయి ధరమ్ తేజ్ ఒకేసారి రెండు చిత్రాలకు ఒకే చేయడం ఆనందించదగ్గ పరిణామం.
సాయి దరమ్ తేజ్ యాక్ట్ చేస్తోన్న రెండు సినిమాలను శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై భోగవల్లి ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.మెగా హీరో సాయి ధరమ్ తేజ్... గతేడాది సెప్టెంబర్ 10న హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఈయన బైక్‌కు యాక్సిడెంట్ అయింది. రోడ్డుపై ఇసుక ఉండటంతో అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు సాయి ధరమ్ తేజ్. ఈ ప్రమాదంలో తీవ్రగాయాల పాలయ్యాడు సాయి. కొన్ని రోజులు కోమాలో ఉన్నాడు తేజ్. ఇంకా చెప్పాలంటే యాక్సిడెంట్ అయిన తొలి 10 రోజులు ఏం జరుగుతుందో.. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని కంగారు పడిపోయారు కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు. కానీ దేవుడి దయ వల్ల ఆయన బతికాడాని అభిమానులు చెప్పుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sai Dharam Tej, Tollywood