Home /News /movies /

VIRATAPARVAM PROMOTIONS SAI PALLAVI COMMENTS ON DAGGUBATI RANA BEHAVIOR SLB

Sai Pallavi: రానా వ్యక్తిత్వం ఎలాంటిదంటే..! సాయి పల్లవి కామెంట్స్ వైరల్

Photo Twitter

Photo Twitter

Rana- Sai Pallavi: రానా హీరోగా రాబోతున్న విరాటపర్వం సినిమా విడుదల తేదీ దగ్గరపడిన నేపథ్యంలో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా రానా వ్యక్తిత్వంపై సాయి పల్లవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

దగ్గుబాటి రానా (Rana Daggubati), సాయి పల్లవి (Sai Pallavi) హీరోహీరోయిన్లుగా వేణు ఉడుగుల (Venu Udugula) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా విరాటపర్వం (Virata parvam). దాదాపు మూడేళ్ల నిరీక్షణ తరువాత జూన్ (June) 17న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రంలో రానాతో పాటు సీనియర్ హీరోయిన్ ప్రియమణి (Priyamani) కూడా నక్సలైట్‌గా కనిపించబోతున్నారు. 1990 కాలంనాటి నక్సలిజం నేపథ్యంలో ఈ కథ రాసుకొని తెరరూపమిస్తున్నారట. ఇప్పటికే విడుదలైన విరాట పర్వం పోస్టర్స్, స్పెషల్ వీడియోస్ తో అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. సినిమా విడుదల తేదీ దగ్గరపడిన నేపథ్యంలో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా రానా వ్యక్తిత్వంపై సాయి పల్లవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఒకవేళ రానా కాదంటే ఈ విరాటపర్వం సినిమానే లేదంటూ సాయి పల్లవి ఓపెన్ కామెంట్ చేసింది. ఈ సినిమాకు అన్నీ తానై ఆయనే నడిపించారని చెప్పింది. రానా తెరపై ఎలా కనిపిస్తారో బయట కూడా అలాగే ఉంటారని చెప్పింది. ఈ మేరకు రానాది పెద్ద మనసు అంటూ కొనియాడింది. రీసెంట్‌గా విరాటపర్వం ఈవెంట్ కోసం వెళితే వర్షంలో స్టేజ్‌పై రానా నాకు గొడుగు పట్టారు, అది ఆయన గొప్పతనం అని చెప్పిన సాయి పల్లవి.. ఆ మంచితనమే ఆయన ఒరిజినల్ కేరక్టర్ అని తెలిపింది. సాయి పల్లవి నోట ఈ మాటలు విని రానా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ఈ సినిమాలో హీరో రానా మెయిన్ లీడ్ అని, సాయి పల్లవి విశ్వరూపం చూస్తారని ఓ రేంజ్ లో చెబుతూ సినిమాపై హైప్ పెంచారు డైరెక్టర్ వేణు ఉడుగుల. విరాట పర్వం కథ మొత్తం సాయి పల్లవి కోణంలోంచి ఉండబోతుందని ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. పుట్టినప్పుడు అమ్మ కడుపులోనుంచే లాంటి అద్భఉతమైన డైలాగ్స్ పేలాయి ట్రైలర్ లో వీటితో పాటు ప్రేమ గురించి, యుద్ధం గురించి పెట్టిన చాలా డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక ట్రైలర్ లోనే సాయిపల్లవి నట విశ్వరూపం చూపించింది. రానా, ప్రియమణి, నవీన్ చంద్ర కూడా నక్సలైట్స్ గా అదరగొట్టారు.

శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్ సంస్థల సంయుక్త సమర్పణలో రూపొందిన ఈ సినిమాకు డీ సురేశ్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మాతలుగా వ్యవహరించారు. చిత్రంలో నందితా దాస్, ప్రియమణి, నవీన్ చంద్ర, జరీనా వాహబ్, ఈశ్వరి రావు, సాయి చంద్ ముఖ్యపాత్రలు పోషించారు.
Published by:Sunil Boddula
First published:

Tags: Rana daggubati, Sai Pallavi, Virata Parvam

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు