హోమ్ /వార్తలు /సినిమా /

Sai Pallavi: వెన్నెల పుట్టిందిలా.. తొలిపొద్దులో ఇప్పపూలు పూసినట్లు... సాయిపల్లవికి బర్త్ డే విషెస్

Sai Pallavi: వెన్నెల పుట్టిందిలా.. తొలిపొద్దులో ఇప్పపూలు పూసినట్లు... సాయిపల్లవికి బర్త్ డే విషెస్

సాయి పల్లవి

సాయి పల్లవి

ఇవాళ సాయి పల్లవి బర్త్ డే. ఈ సందర్భంగా విరాట పర్వం సినిమా టీం ఆమెకు అద్భుతమైన విషస్ అందించారు. సోల్ ఆఫ్ వెన్నెల అంటూ.. ఓ వీడియోను ప్రజంట్ చేశారు.

  టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్‌తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. తెలుగుదనం ఉట్టిపడేలా కనిపించే సాయి పల్లవి... నటనలో తనకంటే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. సాయి పల్లవి చేస్తున్న సినిమా విరాట పర్వం. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. ఇవాళ సాయి పల్లవి బర్త్ డే సందర్భంగా... విరాట పర్వం చిత్రం టీం.. ఆమెపై ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది. సోల్ ఆఫ్ వెన్నెల పేరుతో... వీడియోను బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.

  వెన్నల రెండు సార్లు పుట్టింది. తొలి పొద్దులో ఇప్పపూలు పూసినట్లు.. అడవిలో ఒకసారి. ఆశయాన్ని ఆయుధం చేసినట్లు అతని ప్రేమలో మరోసారి, అంటూ.. సాగే ఈ వీడియో ఎంతో అట్రాక్టివ్‌గా ఉంది. ఈ వీడియోలో సాయి పల్లవి మరింత నేచురల్‌గా కనిపించింది. నిర్బంధాలు కౌగిలించుకున్న వసంతకాలం మనదే.. రేపు మనం ఉన్నా లేకున్నాచరిత్ర ఉంటుంది. మన ప్రేమకందరికీ వినిపిస్తోంది’ అన్న డైలాగ్స్ తో ఈ సోల్ ఆఫ్ వెన్నెల వీడియో ముగుస్తుంది. ఇక ఈ వీడియో చూసిన సాయి పల్లవి ఫ్యాన్స్ కూడా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.  వీడియో  అద్భుతంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎరుపు  రంగు పులుముకున్న సీతాకోక చిలుకకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఓ అభిమాని పోస్టు చేశారు. హ్యాపీ బర్త్ డే సాయి పల్లవి అంటూఅనేకమంది అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

  ' isDesktop="true" id="1293944" youtubeid="WqI7rmzrj68" category="movies">

  ఇక సాయిపల్లవి విషయానికి వస్తే..  1992 మే 9న తమిళనాడు నీలగిరి జిల్లాలోని కోటగిరిలో జన్మిచింది. కొయంబత్తూర్ లోని అవిలా కాన్వెంట్ స్కూల్ లో సాయి పల్లవి చదువుకుంది. చిన్నప్పటి నుంచీ డాన్స్ అంటే ప్రాణం. నాట్యంలో ప్రత్యేక శిక్షణ ఏమీ లేనప్పటికీ, సినిమా పాటలకు అలవోకగా డాన్స్‌లతో ఆకట్టుకుంది. చివరికి  జార్జియాలోని టిబిలిసి మెడికల్ యూనివర్సిటీలో డాక్టర్ కోర్సు  స్టడీకి  బ్రేక్‌ ఇచ్చి మరీ  సినిమా రంగంవైపు అడుగులు వేసింది. ముందుగా తమిళ్, మళయాళ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత  2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో  తెలుగు ఆడియెన్స్‌కు దగ్గరైంది. భానుమతి పాత్రలో, తెలంగాణా యాసలో డైలాగులు పలికి తన  ప్రతిభను చాటుకుంది.

  Published by:Sultana Shaik
  First published:

  Tags: Rana daggubati, Sai Pallavi, Virata Parvam

  ఉత్తమ కథలు