Sai Pallavi: అది నా అదృష్టం.. లైఫ్‌లో కూడా మరచిపోనంటున్న సాయి పల్లవి
Photo Twitter
Virataparvam Sai Pallavi: తాజాగా తాను వెన్నెల పాత్ర పోషించడం పట్ల మనసులో మాట బయటపెట్టింది సాయి పల్లవి. ఈ మేరకు చిత్రీకరణ సమయంలోని కొన్ని ఫొటోస్‌ని ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ విరాటపర్వం సినిమాలో వెన్నెల రోల్ పోషించడం తన అదృష్టమని చెప్పింది.
దగ్గుబాటి రానా ( Daggubati rana) హీరోగా రూపొందిన సినిమా 'విరాటపర్వం' (Virata Parvam). వేణు ఊడుగుల (Venu Udugula) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రానాతో నాచురల్ క్వీన్ సాయి పల్లవి (Sai Pallavi) తెరపంచుకుంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా వాయిదాల పర్వం కొనసాగింది. చివరకు జూన్ 17న (Virata Parvam Release Date) ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆశించిన మేర ఈ మూవీ సక్సెస్ సాధించినప్పటికీ ఓ వర్గం ఆడియన్స్ మాత్రం బాగా కనెక్ట్ అయ్యారు. ముఖ్యంగా సాయి పల్లవి పోషించిన వెన్నెల పాత్రపై మనసు పారేసుకున్నారు
తెలుగు ఆడియన్స్.
ఈ నేపథ్యంలో తాజాగా తాను వెన్నెల పాత్ర పోషించడం పట్ల మనసులో మాట బయటపెట్టింది సాయి పల్లవి. ఈ మేరకు చిత్రీకరణ సమయంలోని కొన్ని ఫొటోస్‌ని ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ విరాటపర్వం సినిమాలో వెన్నెల రోల్ పోషించడం తన అదృష్టమని చెప్పింది. ఈ పాత్రను ఎప్పటికీ మరచిపోలేనని, షూటింగ్ డేస్ కూడా తనకు ఎప్పటికీ అలాగే గుర్తుండిపోతాయని ఆమె పేర్కొంది. ఇలాంటి అద్భుతమైన రోల్ తనకు ఇచ్చినందుకు డైరెక్టర్ వేణు ఊడుగులకు అదేవిధంగా చిత్రబృందం మొత్తానికి ధన్యవాదాలు అని తెలుపుతూ సాయి పల్లవి ట్వీట్ చేసింది.
విడుదలైన తొలి రోజున విరాటపర్వం సినిమాకు మంచి మౌత్ టాక్ వచ్చినా, అది ఈ సినిమాను కమర్షియల్‌గా నిలబెట్టలేక పోయింది. సినిమాలో కంటెంట్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించలేదు. దీంతో ఈ సినిమాను రిలీజ్ అయిన 15 రోజుల్లోనే ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. నేటి నుంచే (జులై 1) ఈ విరాటపర్వం మూవీ నెట్ ఫ్లిక్స్ వేదికగా అందరికీ అందుబాటులోకి వచ్చేస్తోంది.
Vennela from #VirataParvam is one of the most memorable roles I’ve had the good fortune of playing.
It’s streaming on @NetflixIndia from today! And I’d like for you all to watch her journey!
శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్ సంస్థల సంయుక్త సమర్పనిచ్చారుణలో రూపొందిన ఈ సినిమాకు డీ సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మాతలుగా వ్యవహరించారు. చిత్రంలో నందితా దాస్, ప్రియమణి, నవీన్ చంద్ర, జరీనా వాహబ్, ఈశ్వరి రావు, సాయి చంద్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాలో కామ్రేడ్ రవన్నగా రానా నటించగా.. వెన్నెలగా సాయి పల్లవి తన నాచురల్ నటనతో అట్రాక్ట్ చేసింది. ఆలోచింపజేసే సన్నివేశాలతో పాటు ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ సినిమాలో హైలైట్ అయింది.
Published by:Sunil Boddula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.